
డీఎంకేకు నిద్రపట్టడం లేదు: విజయ్
తమిళనాడులో "కమలం" వికసించడానికి అనుమతి ఇచ్చిందెవరని ప్రశ్నించిన టీవీకే చీఫ్..
టీవీకే (Tamilaga Vettri Kazhagam) పార్టీ సమావేశాలకు జనం భారీ సంఖ్యలో హాజరవుతుండడాన్ని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆ పార్టీ చీఫ్ విజయ్ (Vijay) అన్నారు. డీఎంకే(DMK) పేరును ప్రస్తావించకుండానే ఆ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. "కాంచీపురం, పుదుచ్చేరి, ఈరోడ్లలో నిర్వహించిన బహిరంగ సభలు విజయవంతం అయ్యాయి. మమ్మల్ని ప్రజల నుంచి దూరం చేయాలనుకున్నారు. ఇప్పుడు మాతో ఉన్న ప్రజలను చూసి ఆశ్చర్యపోతున్నారు" అని ఓ ప్రకటన విడుదల చేశారు. డీఎంకే వారపత్రిక ‘మురసోలి’లో వచ్చిన ఒక కథనాన్ని విజయ్ ఖండించారు. టీవీకేపై బురద చెల్లేందుకే, పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఆ వ్యాసం రాశారని ఆరోపించారు. గతంలో కాషాయ పార్టీతో డీఎంకే పొత్తును గుర్తుచేస్తూ.. అసలు తమిళనాడులో "కమలం" (బీజేపీ చిహ్నం) వికసించడానికి డీఎంకే అనుమతి ఇచ్చిందని ఆరోపించారు.
Next Story

