‘2026 అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగానే..’
x

‘2026 అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగానే..’

స్వప్రయోజనాల కోసం డీఎంకే, ఎఐఎడీఎంకే లాగా బీజేపీతో పొత్తు పెట్టుకోం. ఒంటరిగానే పోటీ చేస్తాం: TVK చీఫ్ విజయ్


Click the Play button to hear this message in audio format

తమ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు తమిళగ వెట్రీ కజగం (TVK) చీఫ్ విజయ్(Vijay). ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామని చెప్పారు. శుక్రవారం (జూలై 4) పనైయూర్‌లో జరిగిన పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. “డీఎంకే(DMK) లేదా ఎఐఎడీఎంకే(AIADMK) లాగా.. స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీతో ప్రత్యక్షంగాని, పరోక్షంగాని పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పారు.

పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్..

తమిళనాడు(Tamil Nadu)లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Polls) జరగనుండడంతో.. ఇప్పటి నుంచే టీవీకే వ్యూహాలు రచిస్తోంది. ఒంటరిగానే అధికారంలోకి రావాలని విజయ్ పట్టుదలగా ఉన్నారు. టీవీకే పరంతూరు కార్యాలయంలో జరిగిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో విజయ్‌ని ఇప్పటికే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే.

తమిళులపై హిందీ, సంస్కృతం భాషాలను కేంద్రం బలవంతంగా రుద్దడాన్ని విజయ్ తప్పుబట్టారు. తమిళనాడు మత్స్యకారులపై జరుగుతున్న దాడులను, బెదిరింపులను ఖండిస్తూ..కచ్చతీవును కేంద్ర ప్రభుత్వం అద్దె ప్రాతిపదికన లీజుకు ఇవ్వాలని కోరారు. దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వాళ్లు మీ ప్రజలు కారా?

ప్రతిపాదిత పరందూర్ విమానాశ్రయ ఏర్పాటు గురించి సీఎం ఎంకే స్టాలిన్‌ను విజయ్ ప్రశ్నించారు. ‘‘13 గ్రామాలపై ప్రభావం చూపే ఎయిర్‌పోర్టు నిర్మాణంపై గౌరవ ముఖ్యమంత్రికి లేఖ రాశాం. వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారు. అందుకు వ్యతిరేకంగా పరందూర్ ప్రజలు చాలాఏళ్లుగా నిరసన తెలుపుతున్నారు. నేను వాళ్లను వ్యక్తిగతంగా కలిశాను. మరుసటి రోజే..విమానాశ్రయం ఏర్పాటు వల్ల ప్రజలపై ఏ ప్రభావం ఉండదని ప్రకటన విడుదల చేశారు. అయితే విమానాశ్రయ నిర్మాణం జరుగుతుందా? జరగదా? అన్నది స్పష్టంగా చెప్పలేదు. 1,500 కుటుంబాలు మీ ప్రజలు కారా? మీరు ప్రతిపక్షంలో ఉంటేనే వారి గురించి పట్టించుకుంటారా? పరందూరు ప్రజలతో సచివాలయాన్ని ముట్టడికి కూడా మేం వెనుకాడం," అని హెచ్చరించారు.

విజయ్‌కు రాజకీయ చరిత్ర ఉండదు: డీఎంకే

డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ..‘‘పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలుస్తారా? లేక ఒంటరిగా పోటీచేస్తారా? అన్నది విజయ్ ఇష్టం. గతంలో డీఎంకే ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆ విషయాన్ని మరిచి డీఎంకేను విమర్శిస్తే.. ఆయనకు రాజకీయ చరిత్ర ఉండదు.’’ అని అన్నారు.

పరందూర్ విమానాశ్రయం గురించి మాట్లాడుతూ.. "తమిళనాడు అభివృద్ధికి పరందూర్ విమానాశ్రయం చాలా అవసరం. విజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అభివృద్ధిని వ్యతిరేకిస్తే ప్రజలు అతనికి మద్దతు ఇవ్వరు" అని చెప్పారు.

'విజయ్‌ని ఆహ్వానించలేదు'..

మాతో చేతులు కలపమని విజయ్‌ని మా పార్టీ ఎప్పుడు అడగలేదు అని బీజేపీ నాయకుడు కరు నాగరాజన్ పేర్కొన్నారు. విలేకర్లు మా నాయకులను అడిగినప్పుడు .. వారు ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. చూద్దాం' అని మాత్రమే చెప్పారు.

Read More
Next Story