కన్నడ నటుడు దర్శన్ గురించి నటి సంజన ఏమన్నారు? దివ్య స్పందనేంటి?
x

కన్నడ నటుడు దర్శన్ గురించి నటి సంజన ఏమన్నారు? దివ్య స్పందనేంటి?

నటుడు దర్శన్‌ను అరెస్టు అయి మూడురోజులు అవుతోంది. అయితే ఆయనను కన్నడ సినీ వర్గాలు తప్పుపట్టలేదు. కానీ..


నటుడు దర్శన్‌ను అరెస్టు అయి మూడురోజులు అవుతోంది. అయితే ఆయనను కన్నడ సినీ వర్గాలు తప్పుపట్టలేదు. ఇటు మద్దతు తెలుపలేదు. కాని నటి-నిర్మాత-రాజకీయ నాయకురాలు రమ్య అకా దివ్య స్పందన మాత్రం 'అలవాటుగా మారిన నేరస్థుడు’ అని దర్శన్‌పై ముద్ర వేశారు. దర్శన్ తనకు తాను ఎక్కువగా అంచనా వేసుకుంటున్నాడని ఇటీవల ఒక టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

అంతకుముందు ఆమె కర్ణాటక పోలీసులను అభినందిస్తూ ఎక్స్‌లో ఇలా పోస్ట్ చేశారు. హత్యకు కుట్రదారుడైన దర్శన్‌ను అరెస్ట్ చేయడం గొప్ప పని. ఎవరూ చట్టానికి అతీతులు కాదు'.

దర్శన్ కేవలం నిందితుడే..

నటి సంజ్జనా గల్రానీ మాత్రం దర్శన్‌కు మద్దతుగా నిలిచారు. తాను కేవలం నిందితుడని, దోషి కాదని పేర్కొన్నారు. ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దర్శన్ అరెస్టు గురించి ఇన్‌స్టాగ్రామ్ చూసి షాక్ అయ్యానని చెప్పారు. జూన్ 12వ తేదీ కన్నడ చిత్ర పరిశ్రమకు "బ్లాక్ డే" అని పేర్కొంది.

దర్శన్‌ను బాక్సాఫీస్ కింగ్ అని పిలుస్తూ..అతను ఎలాంటి వ్యక్తో తనకు తెలుసునని చెప్పారు. అతను నిర్దోషిగా బయటకు వస్తాడన్న నమ్మకాన్నిఆమె వ్యక్తం చేశారు. సెలబ్రిటీపై 5% ఆరోపణ ఉంటే, అది 500% ఆరోపణలు జోడించడం సరికాదన్నారు.

ఒక వ్యక్తిపై అంత తొందరగా చెడు ముద్ర వేయకూడదన్నారు. పోలీసులు, చట్టం వాటి పని అవి చేయనివ్వండి. బాధితురాలికి కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

బెయిల్‌పై ఉన్న గల్రానీకి..

యాదృచ్ఛికంగా కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించిన డ్రగ్ రాకెట్‌పై విచారణకు సంబంధించి గల్రానీని కర్ణాటక పోలీసుల సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సెప్టెంబర్ 8, 2020న అరెస్టు చేసింది. ఇదే కేసులో నటి రాగిణి ద్వివేది కూడా అరెస్టయ్యారు. మూడు నెలల జైలు శిక్ష తర్వాత గల్రానీకి బెయిల్ మంజూరైంది.

నిషేధం విధించకపోవడాన్ని తప్పుబడుతున్న నేటిజన్లు

ఇదిలా ఉండగా.. దర్శన్‌పై కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కెఎఫ్‌సిసి) నిషేధం విధించకపోవడాన్ని కొంతమంది నేటిజన్లు తప్పుబట్టారు.

2011లో గృహహింస ఆరోపణలపై దర్శన్ అరెస్ట్ అయినప్పుడు.. ఆయన సహనటి నికితా తుక్రాల్‌కు హత్యకేసు నిందితులతో సంబంధం ఉందని కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆమెపై నిషేధం విధించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సెప్టెంబరు 12, 2011 నాటి బిబిసి నివేదికలో అప్పటి అసోసియేషన్ ప్రెసిడెంట్ మునిరత్నం ఇలా పేర్కొన్నారు. "తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పి, సినిమాల్లో మాత్రమే పనిచేస్తానని, తోటి నటీనటుల ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని చెబితే తాము ఆమెపై నిషేధాన్ని ఎత్తివేస్తాం. కన్నడ చిత్ర పరిశ్రమకు ఇది మొట్టమొదటి నిషేధం. ఇతరులకు ఇది గుణపాఠం కావాలి’’ అని చెప్పారు.

తమిళం, తెలుగు వంటి ఇతర ప్రాంతీయ భాషలలో కూడా నటించిన తుక్రాల్ దర్శన్‌తో తనకు వివాహేతర సంబంధం ఉందని వస్తున్న వార్తలను ఖండించారు.

దర్శన్ ఎందుకు హత్య చేశాడు?

దర్శన్‌‌కు దాదాపు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మితో పెళైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. మోడల్‌, బుల్లితెర, సినీ నటి అయిన పవిత్ర గౌడతో దర్శన్‌ కొన్నేళ్లుగా కలిసి ఉంటున్నారు. ఈ సంబంధం వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో చిత్రదుర్గ జిల్లా కేంద్రానికి చెందిన రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని ఆమెకు అశ్లీల సందేశాల పంపడంతో పాటు దర్శన్‌ను విడిచిపెట్టాలని హెచ్చరించినట్లు పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసింది. 33 ఏళ్ల రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో ఛాలెంజింగ్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న దర్శన్‌, అతని సహచరులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Read More
Next Story