నో ఫొటో ఘూట్ @ ఉడుపి శ్రీ కృష్ణ మఠం
x

నో ఫొటో ఘూట్ @ ఉడుపి శ్రీ కృష్ణ మఠం

పవిత్రతను కాపాడేందుకేనన్న ఈవో


Click the Play button to hear this message in audio format

ఉడుపి శ్రీ కృష్ణ మఠం పాలక వర్గం పర్యాయ పుట్టిగే మఠం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ రథోత్సవ మార్గంలో ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్‌ (Photoshoot)షూట్లపై నిషేధం విధించారు. ముఖ్యంగా కర్ణాటక, కేరళ నుంచి పెళ్లి జంటలు ఈ ఆలయానికి వస్తుంటారు. రథోత్సవ మార్గంతో ఊరేగింపులు, వార్షిక ఉత్సవాలు ముడిపడి ఉంటాయని ఆలయ కార్యనిర్వాహకుడు, వేద పండితుడు ప్రొఫెసర్ గోపాలచాయర చెప్పారు. ‘‘ఈ మధ్య ఫోటో సెషన్స్ ఎక్కువై పోయాయి. ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతినకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. అంతేతప్ప భక్తులను నిరుత్సాహపర్చడానికి కాదు’’ అని వివరణ ఇచ్చారు గోపాలచాయర.

క్షేత్ర విశిష్టతను పరిశీలిస్తే..

ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో కర్ణాటక(Karnataka) ఉడిపి శ్రీ కృష్ణ మఠం(Udupi Sri Krishna Math) ఒకటి. స్వామివారి దర్శనానికి రోజూ వేల సంఖ్యలో దేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడకు వస్తుంటారు. పర్యాటకులను కూడా ఈ క్షేత్రం ఆకర్షిస్తుంది. 13వ శతాబ్దపు మధ్వాచార్యులు స్థాపించిన ఎనిమిది మఠాలలో ఇది ఒకటి.

Read More
Next Story