తమిళనాడులో అమిత్ షా పాచికలు ఎందుకు పారడం లేదు?
x

తమిళనాడులో అమిత్ షా పాచికలు ఎందుకు పారడం లేదు?

టాకింగ్ విత్ శ్రీని లో ఫెడరల్ చీఫ్ ఎడిటర్ ఎస్. శ్రీనివాసన్ విశ్లేషణ


తమిళనాడు అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి లెక్కలు, ఎత్తులు, పొత్తులు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

బీజేపీ వ్యూహానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని ది ఫెడరల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్. శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒకే సైజు అందరికి సరిపోతుందని బీజేపీది మంచి ఫార్ములా కావచ్చు. కానీ అది తమిళనాడులో పనిచేయదు’’ అని టాకింగ్ సెన్స్ విత్ శ్రీని లో అన్నారు. రాష్ట్రాల వారీగా రాజకీయాలు భిన్నంగా ఉంటాయని అన్నారు.

కూటమి లెక్కలు..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేక సార్లు తమిళనాడులో పర్యటించారు. ఇటీవల తిరుచురాపల్లి, పుదుక్కొట్టైలకి వచ్చారు. అయినప్పటికీ ఎన్డీఏలో ఏర్పాటులో ఎటువంటి కదలిక పెద్దగా లేదు.
స్పష్టమైన పురోగతి లేకపోవడం తీవ్రమైన బ్యాక్ రూమ్ చర్చలకు దారితీసిందని, కానీ పొత్తులకు సమయం తక్కువగా ఉండటంతో న్యూఢిల్లీలో నిరాశ పెరుగుతున్న సంగతి కనిపిస్తుందని శ్రీనివాసన్ అన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే అతిపెద్ద ప్రతిపక్ష శక్తిగా ఉన్న అఖిల భారత అన్నాద్రవిడ మున్నేట్ర కజగం(అన్నాడీఎంకే లేదా ఏఐఏడీఎంకే) తో బీజేపీ పొత్తులో ఒక లోపం ఉంది. బీహార్ వంటి రాష్ట్రాలలో మోహరించిన సంకీర్ణ నమూనాలను ప్రతిబింబిచడానికి బీజేపీ ఇక్కడ ప్రయత్నిస్తోంది. ‘‘తమిళనాడులో కూటమికి బీజేపీ తోక వంటిందని అంగీకరించాలి. అయితే అన్నాడీఎంకే దానికి గౌరవం ఇవ్వాలి’’ అని చెప్పారు.
అన్నాడీఎంకే పార్టీ కుప్పకూలిపోయే అవకాశం..
అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి ఎత్తులను ఇది పరిమితం చేసే అవకాశం ఉందని శ్రీనివాసన్ అన్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడానికి ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనే భావన తమిళనాడు ఓటర్లలో ఆయన స్థానాన్ని దెబ్బతీస్తుంది. అన్నాడీఎంకే తన ఎన్డీఏ మిత్రపక్షం కంటే ఎక్కువ శాతం ఓట్లు పొందుతుంది. కానీ అధికారం మాత్రం ఢిల్లీలో ఉంది.
టీవీకే పార్టీ తమిళనాడు రాజకీయ ప్రక్రియలో చేరడంతో ఈ గందరగోళం మరింత పెరిగింది. ఈ పార్టీని శ్రీనివాసన్ ఎక్స్ ఫ్యాక్టర్ గా అభివర్ణించాడు. ఈ సర్వేలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర అత్యున్నత పదవికి అత్యంత ప్రాధాన్యత గల అభ్యర్థిగా నిలిచారని, విజయ్ రెండో స్థానంలో ఉన్నారని, తరువాత పళని స్వామి ఉన్నారని ఇటీవల సర్వేలో వెల్లడైందని చెప్పారు.
‘‘ఇది అన్నాడీఎంకే పార్టీ వెన్నులో వణుకుపుట్టించే అంశం’’ అని శ్రీనివాసన్ విశ్లేషించారు. డీఎంకే నేతృత్వంలోని ఫ్రంట్ నుంచి ఓట్ల లీకేజీకి అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు.
డీఎంకే భాగస్వామ్య పక్షాలలో అసంతృప్తి
పాలక ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) ప్రస్తుతం కాగితంపై అత్యంత స్థిరమైన సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్నప్పటికీ దాని భాగస్వాములలో అసంతృప్తి చెలరేగుతోందని శ్రీనివాసన్ చెప్పారు.
కాంగ్రెస్, విదుతలై చిరుతైగల్ కట్చి బహిరంగంగా ఎక్కువ సీట్లు, పాలనలో ఎక్కువ వాటాను డిమాండ్ చేస్తున్నారు. డీఎంకే ఆధిపత్యం వారి వృద్ధిని అడ్డుకుంటున్నాయని వాదిస్తున్నారు.
రెండు పొత్తులు ఇంకా అస్థిరంగా ఉన్నాయి. ఓటర్ల అంచనాలకు ఇప్పుడు కొత్త రాజకీయ ఆటగాడు రావడంతో బీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్. వ్యూహాత్మక సహనం చివరికి లాభాలను అందించిన ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా తమిళనాడులో సులభమైన పరిష్కారాలను ధిక్కరిస్తూనే ఉందని ఎన్నికల సమయం తగ్గుతున్న కొద్ది అన్ని పార్టీలు చాలాకాలంగా ఉన్న అంచనాలను పునరాలోచించుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.
Read More
Next Story