వందే భారత్ ‘స్లీపర్ వేరియంట్’ ఆరు నెలలు పరిశీలిస్తాం: రైల్వేమంత్రి
x
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

వందే భారత్ ‘స్లీపర్ వేరియంట్’ ఆరు నెలలు పరిశీలిస్తాం: రైల్వేమంత్రి

మోదీ ప్రభుత్వం ప్రతిష్మాతకంగా ప్రారంభించిన వందే భారత్ లో ఇక నుంచి స్లీపర్ వేరియంట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే పనులు ప్రారంభించింది.


వందే భారత్ స్లీపర్ వేరియంట్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ అన్నారు. అవి తయారయ్యాక కనీసం ఐదు నుంచి ఆరు నెలలు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఫలితాలు బేరీజు వేసుకున్నాకే ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని రైల్వే మంత్రి అన్నారు. శనివారం ఆయన బెంగళూర్ లో వందే భారత్ స్లీపర్ కోచ్ ల బాడీ స్ట్రక్చర్ ను ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) లో ఆవిష్కరించారు. ఈ సంస్థ వందే భారత్ స్లీపర్‌తో కూడిన 10 రైలు సెట్‌లను (160 కోచ్‌లు) తయారు చేయడానికి కూడా ఆర్డర్ బిడ్ దక్కించుకుంది.

BEML రక్షణ మంత్రిత్వ శాఖ క్రింద వస్తుంది ఇక్కడే రక్షణ, ఏరోస్పేస్, మైనింగ్, నిర్మాణం, రైలు, మెట్రో వంటి వివిధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసి ఆయా విభాగాలకు అందజేస్తుంది.
మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైలులో చైర్ కార్, స్లీపర్ మెట్రో అనే మూడు వెర్షన్లు ఉన్నాయని వైష్ణవ్ చెప్పారు. చైర్ కార్ వెర్షన్ ఇప్పటికే ప్రారంభించబడి మంచి ప్రజాదరణను సొంతం చేసుకుందని కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే వందే స్లీపర్ యొక్క మొదటి కార్బాడీ సిద్ధంగా ఉందన్నారు.
"ఇప్పుడు, దాని ఫర్నిషింగ్ పని జరుగుతుంది. కార్బాడీని తయారు చేయడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ దానిని పూర్తి చేశాం, త్వరలో వాటి సంఖ్య పెంచుతాం" అని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో అన్నారు.
" స్లీపర్ రైలు కూడా చైర్ కార్ పని చేసే అదే సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇది జెర్క్ లు ఇవ్వడం, శబ్ధం రాకుండా ఉంటుంది. " స్లీపర్ రైలులో ప్రయాణీకుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు.
"రైలులోకి ప్రవేశించడానికి ఇప్పుడు ఉపయోగిస్తున్నమెట్లు కూడా ఆధునీకరించాం. టాయిలెట్లు కొత్త డిజైన్లలో కనపడతాయి. ఎయిర్ కండిషనింగ్ కూడా ఇంతకుముందు వాటితో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. సీటు కుషన్ కొత్త సాంకేతికతతో కనిపిస్తుంది. రైలు లో ఆక్సిజన్ స్థాయి నిర్వహించబడుతుంది. రైళ్లన్నీ 99.99 శాతం పరిశుభ్రంగా, వైరస్ రహితంగా కనిపిస్తాయి, ” అని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లతో పోలిస్తే మెరుగైన రక్షణ, ప్రయాణ సౌకర్యాలు ఉంటాయని కేంద్రమంత్రి హమీ ఇచ్చారు.
"ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో, ఇలాంటి సౌకర్యాలతో కూడిన ఒక కోచ్ తయారీ ధర దాదాపు రూ. 10 కోట్లు అవుతుంది. అయితే, వందే భారత్ స్లీపర్ కోచ్ ధర దాదాపు రూ. 8-9 కోట్లు కే వస్తున్నాయి, ఎందుకంటే మన దగ్గర ఉన్న మానవ శక్తితో పాటు ఇప్పటికే ఉన్న సాంకేతికతను అభివృద్ది చేసి రైళ్లను తయారు చేస్తున్నాం" అని వైష్ణవ్ అన్నారు.
BEML CMD శ్రీ శంతను రాయ్ మాట్లాడుతూ, "ప్రయాణ సమయాన్ని తగ్గించడంతోపాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను ప్రజలకు అందించడానికి చేసే ఈ ప్రయత్నంలో మేము భాగస్వాములం కావడం సంతోషంగా ఉంది. మా ఉత్పత్తి సామర్థ్యం పూర్తి స్థాయిలో పనిచేస్తోంది " అని వివరించారు. మా వద్ద అత్యద్భుత ఇంజనీర్లు, సిబ్బంది, పని పట్ల నిబద్దత అంకిత భావం కలిగిన వారు ఉన్నారని సీఎండీ రాయ్ అన్నారు.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) 10 రేక్‌ల (ఒక్కొక్కటి 16 కార్లు) వందే భారత్ స్లీపర్ వెర్షన్ డిజైన్, తయారీ మరియు కమీషన్ కోసం మే 2023లో ఆర్డర్ చేసిందని BEML అధికారులు తెలిపారు.
"ఈ రైళ్లు చైర్ కార్ వేరియంట్‌ల నుంచి స్లీపర్ వెర్షన్‌లకు సజావుగా మారడానికి అవసరమైన మార్పులకు లోనవుతాయి, క్రాష్‌వర్తినెస్, ఫైర్ సేఫ్టీ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూస్తాయి" అని బీఈఎంఎల్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది.


Read More
Next Story