తిరువనంతపురం: బీజేపీ మేయర్ అభ్యర్థి పేరు ఖరారు..
x
VV Rajesh

తిరువనంతపురం: బీజేపీ మేయర్ అభ్యర్థి పేరు ఖరారు..

కేరళ రాజధాని తిరువనంతపురంలో 45 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌పై బీజేపీ తొలిసారి విజయం..


Click the Play button to hear this message in audio format

కేరళ(Kerala) రాష్ట్రం తిరువనంతపురం(Thiruvananthapuram) మేయర్ (Mayor) అభ్యర్థి పేరును భారతీయ జనతా పార్టీ (BJP) ఖరారు చేసింది. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు వి.వి. రాజేష్ పేరును బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సి. సురేష్ అధికారికంగా ప్రకటించారు. అలాగే వైస్ మేయర్ అభ్యర్థిగా ఆషా నాత్ పేరును వెల్లండించారు. మాజీ డీజీపీ ఆర్. శ్రీలేఖ (R. Sreelekha) కూడా మేయర్‌ రేసులో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే కొంతమంది కౌన్సిలర్లు ఆమెపై వ్యతిరేకత చూపడంతో చివరకు రాజేష్‌ పేరును ఖరారు చేశారు. కొత్తగా ఎన్నికయిన కౌన్సిలర్లతో సురేష్ గురువారం (డిసెంబర్ 25న) సమావేశమయ్యారు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌లో కాషాయ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 9న ఎన్నికలు జరిగాయి. 13న ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 101 సీట్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ (NDA) 50 స్థానాలను గెలుచుకుని అతి పెద్ద ఫ్రంట్‌గా ఏర్పడింది. ఎల్‌డీఎఫ్(LDF) కూటమి 29 స్థానాలతో సరిపెట్టుకోగా, యూడీఎఫ్(UDF) 19 స్థానాలకే పరిమితమైందవి. రెండు స్థానాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో 45 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌పై బీజేపీ తొలిసారి విజయం సాధించింది. ఇక్కడ గెలుపు కాషాయ పార్టీ వికాసానికి సంకేతమని పార్టీ విశ్లేషకులు అంటున్నారు.

Read More
Next Story