‘సర్’ ను వ్యతిరేకిస్తున్న సీపీఐ నేతల అరెస్ట్
x

‘సర్’ ను వ్యతిరేకిస్తున్న సీపీఐ నేతల అరెస్ట్

విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ, అయినప్పటికీ అదుపులోకి తీసుకున్న పోలీసులు


Click the Play button to hear this message in audio format

ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్ఐఆర్) పై టీవీకే ప్రభుత్వం తీసుకున్న వైఖరిని కొనసాగిస్తూ ఉండగా, దానికి మద్దతు అందిస్తున్న మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో చెన్నై పోలీసులు శనివారం ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్(ఏఐఎస్ఎఫ్), అల్ ఇండియా యూత్ ఫెడరేషన్(ఏఐవైఫ్) లకు చెందిన వందమందిని అరెస్ట్ చేసింది.

విపక్షాలు చేస్తున్న ఆందోళనలను పట్టించుకోకుండా సర్ ను కొనసాగిస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేస్తున్న సీపీఐ విద్యార్థి విభాగం, యువజన విభాగం అనే రెండు సంస్థలను అరెస్ట్ చేశారు. సీపీఐ తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే కు బయట నుంచి మద్దతు ఇస్తోంది.

వామపక్ష విద్యార్థుల అరెస్ట్..

ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కే. భారతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కే. ఇబ్రహీం ల నేతృత్వంలో వందమందికి పైగా కార్యకర్తలు అన్నాసాలైలోని పెరియార్ విగ్రహం నుంచి తమిళనాడు సచివాలయం వరకూ పాదయాత్ర చేసి, ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. శివానంద సాలై వద్ద పోలీసులు ఈ ఊరేగింపును అడ్డుకుని, పెద్ద ఎత్తున అరెస్ట్ లు చేశారు. ఈ ఘర్షణలో ఒక నిరసనకారుడి తలకు గాయమై ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
సీజేపీ పిలుపు మేరకు జంతర్ మంతర్ వద్దే ఇదే సమస్యపై వామపక్ష నాయకులు, విద్యార్థి కార్యకర్తలు నిరసన తెలుపుతున్నప్పుడూ చెన్నైలో ఇవన్నీ జరిగాయి. చెన్నైలో కూడా ఢిల్లీ నిరసనకారులకు సంఘీభావంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్న సీజేపీకి చెందిన సుమారు 30 నుంచి 50 మంది సభ్యులను బేసెంట్ నగర్ లోని ఇలియట్స్ బీచ్ లో సమీపంలో చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విజయ్ మదిలో ఏముంది...

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ‘సర్’ నిరసనలో దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ ముందుండి నడిపిస్తోంది. అయితే టీవీకే మాత్రం ఈ నిరసనలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నామని ఓ వైపు చెబుతూనే మరో వైపు తమిళనాడు ప్రభుత్వం కాంగ్రెస్ సభ్యులను అరెస్ట్ చేయడానికి వెనకాడలేదు.
సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసన తెలపడం టీవీకే ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఈ భారీ సందేహాస్పద ఎన్నికల ప్రక్రియ తరువాత దశాబ్దాల తరువాత రెండు ద్రవిడ దిగ్గజ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలను ఓడించిన తమిళనాడులో అధికారంలోకి వచ్చింది.
అదే సమయంలో బీజేపీతో తనకున్న అస్పష్టమైన సంబంధం పై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పదేపదే విమర్శలను ఎదుర్కొన్నారు. ఎందుకంటే చెన్నై విమానాశ్రయాన్ని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కు బదులుగా మరింత సమర్థవంతమైన ప్రయివేట్ సంస్థకు అప్పగించాలని కోరుతూ ఆయన ఇటీవల ప్రధానమంత్రికి లేఖ రాశారు. అయితే విమర్శలకు గురైన అనేక ఇతర నిర్ణయాల మాదిరిగానే ఆయన కూడా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
Read More
Next Story