కాల్పుల విరమణపై ట్రంప్ పదేపదే ఎందుకు క్రెడిట్ తీసుకుంటున్నారు?
x
నీలు వ్యాస్

కాల్పుల విరమణపై ట్రంప్ పదేపదే ఎందుకు క్రెడిట్ తీసుకుంటున్నారు?

వాణిజ్యాన్ని ఉపయోగించినట్లు అణు యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు చెప్పింది నిజమేనా?


(అనువాదం.. చెప్యాల ప్రవీణ్)

‘ఆపరేషన్ సిందూర్’ తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భారత్ లోని సైనిక బేస్ లు, పౌర ఆవాసాలే లక్ష్యంగా దానవ దేశం పాక్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ద విమానాలతో దాడులకు దిగింది.

అయితే అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా మన సరిహద్దు దాటలేకపోయాయి. ప్రతిగా భారత వైమానిక దళం జరిపిన దాడిలో దాని సైనిక స్థావరాలు దాదాపు 20 శాతం మేర నష్టపోయాయి. అయితే తరువాత ఉద్రిక్తతలు సడన్ గా తగ్గిపోయాయి.

దీనికి కారణం తానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. కాల్పుల విరమణ వెనక ఉన్న శాంతిదూతని నేనే అని వార్తల్లో నిలిచారు. వాణిజ్య ఒప్పందాలను దౌత్య సాధనంగా ఉపయోగించుకున్నానని చెప్పుకొచ్చాడు.

అయితే భారత్ మాత్రం కాల్పుల విరమణ సందర్భంగా కానీ, విదేశాంగ ప్రకటనలో గానీ ఎక్కడా అమెరికా, ట్రంప్ ప్రస్తావన తీసుకురాలేదు. తమ మధ్య వాణిజ్యం విషయాలు ఏవీ చర్చకు రాలేదని ఖండించింది.

‘ది ఫెడరల్’ నిర్వహించే ‘కాపిటల్ బీట్’ తాజా ఎపిసోడ్ లో యాంకర్ నీలు వ్యాస్, డాక్టర్ కమల్ పాషా, ది ఫెడరల్ మేనేజింగ్ ఎడిటర్ కేఎస్ దక్షిణామూర్తి, ప్రొఫెసర్ మోహిసిన్ రజా ఖాన్ లతో భారత దౌత్య వైఖరిని అంచనా వేయడానికి ప్రయత్నించారు.

