విపత్తుల నుంచి కేరళ ఇళ్ల నిర్మాణాలు ఎలాంటి పాఠాలు నేర్చుకుంటున్నాయి?
x

విపత్తుల నుంచి కేరళ ఇళ్ల నిర్మాణాలు ఎలాంటి పాఠాలు నేర్చుకుంటున్నాయి?

దేవభూమి కేరళలో ప్రకృతి విపత్తులు అనేకం సంభవిస్తున్నాయి. ప్రజలను వాటి నుంచి రక్షించిన ప్రభుత్వాలు అనేక సహాయక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది బాధితులకు..


వయనాడ్ చుట్టుపక్కలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడటం అనేది గత ఐదు సంవత్సరాల కాలంలో రెండోసారి జరిగిన దుర్ఘటన. ఇంతకుముందు ఆగష్టు, 2019 లో ఇలాగే కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రాంతంలో చాలామంది మరణించారు.

వీరికోసం కేరళ ప్రభుత్వం పునరావాస( హర్షం హౌజింగ్ సొసైటీ) శిబిరాలను నిర్మించి అండగా నిలిచింది. మెప్పాడి సమీపంలోని పూతకొల్లిలో ప్రభుత్వం 53 మంది బాధిత కుటుంబాలకు భూమిని కేటాయించింది. ఈ భూమిని మాతృభూమి అనే న్యూస్ ఛానెల్ ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వగా, రాష్ట్రంలోని వివిధ స్వచ్చంద సంస్థలు ఇళ్లను నిర్మించి ఇచ్చాయి. అయితే ఈ నివాసాల్లో ప్రస్తుతం లీకేజీ సమస్య అధికంగా ఉంది.

ఇళ్ల నిర్మాణం బాగున్నప్పటికీ పై కప్పు నుంచి వర్షాకాలంలో మాత్రం అదేపనిగా లీకేజీ సమస్య ఈ బాధిత కుటుంబాలను వేధిస్తోంది. జూలై 30, 2024 నాటి కొండచరియలు విరిగిపడిన తరువాత పునరావాస ప్రయత్నాలను కవర్ చేయడానికి ఫెడరల్ బృందం వాయనాడ్‌ వెళ్లింది .




చిత్రంలో కనిపిస్తున్న బాధిత మహిళ పేరు సులేఖ పీఏ, వయస్సు 55 సంవత్సరాలు. ఆమె భర్త అబూబకర్‌ పుత్తుమల కొండచరియలు విరిగిపడటంతో మరణించారు. ప్రమాదాన్ని ముందే గుర్తించి ప్రభుత్వం వీరిని ఇంటి నుంచి ఖాళీ చేయించిన మేకలను సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుండగా విపరీతమైన బురద ప్రవాహంలో అబుబకర్ చిక్కుకున్నాడు. అతని మృతదేహం ఇప్పటికీ దొరకలేదు. సులేఖ ఇప్పుడు తన కుమారుడు అష్కర్ తో కలిసి నివసిస్తోంది. తండ్రి మరణానంతరం అష్కర్ మిడిల్ ఈస్ట్ లో ఉద్యోగాన్ని వదులుకుని రావాల్సి వచ్చింది.
లీకేజీ పైకప్పులు
"మేము అందుకున్న ఇల్లు అద్భుతమైనది, కానీ గదిలో పైకప్పు లీక్ అవుతోంది. దాన్ని పరిష్కరిస్తే పూర్తి సంతృప్తిగా ఉంటోంది. దీన్ని నిర్మించిన ప్రభుత్వానికి, సంస్థలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను, అయితే ఈ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ ఇంటికి అదనంగా మరో గదిని నిర్మించుకున్నాం. ఆ గదిని వంట చేసుకోవడానికి వాడుకుంటున్నాం’’ అని సులేఖ ది ఫెడరల్ తో చెప్పారు.
"మేము చాలా కాలంగా ఈ సమస్యను లేవనెత్తుతూనే ఉన్నాం. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఏ సంస్థ ఇల్లు కట్టిందో మాకు తెలియదు. ప్రభుత్వ శాఖ వారు సహాయం చేయలేకపోతున్నామని చెప్పారు. హౌసింగ్ ప్రాజెక్ట్ మొత్తం ఒకే గ్రూప్ చేసి ఉంటే ఇలాంటి ఆందోళనలు చేయడం సులువుగా ఉండేది. మా ఇంటిని మొదట్లో ఒక సంస్థ నిర్మించింది. తరువాత దీనిని మలబార్ గ్రూప్ (మలబార్ గోల్డ్ జ్యువెలర్స్ యొక్క CSR ఫండ్) పూర్తి చేసింది” అని ఆమె చెప్పారు.
మరో బాధిత కుటుంబం



