అవసరం అయితే పునరావాసం కల్పిస్తాం: సిద్ధరామయ్య
x
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

అవసరం అయితే పునరావాసం కల్పిస్తాం: సిద్ధరామయ్య

యలహంక ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు


బెంగళూర్ లోని యలహంకలోని ఫకీర్ కాలనీ, వసీం లే అవుట్ తొలగింపు కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమర్థించుకున్నారు.

‘‘ప్రభుత్వ భూమిని ఆక్రమణలు తొలగింపు అనివార్యమే అయితే, మానవతావాద అంశాలను దృష్టిలో పెట్టుకుని నిరాశ్రయులైన వారికి ప్రత్యామ్నాయా ఏర్పాట్లు ఉండేలా అధికారులకు కఠినమైన సూచనలు ఇచ్చాము’’ అని సీఎం అన్నారు.

తొలగింపు సమర్థనీయమే..
న్యూఢిల్లీలోని కర్ణాటక భవన్ లో విలేకరులతో మాట్లాడారు. ఈ విషయంపై ప్రభుత్వ వైఖరిని వివరించారు. యలహంకలో తొలగింపు డ్రైవ్ వెనక గల కారణాలను వివరించారు.
‘‘ఈ ప్రాంతం మొదట వ్యర్థాల కోసం నిర్వహణ కోసం కేటాయించబడింది. నివాసాలను ఏ విధంగాను తగినది కాదు. అక్కడ అక్రమంగా స్థిరపడిన వారికి ముందుగానే నోటీసులు జారీ చేసి ఖాళీ చేయాలని కోరారు.
అయితే హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో తొలగింపుతో ముందుకు సాగడం తప్ప ప్రభుత్వానికి వేరే మార్గం లేదు’’ అన్నారు. ఇక్కడ నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది వలస కార్మికులే అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వ మానవతా దృక్ఫథాన్ని వివరించారు. ‘‘వారిని వీధుల్లోకి నెట్టడం మా ఉద్దేశ్యం కాదు. అందువల్ల వారి బస కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నేను పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, కమిషనర్ ను ఆదేశించాను’’ అని ఆయన అన్నారు.
బుల్డోజర్ జస్టిస్ వ్యాఖ్య..
యలహంకలో తొలగించిన వారిలో కొందరు కేరళకు చెందినవారని నివేదికలు వచ్చాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది క్రమంగా రాజకీయ వివాదంగా మారింది.
పినరయ్ తొలగింపు కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ లో కనిపించే బుల్డోజర్ న్యాయంతో పోల్చారు. ఈ వ్యాఖ్య తీవ్ర ప్రతిచర్యలకు దారితీసింది. దీనికి ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు.
అక్రమ ఆక్రమణలను సహించలేము. అదే సమయంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మానవతా దృక్ఫథంతో నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేరళ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు.
కర్ణాటక విషయాల్లో కేరళ ముఖ్యమంత్రి జోక్యం అనవసరమని డీకే ఘాటుగా వ్యాఖ్యానించారు. తమకు ఏం చేయాలో తెలుసని, ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఎక్కడైన ఇటువంటి చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ ఛైర్మన్ అయిన డీకే శివకుమార్ పేర్కొన్నారు.
Read More
Next Story