పవన్ ‘సనాతన’ వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ రెస్పాన్స్..
x

పవన్ ‘సనాతన’ వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ రెస్పాన్స్..

సనాతన ధర్మంపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గత ఏడాది చెన్నైలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయన ఏమన్నారంటే..


ఏపీ రాజకీయాలు తిరుమల వెంకన్న లడ్డు చుట్టూ తిరుగుతున్నాయి. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ స్థాయిలో చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పరిరక్షణ బోర్డులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఇదే సనాతన ధర్మంపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గత ఏడాది చెన్నైలో తేనాంపేటలో ‘తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ నిర్వహించిన ‘సనాతన ఒళిప్పు మానాడు’ (సనాతన ధర్మ నిర్మూలన) సదస్సులో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చడంతో హిందువులు, ముఖ్యంగా బీజేపీ నాయకులు, శ్రేణులు ఉదయనిధిపై విరుచుకుపడ్డాయి.

పవన్ వ్యాఖ్యలపై మీ స్పందనేంటి అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు 'వెయిట్ అండ్ సీ' అని చెప్పి కారులో వెళ్లిపోయారు ఉదయనిధి స్టాలిన్.

Read More
Next Story