జసీలా ఎ, వయస్సు 39, ఆమె భర్త అబ్దుల్ రసాక్.. వారి ఇద్దరు కుమార్తెలు ఈ విపత్తు నుంచి బయటపడ్డారు, ఒక అమ్మాయి బురద నీటిలో చిక్కుకునిపోయి చాలా ఇబ్బంది పడింది. ఈ సంఘటనలో అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. చాలాకాలం పాటు చికిత్స తీసుకున్న తరువాత ఆరోగ్యం మెరుగుపడింది. ప్రస్తుతం ఆ అమ్మాయి డిగ్రీ చదువుతోంది.
ఫెడరల్ వారి ఇంటికి వెళ్ళినప్పుడు, సెలవుదినం కావడంతో చిన్న అమ్మాయి ఇంట్లో ఉంది. ఆమె ఇప్పుడు పదో తరగతి చదువుతున్న పాఠశాల తాజా ముండక్కై విషాదం తర్వాత సహాయక శిబిరంగా ఉపయోగిస్తున్నారు.
పరిహారం అందలేదు
భవన నిర్మాణ కార్మికుడైన అబ్దుల్ రసాక్ తన ఇంటిని తానే నిర్మించుకోవాలని భావించినా అధికారుల నుంచి అనుమతి రాలేదు. “ఇల్లు నిర్మించడానికి మా స్వంత ప్రణాళికలు ఉన్నాయి. కాంక్రీట్‌ పైకప్పు వేయాలనుకున్నాం. కానీ ప్రాజెక్ట్‌లోని అన్ని ఇళ్లు డిజైన్‌లో ఒకేలా ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. వీరు నిర్మించిన మా పైకప్పు ఆస్బెస్టాస్‌తో ఉంటుంది. వర్షం పడినప్పుడు, కొండచరియలను గుర్తుచేస్తూ భయంకరమైన శబ్ధం వస్తుంది. ఇది మాకు ముఖ్యంగా మా పాప కు ఓ ట్రిగ్గర్ లాంటిది.’’ అని జసీలా చెప్పారు.
“పునరావాస పథకం కింద మాకు పూర్తి మొత్తం అంటే రూ. 4 లక్షలు కూడా రాలేదు. స్వచ్చంద సంస్థ ఈ ఇంటికి 3.5 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. మేము ప్లాన్‌ను కొద్దిగా మార్చి నిర్మించాం.. ఆ మొత్తం కూడా ఇప్పటి వరకూ రాలేదు ” అని జసీలా ఆవేదన వ్యక్తం చేశారు.



“మా ఇంటి పైకప్పు లీక్ అవుతోంది, మాతో పాటు నిర్మించిన 40 కి పైగా ఇళ్లలో ఇదే సమస్య ఉందని తెలిసింది. ఈ ఇళ్లను వివిధ సంస్థలు నిర్మించాయి. నిర్వహణ క్లెయిమ్‌ల కోసం మేము వారిని సంప్రదించలేము. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం మాకు సహాయం చేయడమే మాకు ఇప్పుడు అవసరం, ”అని హర్షం ప్రాజెక్ట్‌లోని మరొక నివాసి అలవికుట్టి చెప్పారు.
నాణ్యతకు తిలోదకాలు..
2005 నాటి సునామీ దుర్ఘటన తరువాత చేపట్టిన నిర్మాణాలన్నీ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. అనేక ప్రభుత్వేతర సంస్థలు వీటిని నిర్మాణంలో పాల్గొన్నాయి. ఆ తర్వాత వచ్చిన సముద్రపు అలలు, రుతుపవనాల వర్షాల వల్ల ఈ ఇళ్లు దెబ్బతిన్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయి. సునామీ పునరావాస ప్రాజెక్టు కింద నిర్మించిన ఇళ్లు, ఫ్లాట్ల నిర్వహణను మత్స్యశాఖ లేదా స్థానిక స్వపరిపాలన శాఖల పథకాల్లో చేర్చి చేపట్టే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
చక్కగా సాగుతున్న ఇళ్లు
మరోవైపు తిరువనంతపురంలో సముద్ర కోతకు గురవుతున్న మత్స్యకారుల కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మిషన్ లైఫ్ (జీవనోపాధి పొందుపరచడం, ఆర్థిక సాధికారత) కింద నిర్మించిన గృహనిర్మాణ ప్రాజెక్టు బాగానే ఉంది. 2018లో లబ్ధిదారులకు అందజేసిన కాంప్లెక్స్‌లో 192 యూనిట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి రెండు బెడ్‌రూమ్‌లు, ఒక హాల్, వంటగది స్నానపు గదులు ఉన్నాయి.
“సునామీ సంభవించిన కాలం నుంచి, కేరళ నాసిరకం గృహాల సమస్యలను ఎదుర్కొంది. ప్రభుత్వం భూమిని అందిస్తుంది. కొన్ని సంస్థలు నాసిరకం వస్తువులతో గృహాలను నిర్మిస్తాయి. ఇది లీకేజీలు, నిర్వహణ ఫిర్యాదులకు దారి తీస్తుంది. దీనికి ప్రభుత్వం కొత్త తరహ నమూనాలను అభివృద్ది చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ పర్యవేక్షణ, కఠినమైన మార్గదర్శకాలు విధిస్తాం. ఇది విజయవంతమైతే, ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారు, కానీ ఏదైనా తప్పు జరిగితే, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి కె రాజన్ ఫెడరల్‌తో అన్నారు.
ప్రభుత్వ గృహనిర్మాణ ప్రణాళికలు
ప్రస్తుతం 661 కుటుంబాలకు చెందిన 2,139 మంది శిబిరాల్లో ఉన్నారు. నిజంగా అవసరమైన వారిని గుర్తించి వారికి అద్దె వసతి కల్పిస్తాం. దీన్ని సులభతరం చేయడానికి, ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఇళ్ళు, నంబర్ లేని ఆస్తులు, ప్రభుత్వ అపార్ట్‌మెంట్లు, క్వార్టర్‌లను గుర్తిస్తోంది. మేము రవాణా, ప్రీఫ్యాబ్ గృహాలను కూడా నిర్మిస్తాము,” అని మంత్రి తెలిపారు.



