తల్లీ కూతురికి యడియూరప్ప డబ్బులిచ్చారా? అసలు చార్జ్‌షీట్‌లో ఏముంది?
x

తల్లీ కూతురికి యడియూరప్ప డబ్బులిచ్చారా? అసలు చార్జ్‌షీట్‌లో ఏముంది?

లైంగిక వేధింపుల ఆరోపణలను విచారిస్తున్న సీఐడీ.. చార్జ్‌షీట్‌లో ఏం రాశారు? విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు యడియూరప్ప బాధితురాలు, ఆమె తల్లికి డబ్బులు ఇచ్చారా?


మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పపై అభియోగాలను విచారిస్తున్న క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి).. తన ఛార్జిషీట్‌లో యడియూరప్పతో పాటు మరో ముగ్గురు నిందితులు బాధితురాలు, ఆమె తల్లికి డబ్బు చెల్లించారని పేర్కొంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో యడియూరప్ప సహాయకులు అరుణ్ యం, రుద్రేష్ ఎం, జి మరిస్వామిలపై ఐపిసి సెక్షన్లు 204, 214 కింద కేసులు నమోదు చేశారు.

చార్జిషీట్ ప్రకారం..ఓ కేసులో న్యాయం చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఉదయం 11.15 గంటలకు 17 ఏళ్ల బాధితురాలు, ఆమె తల్లి బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని యడ్యూరప్పను నివాసానికి వెళ్లారు. యడ్యూరప్ప బాలిక తల్లితో మాట్లాడుతూనే బాలిక కుడి మణికట్టును ఎడమ చేత్తో పట్టుకున్నారు. తర్వాత బాలికను హాలు పక్కనే ఉన్న మీటింగ్ రూంలోకి పిలిచి డోర్ లాక్ చేశాడు. గతంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి ముఖం నీకు గుర్తుందా? అని బాలికను అడిగాడు. గుర్తుందని రెండుసార్లు సమాధానం చెప్పింది. తర్వాత యడియూరప్ప బాలిక వయస్సు ఎంత అని అడిగారు. ఆమె ఆరున్నర అని బదులిచ్చారు. ఆ సమయంలో యడియూరప్ప బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడని సిఐడి చార్జిషీట్ లో పేర్కొంది.

భయాందోళనకు గురైన బాలిక యడియూరప్ప చేయిని పక్కకు నెట్టి, తలుపు తెరవమని కోరింది. యడియూరప్ప తలుపు తెరిచి తన జేబులోంచి బాధితురాలి చేతిలో కొంత నగదు ఉంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత బాధితురాలి తల్లికి ఈ కేసులో తాను సహాయం చేయలేనని చెప్పి.. తన జేబులోంచి కొంత డబ్బు తీసి ఆమెకు ఇచ్చి పంపించినట్లు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

‘బాధితురాలి తల్లికి రూ.2 లక్షలు?’

బాధితురాలి తల్లి తన ఫేస్‌బుక్ ఖాతాలో ఘటనకు సంబంధించిన వీడియో అప్‌లోడ్ చేయడంతో ..యడ్యూరప్ప ఆదేశాల మేరకు ఫిబ్రవరి 20న నిందితులు అరుణ్, రుద్రేష్ మరిస్వామి బాధితురాలి ఇంటికి వెళ్లి యడియూరప్ప ఇంటికి తీసుకెళ్లారు. బాధితురాలి తల్లి తన ఫేస్‌బుక్ ఖాతా, ఆమె ఐఫోన్ గ్యాలరీ నుంచి వీడియోను తొలగించినట్లు అరుణ్ నిర్ధారించాక, యడ్యూరప్ప ఆదేశాల మేరకు రుద్రేష్ బాధితురాలికి రూ.2 లక్షల నగదు చెల్లించినట్లు సమాచారం.

‘విచారణకు సహకరించాలి’

ఈ ఏడాది మార్చి 14న యడ్యూరప్పపై నమోదైన కేసులో బెంగళూరు కోర్టు జూన్ 13న ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జూన్ 14న కర్ణాటక హైకోర్టు యడ్యూరప్పను అరెస్టు చేయకుండా సీఐడీని నిలుపుదల చేసింది. అదే సమయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. జూన్ 17న యడ్యూరప్పను సీఐడీ మూడు గంటలకు పైగా ప్రశ్నించింది.

ఈ క్రమంలో యడ్యూరప్పపై అభియోగాలు మోపిన బాధితురాలి తల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ గత నెలలో ఇక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.

మార్చి 14న కేసు నమోదు చేసినా.. దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని బాధితురాలి సోదరుడు ఈ నెల మొదట్లో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. యడ్యూరప్పను అరెస్టు చేసి విచారించాలని పిటిషనర్‌ కోరారు. ఈ అభియోగాన్ని యడ్యూరప్ప ఖండించారు. ఈ కేసుపై న్యాయపరంగా పోరాడతానని చెప్పారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న తనపై ఈడీ ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ ఆయన మరో పిటిషన్‌ వేశారు.

Read More
Next Story