ప్రశ్న: వాణిజ్యాన్ని ఉపయోగించి భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ ప్రకటించుకున్నారు? ఇది ఆమోదయోగ్యమేనా?
డాక్టర్ అప్తాబ్ కమల్ పాషా: ట్రంప్ వింతైన ప్రకటనలు చేయడంలో తనకు తానే సాటి చాలాసార్లు నిరూపించుకున్నాడు. తనను తాను శాంతిదూతగా నిలబెట్టుకోవడానికి అవకాశాలను ఉపయోగించుకోవడంలో ఆయనకు ఘన చరిత్రే ఉంది.
2024 ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడం, పదవీ బాధ్యతలు చేపట్టే ముందు గాజాలో శాంతిని తీసుకురావడం వంటి సాహసోపేతమైన హమీలు ఇచ్చారు.
ఆయన ఇజ్రాయెల్ ప్రధానిపై ఒత్తిడి తీసుకువచ్చి కాల్పుల విరమణ ఒప్పందం తీసుకువచ్చినప్పటికీ అది తరువాత అమలు కాలేదు. అయినప్పటికీ ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నారు.
పాకిస్తాన్ భయపడి పోయిందా లేదా దాని మిత్రదేశాలలో ఒకటైన టర్కీ, యూఏఈ, ఈజిప్ట్, సౌదీ అరేబియా కాల్పుల విరమణను ప్రభావితం చేసిందో మాకు తెలియదు. ఈ దేశాలన్నీ పాకిస్తాన్ తో సైనిక సంబంధాలను కొనసాగిస్తాయి.
పాకిస్తానీలకు శిక్షణ పొందిన యూఎస్ ఆయుధాలు అందుతాయి. కానీ ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే భారత్ మౌనం వహించడం. ఈ సంవత్సరం ప్రారంభంలో ట్రంప్ పట్ల బహిరంగంగా అప్యాయత ప్రదర్శించిన ప్రధాని ఇప్పుడు తాను కఠినమైన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు.
వాణిజ్యం గురించి ఎలాంటి చర్చ జరగలేదని విదేశాంగ శాఖ చెబుతోంది. అయితే ట్రంప్ మాత్రం పదేపదే ఇదే విషయం చెబుతున్నారు. ఈ విషయం పై స్పష్టత అవసరం.
ప్రశ్న: సోషల్ మీడియాలో జనరల్ మోనిజ్ సూచించినట్లుగా, ట్రంప్ వ్యూహాన్ని బ్లాక్ మెయిల్ గా చూడవచ్చా?
డాక్టర్ కమల్ పాషా: ఇది సాధ్యమే. ట్రంప్ లావాదేవీలు చేసే వ్యక్తి. ఆయన వ్యూహాత్మక సమస్యలను వ్యాపారవేత్త మనస్తత్వంతో చూస్తారు. అమెరికాతో భారత్ లోతైన సంబంధాలు, వాణిజ్యం ప్రధాని మోదీపై ఒత్తిడికి గురిచేసి ఉంటాయి.
ప్రశ్న: కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ పదేపదే వాణిజ్యాన్ని ఎందుకు ప్రస్తావించారని మీరు అనుకుంటున్నారు?
కేఎస్ దక్షిణామూర్తి: ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే కాల్పుల విరమణలో ట్రంప్ కీలక పాత్ర పోషించారు. అమెరికా అధ్యక్షుడు వాణిజ్యాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా చూస్తున్నాడు. పరస్పర సుంకాలతో ప్రపంచాన్ని ఎలా దెబ్బతీశాడో, ప్రపంచ నాయకులపై ఎలా ఒత్తిడి పెట్టాడో మనకు ఇంకా గుర్తుంది.
ట్రంప్ దృష్టిలో వాణిజ్యం అంటే కేవలం ఆర్థిక శాస్త్రం కాదు. పరపతి. కాబట్టి వాణిజ్యం కాల్పుల విరమణ సంభాషణలో భాగం కాకపోయినా అతని దృష్టిలో అది దౌత్యానికి కేంద్ర బిందువు.
అది భారత్ అయినా, మరే ఇతర దేశం అయిన అతను వాణిజ్యాన్ని శాంతి లేదా ఒత్తిడిని సాధించే సాధనంగా మాత్రమే చూస్తాడు.
ప్రశ్న: ట్రంప్ చైనాతో ఆడే ఆటలో పాకిస్తాన్, భారత్ ను పావుగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా?
ప్రొఫెసర్ రజా ఖాన్: కచ్చితంగా అది నిజమే. ట్రంప్ కు బెదిరింపు మనస్తత్వం ఉంది. అతను బలహీనులు అని భావించే వారి వెంట పడతాడు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ గాజా వంటి పెద్ద రంగాలలో విఫలమైన ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కావాలి.
భారత్- పాకిస్తాన్ కాల్పుల విరమణ ఫలితాన్ని ఆయన తక్కువ దృష్టితో చూస్తాడు. కానీ స్పష్టంగా చెప్పుకుంటే.. భారత్, పాకిస్తాన్ పూర్తి స్థాయి యుద్దాన్ని కోరుకోలేదు. భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన తరువాత అది ఉద్రిక్తతను తగ్గించాలనే కోరుకుంది.
పాకిస్తాన్ ప్రతిస్పందన తరువాతనే ఎదురుదాడి మొదలు పెట్టింది. అమెరికా దీనిని రూపొందించలేదు. కానీ ట్రంప్ మాత్రం క్రెడిట్ తీసుకున్నాడు.