ఫిర్యాదులు
2019 కవలప్పర కొండచరియల బాధితులకు పునరావాస ప్రాజెక్టుపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. పుత్తుమల అదే రోజున కవలప్పర కొండచరియలు విరిగిపడి 59 మంది ప్రాణాలు కోల్పోగా, 128 ఇళ్లు ధ్వంసమయ్యాయి. బతికిన వారిలో సగం మందికి ఇప్పటికీ శాశ్వతంగా పునరావాసం కల్పించలేదు. గిరిజన ప్రజల భూ రికార్డులు, గుర్తింపు రికార్డులు అందుబాటులో లేకపోవడం వంటి పలు సాంకేతిక సమస్యల వల్ల ఈ జాప్యం జరుగుతోంది.
పునరావాస బాధ్యత తమ పార్టీదేనని, ప్రభుత్వం ఏమీ చేయలేదని కొందరు ముస్లిం లీగ్ కార్యకర్తలు పేర్కొనడంతో వివాదం నెలకొంది. దీంతో మాజీ మంత్రి కెటి జలీల్, ముస్లిం లీగ్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ముస్లిం లీగ్ వివాదం
“ప్రభుత్వం అందించిన స్థలంలో వ్యాపారవేత్త ఎంఏ యూసుఫ్ అలీ ముప్పై రెండు ఇళ్లను నిర్మించగా, కవలప్పరలో ప్రభుత్వం 96 ఇళ్లను నిర్మించింది. ఇప్పటికీ నిర్మాణంలో ఉన్న 10 ఇళ్లు లీగ్‌ ద్వారా నిర్మించామని చెప్పుకుంటున్న లబ్ధిదారులు ఎవరు? నిలంబూరులో విపత్తు జరిగి ఐదేళ్లు కావస్తున్నా ఇంకా 10 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. వారు మరో తాజ్ మహల్ నిర్మిస్తున్నారా? అని మాజీ మంత్రి తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వ్యాఖ్యానించారు.
కావలప్పర ప్రాణాల కోసం తమ పార్టీ నిధుల సేకరణలో నిమగ్నమై లేదని ఐయుఎంఎల్ నాయకుడు పివి అబ్దుల్ వహాబ్ తరువాత స్పష్టం చేశారు. వరద బాధితుల కోసం పార్టీ ద్వారా సేకరణ జరిగిందని, 10 ఇళ్లను నిర్మిస్తున్నామని, అర్హులైన లబ్ధిదారులకు త్వరలో అందజేస్తామని ఆయన చెప్పారు. ఇటువంటి వివాదాలు పునరావాసం కోసం భూమి ప్రతిపాదనలను అంగీకరించేటప్పుడు జాగ్రత్తగా నడుచుకోవాలని కూడా ప్రభుత్వాన్ని ప్రేరేపించాయి.
తాజాగా ప్రభుత్వ విధానం
"మాకు 150 ఎకరాల భూమి కోసం ఆఫర్ వచ్చింది, కానీ వాస్తవానికి అది ఒక విధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమణలాంటిది. ఈ సమయంలో మేము అలాంటి ఆఫర్‌లను అంగీకరించడం లేదు. తదుపరి సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటాం.
వాస్తవానికి, పునరావాస ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి ప్రైవేట్ భూమి అవసరం లేదు. ప్రస్తుతం ల్యాండ్ ట్రిబ్యునల్స్‌లో వ్యాజ్యం ఉన్న భూమిని పరిష్కరించడం ద్వారా రెవిన్యూ శాఖ పునరావాస ప్రాజెక్ట్ కోసం తగినంత భూమి అందుతుంది. మేము ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నాము,” అని రెవెన్యూ మంత్రి కె రాజన్ ది ఫెడరల్‌తో అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత కాలంలో సమగ్ర గృహనిర్మాణం, పునరావాస ప్యాకేజీని ప్లాన్ చేస్తోంది. ప్రజల ఆదరణ పొందేందుకు ఇదొక అవకాశం కావచ్చు, అయితే అది విఫలమైతే విపత్తు కూడా తప్పదని వారికి పూర్తిగా తెలుసు.
Read More
Next Story