
హిందీని బలవంతంగా రుద్దుతున్నట్లు తమిళనాడు ఎందుకు భావిస్తోంది?
డీఎంకే వాదిస్తున్నట్లు దీనిపై పార్లమెంట్ లో సరైన చర్చ జరగలేదా?
పీ. మహలింగం
రాజ్యాంగబద్దమైన ఆదేశం లేనందున కేంద్రం రహస్యంగా తమిళనాడులో హిందీని ప్రవేశపెట్టడానికి యత్నిస్తోందని డీఎంకే సర్కార్ ఆరోపిస్తోంది. పార్టీ అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై ‘ ది ఫెడరల్’ మాట్లాడారు.
ముందు రాజమార్గం ద్వారా హిందీని ప్రవేశపెట్టడానికి చేసిన ప్రయత్నాలు జరిగాయి. ఇవన్నీ విఫలం అయ్యాక కొత్త విద్యావిధానం-2020 ద్వారా త్రి భాష సూత్రాన్ని ముందుకు తీసుకువస్తున్నారని ఇది మోసపూరిత మార్గమని విమర్శించారు.
‘‘1968లో హిందీని తప్పనిసరిగా మూడో భాషగా చేసినప్పుడూ ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, తాజా కొత్త విధానంతో ముందుకు వచ్చారని, ఇది ఆప్షనల్ అని చెప్పడం ద్వారా పరోక్ష విధానాన్ని అనుసరిస్తున్నారని ’’ అని ఆయన అన్నారు.
రెండు వైపులా దాడి..
తమిళనాడు మూడు భాషల సూత్రానికి అంగీకరించేలా బలవంతం చేయడం, అదే సమయంలో తెలుగు లేదా కన్నడ వంటి ప్రాంతీయ భాషలను బోధించగల ఉపాధ్యాయులకు అవకాశాలను సృష్టించకుండా ఉండటమే ఈ విధానం అని అన్నాదురై వివరించారు.
‘‘ఇది విద్యార్థులను ప్రత్యామ్నాయంగా హిందీని ఎంచుకోవలసి వస్తుంది’’ అని అన్నారు. 1968 జాతీయ విద్యా విధానం భారత్ అంతటా భాషా అసమానతలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మూడు భాషలు ప్రాంతీయ భాష(మాతృభాష), హిందీ (లింగ్ లాంగ్వేజ్) ఇంగ్లీష్(గ్లోబల్ లాంగ్వేజ్) ను తీసుకొచ్చారు.
కానీ ఇది హిందీ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. విద్యార్థులు తమ ప్రాంతీయ భాష తో పాటు ఇంగ్లీష్, మరేదైన భారతీయ భాషను మూడవ భాషగా ఎంచుకోవచ్చు. అనేక ఆందోళనల తరువాత 1968 అధికార భాషల చట్టంపై తీర్మానం ద్వారా తమిళనాడును త్రిభాషా సూత్రం మినహయించి, దాని ద్విభాష విధానాన్ని అనుసరించడానికి అనుమతించారు.
కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ విద్యా విధానం కింద హిందీని నేర్చుకోవాలని, అందుకోసం త్రిభాష సూత్రాన్ని ముందుకు తెస్తున్నారు.
చర్చలేదు..
మద్రాస్ విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ ప్రొఫెసర్, పాలిటిక్స్ సైన్ విభాగం మాజీ అధిపతి రాము మణివన్నర్ ‘ది ఫెడరల్’ తో మాట్లాడుతూ.. ‘‘కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లేదా మరే ఇతర ప్రజాస్వామ్య వేదికలో జాతీయ విద్యావిధానం-2020 గురించి సరైన చర్చ జరపలేదు.
ఎలాంటి మర్యాదలను పాటించలేకుండా విధానాన్ని అమలు చేస్తోంది’’ అని అన్నారు. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విద్యార్థులు స్వచ్చందంగా హిందీని తమ మూడవ భాషగా ఎంచుకునే అవకాశం లేదని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు స్కోరింగ్ కోసం సంస్కృతాన్ని ఎంచుకునేవారు. తమిళనాడులో తెలుగు వంటివి ఎంచుకున్నారు. కానీ కొత్త విద్యా విధానం ద్వారా ఈ ఛాన్స్ లేదు.
హిందీ లేదా ఇతర రాష్ట్రాలలో..
ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి హిందీ మాట్లాడే రాష్ట్రాలలో విద్యార్థులు, సంస్కృతం, ఇంగ్లీష్, పంజాబీ వంటి భాషలను ఎంచుకోవచ్చు. కానీ తమిళం, మలయాళం, తెలుగు వంటి దక్షిణాది భాషలను ఎంచుకునే అవకాశం లేదు.
హిందీ మాట్లాడేవారికి దేశంలోని ఇతర భాషలను నేర్చుకునే ప్రొత్సహించడానికి ప్రేరణ, మౌలిక సదుపాయాలు లేకపోవడం. తమిళ్ మాట్లాడేవారు.. హిందీ నేర్చుకుంటారు కానీ, హిందీ వారికి తమిళ్ రాదు. కమ్యూనికేషన్ తరుచుగా ఇంగ్లీష్ పై ఆధారపడి ఉంటుంది. ఇంగ్లీష్ లేకపోతే కమ్యూనికేషన్ అది అసమర్థంగా ఉంటుంది.
మద్రాస్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసర్ తమిళనాడు ఇంగ్లీష్ పట్ల ఆసక్తి చూపుతున్నారని, ఎందుకంటే హిందీ, హిందీయేతర రాష్ట్రాలు రెండు దాని ప్రపంచ ప్రాముఖ్యత కోసం భాషకు ప్రాధాన్యత ఇస్తాయి. మూడో భాషకు ఆచరణాత్మక వనరుగా కాకుండా కేవలం లాంఛనప్రాయంగా ఉపయోగించుకుంటాయి.
మూడో భాషను సమర్థవంతంగా బోధించడానికి శిక్షణ పొందిన విద్యావేత్తలు, పాఠ్యాంశాల కోసం తగినంత సమయం కేటాయింపు అవసరం. తమిళనాడు సహ అనేక రాష్ట్రాలు తప్పనిసరిగా కానీ భాషలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడట్లేదు. ఉదాహరణకు తమిళనాడులో తెలుగును మూడో భాషగా ఎంచుకుంటే తగినంత సంఖ్యలో అర్హత కలిగిన ఉపాధ్యాయులను తీసుకురావడంలో అనేక సవాళ్లను ఎదుర్కొవలసి ఉంటుంది.
గుర్తింపు కోసం ఆరాటం..
భారత్ లో భాషకు గుర్తింపు అనేక ఒక భావోద్వేగ పరిణామం. హిందీ తప్పనిసరి చేయడం ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ప్రయత్నంగా భావిస్తారు. దీనివల్ల రాష్ట్రాలు ఈ విధానాన్ని స్వీకరించడానికి సంకోచిస్తున్నాయని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంజీ దేవసహాయం అన్నారు.
‘‘హిందీ తప్పనిసరికాదు’’ అనే బీజేపీ నినాదం తీసుకుంటే ఉద్రిక్తతలు తగ్గడమే కాకుండా, జాతీయ విద్యావిధానం-2020ని ఆమోదాన్ని పొందుతుందని అన్నారు. 2022 లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హిందీని ఏకం చేసే భాషగా చేసిన వ్యాఖ్యలు చర్చకు ఆజ్యం పోశాయి.
బీజేపీ కౌంటర్
హిందీపై డీఎంకే చేస్తున్న విమర్శలకు ప్రతిస్పందనగా బీజేపీ కూడా స్పందించింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ.. అధికార పార్టీ వాదన అస్పష్టంగా ఉందన్నారు. మూడో భాష ఎంపిక విషయంలో పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానిదే అని అన్నారు.
‘‘తమిళనాడులో అనేక ప్రైవేట్ పాఠశాలలు రాజకీయ నాయకులవని, అందుకే జాతీయ విద్యావిధానం 2020 పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు. ’’
పార్లమెంట్ లో నూతన విద్యావిధానంపై రెండు సంవత్సరాలు విస్తృతంగా చర్చలు జరిగాయని, రాష్ట్రాలకు తమ స్వంత పాఠ్యాంశాలను రూపొందించడానికి ఎక్కువ అధికారం ఇచ్చినట్లు వెల్లడించారు.
‘‘తమిళనాడులో రెండు భాషల విధానాన్ని అమలు చేయడం అనేది అన్ని పాఠశాలలకు ఒకేలా ఉండాలి. కానీ ఇక్కడ అలాలేదు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్ల అదనపు భాషను నేర్చుకునే అవకాశాన్ని విద్యార్థులు కోల్పోతున్నారు’’ అని ఆయన అన్నారు.
Next Story