కర్ణాటకలో నీటి పన్ను పెంపు?
x

కర్ణాటకలో నీటి పన్ను పెంపు?

"జనాభా పెరుగుదలకు అనుగుణంగా నీటి సరఫరా వ్యవస్థను విస్తరించాలంటే నిధులు కావాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం ’’ - కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే


కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. బెంగుళూరులో బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (BWSSB) నష్టాల్లో ఉండడంతో కొత్త ప్రాజెక్టులేమీ చేపట్టలేకపోయిందని బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి శివకుమార్ వివరణ ఇచ్చుకున్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా నిధులు లేవని, నీటి పన్ను పెంచక తప్పడం లేదని వ్యాఖ్యనించారు.

"నీటి పన్ను పెంచే యోచన గత ఎనిమిది, తొమ్మిదేళ్ల నుంచి ఉన్నదే. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నీటి సరఫరా వ్యవస్థను విస్తరించాలి. అది ఖర్చుతో కూడుకున్నది" అని డీకే చెప్పారు.

"BWSSB నష్టాల్లో నడుస్తోంది. కరెంటు బిల్లులు కట్టడానికి డబ్బు లేదు. జీతం ఇవ్వడానికి డబ్బు లేదు. పనులు ఎలా చేయాలి? వాటర్ టాక్స్ పెంచడం తప్ప మరో మార్గం లేదు. మేం అందరిపై ఈ భారం మోపం. కొన్ని వర్గాల వారిపైనే ఈ భారం ఉంటుంది. ఎంత పెంచాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. క్యాబినెట్‌ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం" అన్నారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను బట్టి జూన్‌లో నీటి పన్ను పెరిగే అవకాశం ఉంది.

Read More
Next Story