
‘‘ కన్నడ నటుడు దర్శన్ కు పెరిగిన కష్టాలు’’
హైకోర్టు ఇచ్చిన బెయిల్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న కన్నడ సర్కార్
నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు తన అభిమానిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దర్శన్ తూగుదీప, అతని సహచరురాలకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ పై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది.
ఈ కేసుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని హోంశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాదులు అనిల్ సి నిషానీ, సిద్ధార్థ్ లూత్రా ఈ కేసును వాదించబోతున్నారు.
ఈ పిటిషన్‌ను రెండు మూడు రోజుల్లో దాఖలు చేసే అవకాశం ఉందని బెంగళూరులోని అధికారిక వర్గాలు తెలిపాయి. బెయిల్‌ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీలు చేయాలని పోలీసులు సిఫార్సు చేస్తారని రెండు వారాల క్రితం బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద తెలిపారు. దీంతో నిందితులందరికీ కర్ణాటక హైకోర్టు డిసెంబర్ 13న బెయిల్ మంజూరు చేసింది.
కన్నడ నటుడు దర్శన్ (47)ను జూన్ 11న అరెస్టు చేశారు. తన అభిమాని రేణుకస్వామి (33) హత్యకు సంబంధించిన కేసులో పోలీసులు దర్శన్ తో పాటు నటి పవిత్ర గౌడను అదుపులోకి తీసుకున్నారు. అతని మృతదేహం ఓ మురికి నీటి కాల్వ సమీపంలో పోలీసులు కనుగొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
క్రూరమైన హత్య..
తన అభిమాన హీరో భార్యను విడిచిపెట్టి, వేరే నటితో సహజీవనం చేస్తుండటంతో రేణుకా స్వామి సదరునటికి అసభ్యకరంగా సందేశాలు పంపేవాడు. ఆమె ఈ విషయాన్ని దర్శన్ కు తెలియజేయడంతో అది భయంకరమైన హత్యకు దారి తీసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శనానికి వస్తానని చెప్పి రేణుకాస్వామిని షెడ్డుకు రప్పించారు. అక్కడ చిత్రహింసలు పెట్టి చంపేశారు. శరీరం అనేక గాయాలు ఉన్నాయి. నేరంలో నిందితులను ప్రేరేపించి కుట్ర పన్నడంలో పవిత్ర గౌడ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
దర్శన్ వెన్నెముకకు శస్త్రచికిత్స
గతంలో వైద్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందిన దర్శన్ వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకునేందుకు బళ్లారి జైలు నుంచి అక్టోబర్ 30న విడుదలయ్యారు. ఆ తర్వాత పవిత్ర గౌడతో పాటు మరో ఏడుగురికి కూడా బెయిల్ మంజూరైంది. వారందరినీ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన బెంగళూర్ లో ఉన్నాడు.
Next Story