ట్రంప్ కు మోదీ వ్యతిరేకం కాదని తెలుసు. కాబట్టి భారత్ ఆయనతో విభేదించలేదు. వారి సమావేశాలలో మోదీ బాడీలాంగ్వేజ్ చూడండి.
అరుణాచల్ ప్రదేశ్ లో చైనా దూకుడుగా వ్యవరిస్తోంది. ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ట్రంప్ ఈ దౌత్యపరమైన నిష్క్రియాత్మకతను ఉపయోగించుకున్నాడు.
ప్రశ్న: ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీయకుండా ట్రంప్ రెచ్చగొట్టే చర్యలను మోదీ ఎలా ఎదుర్కోవాలి?
డాక్టర్ కమల్ పాషా: ఫిబ్రవరిలో మోదీ వైట్ హౌజ్ సందర్శన ఒక మలుపు. అప్పటి నుంచి అమెరికా వాణిజ్యం నుంచి పాకిస్తాన్ వరకు నిబంధనలు నిర్దేశిస్తున్నట్లు కనిపిస్తోంది.
ట్రంప్ ను సవాల్ చేయడం అసంభవం అనిపించే స్థితిలో మనం ఉన్నాము. మోదీ స్వదేశంలో నియంత్రణ ప్రదర్శించాలనుకుంటున్నారు. కానీ నిజానికి అమెరికన్ శక్తికి ప్రభుత్వం భయపడుతోంది.
చైనా పాకిస్తాన్ లను అది కంట్రోల్ చేస్తుందని భారత్ ఆశించింది. కానీ ఇప్పుడు అమెరికా తన ప్రయోజనాలనే చూసుకుంటోంది. ట్రంప్ ఒక వ్యాపారవేత్త, అతను కాల్పుల విరమణను కూడా ఓ వాణిజ్యం లా చూశాడు. అందుకే సుంకాలు, ఆయుధ అమ్మకాల గురించి అదే ధోరణిలో మాట్లాడాడు.
ప్రశ్న: ఈ లావాదేవీ విధానంతో ట్రంప్ దౌత్యాన్ని మరో వైపుకు తీసుకెళ్లారా?
దక్షిణామూర్తి: ట్రంప్ కేవలం భారత్ నే కాదు. ప్రపంచాన్నే ఓ వైపు లాగడానికి దౌత్యాన్ని ఉపయోగించుకున్నాడు. అది సొంత దేశాన్ని కూడా కుదిపేసింది. అమెరికా ఉద్యోగులను తొలగించడం, విద్యార్థులు, అక్రమ వలసదారులను బయటకు పంపడం అన్ని దేశాన్ని అస్థిరపరిచాయి.
అంతర్జాతీయంగా జెలెన్ స్కీ వంటి నాయకుల తో ఆయన వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉంది. కాపిటల్ హిల్ దాడి సమయంలో మనం చూసినట్లుగా ప్రజాస్వామ్య నిబంధనలు తారుమారు చేయడానికి ఆయన భయపడరు. ఆయన పరిపానలకు మరో నాలుగు సంవత్సరాల సమయం ఉన్నందున మరికొన్ని గందరగోళాలకు సిద్దంగా ఉండాలి.
ప్రశ్న: భారత్ ట్రంప్ కథనాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందా? గ్లోబల్ సౌత్ వారసత్వం దృష్ట్యా ఆలోచిస్తే?
రజాఖాన్: ట్రంప్ కథనాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. నెహ్రూ కాలం నుంచి భారత్ గ్లోబల్ సౌత్ కు నాయకత్వం వహించింది. మనం అప్పట్లో వలసవాదాన్ని వ్యతిరేకించాము.
అణగారిన వర్గాల పక్షాల నిలిచాము. కొన్ని వాణిజ్య ఒప్పందాల కోసం మనం అమెరికా ముందు తలవంచకూడదు. మనం మౌనంగా ఉంటే ఎల్ బీ శాస్త్రి, ఇందిరాగాంధీ ల నాటి దేశం కాదు.
ట్రంప్ వాదనలు భారత్, పాకిస్తాన్ లకు చిన్నబుచ్చేవిగా ఉన్నాయి. ఆయన బేబీ సిటర్ గా ఉండి అణు ఉద్రిక్తతలను పరిష్కరించినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి దీనిపై వివరాలు స్ఫష్టం చేయాలి. లేకపోతే మన విదేశాంగ విధానాన్ని అస్థిర వ్యాపారవేత్త ఇష్టాయిష్టాలకు అమ్మేస్తున్నామనే సందేశం వస్తుంది.
ప్రశ్న: అమెరికా అతిక్రమణను సవాల్ చేయడానికి ధైర్యవంతమైన నాయకత్వానికి అవకాశం ఉందా?
డాక్టర్ పాషా: మనం వాస్తవికంగా ఉండాలి. 50, 60 లలో ప్రపంచ శక్తులను ఎదురించిన నాయకత్వం నేడు లేదు. మన రాజకీయ నాయకులకు ఆ దార్శనికత లేదా రాజనీతిజ్ఞత లేదు. పార్లమెంట్ సమాధానాలు కోరవచ్చు. కానీ ఈ ప్రభుత్వం పెద్దగా వెల్లడించే అవకాశం లేదు.
అమెరికన్లు మన దుర్బలత్వాలను చైనా, పాకిస్తాన్ అంతకుమించి చూస్తారు. వారు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. మన నాయకులు కొంత ధైర్యం, దృఢత్వాన్ని తిరిగి ప్రదర్శించకపోతే అమెరికా ఒత్తిడి కొనసాగుతుంది.
ట్రంప్ ది అస్థిర ప్రవర్తన అయినప్పటికీ బలహీనతను ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసినవాడు. అలాంటి వాటిని ఆయన బాగా ఉపయోగించుకుంటాడు.
Read More
Next Story