మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: రాహుల్, ప్రియాంక
x

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: రాహుల్, ప్రియాంక

వయనాడ్ మాజీ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక కేరళలోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించారు. క్షతగాత్రులను పరామర్శించారు.


వయనాడ్ మాజీ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ కేరళలోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను గురువారం సందర్శించారు. క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "ఇది అత్యంత విషాదకరం ఘటన. వందల సంఖ్యలో ప్రాణ నష్ట జరిగింది. కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరం. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు, మృతుల కుటుంబాలకు సాయం చేస్తాం. అండగా నిలుస్తాం’’ అని చెప్పారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. "ఘటన చాలా బాధాకరం. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వారి బాధను మేం అర్థం చేసుకోగలం. కన్నవారిని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన పిల్లలకు అని విధాల ఆదుకుంటాం’’ అని చెప్పారు.

విపత్తు నేపథ్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడారు. కొండచరియలు విరిగిపడిన ముండక్కై ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ మరికొన్ని రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. నలుగురు మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్‌కమిటీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. రెవెన్యూ మంత్రి కె రాజన్, అటవీ శాఖ మంత్రి ఎకె శశీంద్రన్, పర్యాటక శాఖ మంత్రి పిఎ మహ్మద్ రియాస్, ఎస్సీ/ఎస్టీ శాఖ మంత్రి ఒఆర్ కేలు పరిస్థితులను పర్యవేక్షిస్తారని చెప్పారు.

మంగళవారం తెల్లవారుజామున కుండపోత వర్షాల కారణంగా ముండక్కై, చూరల్‌మల, అట్టమాల, నూల్‌పుజా కుగ్రామాల్లో భారీ కొండచరియలు విరిగిపడి మహిళలు, చిన్నారులతో సహా పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. 250 మందికి పైగా చనిపోగా.. మరో 200 మంది గాయపడ్డారు.

Read More
Next Story