మా దృఢ సంకల్పాన్ని చూపించడానికే రూపాయి చిహ్నాన్ని మార్చాం: స్టాలిన్
x

మా దృఢ సంకల్పాన్ని చూపించడానికే రూపాయి చిహ్నాన్ని మార్చాం: స్టాలిన్

తమిళ వ్యతిరేక శక్తులే దాన్ని పెద్ద వార్తగా చేశాయన్న సీఎం


కేంద్రం తీసుకొచ్చిన త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని, భాషా విధానం పై డీఎంకే ఎంతటి దృఢ సంకల్పంతో ఉందో చూపించడానికే తీసుకుంటున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు.

అందుకోసమే 2025-26 బడ్జెట్ లో భారత రూపాయి చిహ్నాన్ని మార్చి తమిళ అక్షరం ‘రూ’ తో భర్తీ చేసినట్లు చెప్పుకొచ్చారు. తమిళం నచ్చని వారు దాన్ని పెద్దవార్తగా మార్చారని ఆరోపించారు.

కేంద్ర ఆర్థికమంత్రిపై ..
ముఖ్యమంత్రి తన రెగ్యూలర్ వీడియో ప్రసంగం ‘‘ఉంగలిల్ ఒరువన్’’ (మీలో ఒకరు) వీడియో ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రిపై విమర్శలు గుప్పించారు. రూపాయి చిహ్నం మార్పుపై స్పందించిన ఆర్థికమంత్రి, నిధుల కోసం తమిళనాడు చేసిన విజ్ఞప్తిపై స్పందించబోవట్లేదని అన్నారు.
‘‘నేను బడ్జెట్ లోగోను విడుదల చేశాను. భాషా విధానంలో మేము, మా ప్రభుత్వం ఎంత దృఢంగా ఉన్నామో తెలియజేయడానికి మా దగ్గర ‘‘రు’’ సింబల్ ఉంది. కానీ తమిళం నచ్చని బీజేపీ వారు దాన్ని పెద్ద వార్తగా మార్చారు’’ అని ఆయన అన్నారు.
కొన్ని రోజుల క్రితం తమిళనాడు ప్రభుత్వం రూపాయి గుర్తును తమిళంలో జాతీయ కరెన్సీని సూచించే ‘‘రుబాయి’’ మొదటి అక్షరం ‘‘రు’’ తో భర్తీ చేయడం దుమారానికి దారితీసింది. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
‘‘100 రోజుల పని, విపత్తు నిర్వహణకు నిధులు ఇవ్వాలని, పాఠశాల విద్య నిధులు విడుదల చేయాలని మేము కేంద్రాన్ని వేడుకుంటున్నాము. వీటిపై స్పందించని కేంద్ర ఆర్థిక మంత్రి, ఈ విషయంపై మాట్లాడారు’’ అని ఆయన అన్నారు. ఇంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి చాలా పోస్టులలో ఇలాగే ‘‘రు’’ అక్షరాన్ని ఉపయోగించారని అతను పేర్కొన్నాడు.
బడ్జెట్ విజయవంతమైంది..
‘‘ఇంగ్లీష్ లో రూపాయిని షార్ట్ కట్ లో రాస్తారు. కానీ అదివారికి పట్టింపు లేదు. కానీ తమిళంలో రాస్తేనే వారికి సమస్యగా అనిపిస్తుంది. మొత్తం మీద మా బడ్జెట్ దేశవ్యాప్తంగా విజయవంతమైంది. తమిళం కూడా అంతే విజయవంతమైంది’’ అని ఆయన అన్నారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం ద్వారా దక్షిణాది రాష్ట్రం పై హిందీని విధిస్తోందని అధికార డీఎంకే ఆరోపణలు చేస్తోంది. దశాబ్దాల నాటి తమిళం, ఇంగ్లీష్ అనే ద్విభాష సూత్రం నుంచి తాము వైదొలగబోమని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.
అయితే బీజేపీ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకోవడానికే డీఎంకే ఈవిధంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.
స్టాలిన్ విమర్శలు..
తాము ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరి నుంచి ప్రశంసలు పొందుతోందని, ప్రతిపక్షాలు నిర్మాణాత్మక విమర్శలు చేస్తే వాటిని స్వీకరించడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు.
అయితే కొంతమంది తమపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని స్టాలిన్ అన్నారు. డీఎంకే ప్రభుత్వం రుణ పరిస్థితిని అదుపులోకి ఉంచగలిగిందని గణాంకాలను ఉటంకిస్తూ ఆయన అన్నారు.
ఇంకా 2030 నాటికి తమిళనాడు ఒక ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి తాము లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. డీలిమిటేషన్ తరువాత లోక్ సభ సీట్లు తగ్గుతాయని, తద్వారా కేంద్ర నిధుల్లో వాటా తగ్గుతుందని అన్నారు.
Read More
Next Story