
జననాయగన్ సినిమాలో విజయ్
‘జన నాయగన్'కు రాజకీయ పార్టీల మద్దతు
టీవీకే విజయ్‌కి సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్టులు..
దళపతి విజయ్, తమిళగ వెట్రి కళగం(Tamilaga Vettri Kazhagam)చీఫ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ కు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం చేసిన నేపథ్యంలో రేపు విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో తమిళనాడులో ఇది క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది. విజయ్ సినిమాకు మద్దతుగా కొన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా విజయ్ పార్టీ తో పొత్తుకు తహతహలాడుతున్న కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది.
సీబీఎఫ్సీ(CBFC) జాప్యం నేపథ్యంలో చిత్ర నిర్మాతలు మద్రాస్ హైకోర్టు(Madras High court)ను ఆశ్రయించారు. రేపు కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీబీఎఫ్‌సిని తన గుప్పిట్లో ఉంచుకుని ‘జన నాయగన్’ విడుదలను అడ్డుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కళా రంగానికి రాజకీయాలతో ముడిపెట్టవద్దని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక తమిళనాడు, పుదుచ్చేరి AICC ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్ మోదీని ఎక్స్ లో కోరారు .
కేంద్ర ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆరోపించారు. సీబీఎఫ్‌సీ తీరును కరూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జోతిమణి సెన్నిమలై తప్పుబట్టారు. సీబీఎఫ్సీ నిర్ణయాన్ని తమిళ చిత్ర పరిశ్రమపై దాడిగా అభివర్ణించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాను అడ్డుకోవడం తగదన్నారు.
ఇటీవల కాంగ్రెస్(Congress) కార్యకర్త ప్రవీణ్ చక్రవర్తి టీవీకే చీఫ్ విజయ్‌ను కలవడం కాంగ్రెస్-టీవీకే మధ్య పొత్తుపై ఊహాగానాలకు బీజం పడింది. “కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలుగా తమిళనాడులో అధికారంలో లేదు.
అక్కడ డీఎంకే ఇచ్చే కాస్త సీట్లతోనే తన రాజకీయాలను నడిపిస్తోంది. అలాగే చాలాసార్లు అధికార పార్టీతో దానికి పొసగడం లేదు. ఎలాగైన డీఎంకేను ఇబ్బందుల్లోకి నెట్టాలని అది ప్రయత్నిస్తోంది. ఇప్పుడు దానికి టీవీకే రూపంలో మరో ప్రత్యామ్నాయం దొరికింది.
పొత్తుపై ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. తుది నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంటుందని చెప్పారు. తాను విజయ్ ను కలిసినట్లు తమ మధ్య మంచి వాతావరణంలో చర్చలు జరిగినట్లు చెప్పారు. విజయ్ ఒక రాజకీయ శక్తిగా మారాడు. దాన్ని ఎవరూ కాదనలేరు.’’ అని అన్నారు.
Next Story

