మీడియాపై కేంద్ర మంత్రి సురేష్ గోపి చిందులు..
x

మీడియాపై కేంద్ర మంత్రి సురేష్ గోపి చిందులు..

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీఐ(ఎం) ఎమ్మెల్యే, నటుడు ఎం ముఖేష్‌పై మీ స్పందనేమిటని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సురేష్ గోపి మీడియాపై చిందులు తొక్కారు.


కేరళ పోలీసులు కొందరు జర్నలిస్టులపై కేను నమోదు చేశారు. త్రిసూర్ రామనిలయం ప్రభుత్వ అతిథి గృహం నుంచి బుధవారం బయటకు రాగానే మీడియా ప్రతినిధులు తనను అడ్డుకున్నారని కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి ఫిర్యాదు మేరకు కొందరు పాత్రికేయులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 329(3),126(2),132 కింద పోలీసులు కేసు కట్టారు.

మీడియాపై సురేష్ గోపీ చిందులు..

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీఐ(ఎం) ఎమ్మెల్యే, నటుడు ఎం ముఖేష్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీనిపై మీ స్పందనేమిటని అడిగిన ప్రశ్నకు గోపి మీడియాపై చిందులు తొక్కారు. "ప్రస్తుతం ఫిర్యాదులు ఆరోపణల రూపంలో ఉన్నాయి. మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు కోర్టువా? దోషులెవరో కోర్టు నిర్ణయిస్తుంది.’’ అని ఫైరయ్యారు.

గోపీ వ్యాఖ్యలకు బీజేపీ దూరం..

గోపీ వ్యాఖ్యలకు బీజేపీ దూరంగా ఉంది. ఈ సమస్యను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర యూనిట్ యోచిస్తోందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. గోపి తన అభిప్రాయాలను వెల్లడించాడని, అయితే పార్టీ వైఖరిని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని కేరళ బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ చెప్పారు.

హేమా కమిటీ నివేదిక..

మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై బలవంతపు వేధింపులను జస్టిస్ హేమా కమిటీ వెలుగులోకి తెచ్చింది. దోషులపై చర్య తీసుకోవాలని కమిటీ సూచించింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వారి మీద వచ్చిన ఆరోపణలపై విచారణకు కేరళ ప్రభుత్వం సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది.

Read More
Next Story