‘నిజం కంటే అబద్దానికి వేగం ఎక్కువ.’ అని ట్వీట్ చేసిన  నటుడెవరు?
x
Actor Jayasurya

‘నిజం కంటే అబద్దానికి వేగం ఎక్కువ.’ అని ట్వీట్ చేసిన నటుడెవరు?

జస్టిస్ హేమ కమిషన్ కేరళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు డైరెక్టర్లు, నటులు, రాజకీయ నాయకులపై కేసులు నమోదయ్యాయి.


జస్టిస్ హేమ కమిషన్ కేరళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు డైరెక్టర్లు, నటులు, రాజకీయ నాయకులపై కేసులు నమోదయ్యాయి. 2013లో ఓ సినిమా షూటింగ్‌లో మలయాళ నటుడు జయసూర్య, మరో నటుడు ఎం ముఖేష్ తనను లైంగికంగా వేధించారని ఓ మహిళా నటి ఫిర్యాదు చేశారు. దీంతో నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ముఖేష్‌పై ఇప్పటికే ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు కాగా, మలయాళ నటుడు జయసూర్యపై రెండు కేసులు నమోదయ్యాయి. వీటిపై జయసూర్య సామాజిక మాధ్యమం వేదిక‌గా స్పందించారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను చట్టపరంగానే ఎదుర్కొంటానని తెలిపారు.

తప్పుడు ఆరోపణలు కూడా వేధింపులతో సమానం

"నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. వాటిని న్యాయపరంగానే ఎదుర్కొంటా. మనస్సాక్షి లేనివారే ఇలా చేస్తారు.ఆరోపణలను ఎదుర్కోవడం కూడా ఒకరకంగా వేధింపుల లాంటిదే. అబద్ధం నిజం కంటే వేగంగా ప్రయాణిస్తుంది. కానీ నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. ప్రస్తుతం నేను, నా కుటుంబం యుఎస్‌లో ఉన్నాం. నా పనులు పూర్తికాగానే ఇండియాకు తిరిగివస్తా. నాకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నిర్దోషినని నిరూపించుకుంటా. ’’ అని సామాజిక మాధ్యమం ఖాతాలో పోస్ట్ చేశారు.

హేమ కమిటీ గురించి క్లుప్తంగా..

మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపుల ఉదంతాలను బహిర్గతం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2017లో జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది.2019లో తన నివేదికను సమర్పించింది. అయితే నివేదికను విడుదల చేయడంలో న్యాయపర సవాళ్లు ఎదురవుతున్నందున ఇప్పటి వరకు ఆ నివేదికను బహిరంగపరచలేదు. ఇటీవల హేమా కమిటీ 235 పేజీల తన నివేదికను ప్రచురించింది. మలయాళ చిత్ర పరిశ్రమ 10-15 మంది పురుష నిర్మాతలు, దర్శకులు, నటుల నియంత్రణలో ఉందని పేర్కొంది. ముఖేష్, జయసూర్యతో పాటు సిద్ధిక్, మణియంపిల్ల రాజు, ఇడవేల బాబు, దర్శకుడు రంజిత్‌లపై మహిళా నటులు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసులు నమోదయ్యాయి.

Read More
Next Story