కేరళలో స్థానిక స్వపరిపాలన ఉపఎన్నికలు వామపక్షాలకు ఎందుకు కీలకం?
x

కేరళలో స్థానిక స్వపరిపాలన ఉపఎన్నికలు వామపక్షాలకు ఎందుకు కీలకం?

లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత సీపీఐ(ఎం) నేతలు ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు వ్యూహరచన చేస్తున్నారు. దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నారు.


లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత కేరళలోని సీపీఐ(ఎం) నేతలు ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు వ్యూహరచన చేస్తున్నారు. దిద్దుబాటు చర్యలతో పాటు పార్టీ బలోపేతానికి సమాయత్తమవుతున్నారు.

పార్టీ అంతర్గత చర్చల్లో లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి కారణాలు, 2025లో జరగబోయే స్థానిక స్వపరిపాలన ఎన్నికలు, 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు కనిపించడం లేదు.

మళ్లీ పుంజుకుంటారా?

స్థానిక ఎన్నికల్లో పుంజుకుంటామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకటించినా..పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ, కేంద్ర కమిటీ సభ్యుడు టీఎం థామస్‌ ఐజాక్‌ మాత్రం ఆయన అభిప్రాయంతో ఏకీభవించనట్లే ఉంది. వేర్వేరు సందర్భాలలో ఊపందుకోవడం అంత సులభం కాదంటూనే పార్టీ, ప్రభుత్వం రెండింటి నుండి కృషి చాలా అవసరమని ఇద్దరూ వ్యాఖ్యానించారు.

“వచ్చే ఏడాది జరిగే స్థానిక ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల ఓట్ల శాతం ఆటోమేటిక్‌గా పెరుగుతుందని భావించడం లేదు. లోక్‌సభ ఎన్నికలలో వామపక్షాల పనితీరుతో విసుగు చెందిన ఒక వర్గం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు” అని డాక్టర్ ఐజాక్ వామపక్ష పరాజయాన్ని విశ్లేషిస్తూ పేర్కొన్నారు.

దిద్దుబాటు చర్యలో భాగంగా ఏర్పాటయిన పార్టీ రెండు రోజుల రాష్ట్ర కమిటీ సమావేశంలో రెండింటిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సంక్షేమ పథకాలపై దృష్టి సారించడం అందులో మొదటిది. రెండోది కార్మికవర్గంతో కనెక్ట్ కావాల్సిన అవసరాన్ని నేతలు బలంగా చెప్పారు.

పలు కారణాలతో ఉపఎన్నికలు..

మరణాలు, రాజీనామాలు, సిట్టింగులపై అనర్హత వేటు, వివిధ కారణాల వల్ల రాబోయే స్థానిక స్వపరిపాలన (LSG) ఉపఎన్నికలు పార్టీకి ఇప్పడు సవాల్‌గా మారాయి.

జూలై 30న కేరళలో వాయనాడ్ మినహా 13 జిల్లాల్లోని 49 స్థానిక స్వపరిపాలన వార్డులకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికల రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకోనున్నాయి..

ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా LSGలు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ఆధీనంలో ఉన్నాయి. అయితే ఈ ఎన్నికలు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) దిద్దుబాటు చర్యలకు అగ్ని పరీక్ష కావచ్చు.

ఎన్నికలు జరిగే వార్డులివే.. కాసర్‌గోడ్ (3), కన్నూర్ (3), కోజికోడ్ (4), మలప్పురం (4), పాలక్కడ్ (5), త్రిసూర్ (3), ఎర్నాకులం (3), ఇడుక్కి (4), కొట్టాయం (3), అలప్పుజ (3), పతనంతిట్ట (2), కొల్లం (4), తిరువనంతపురం (8).

తిరువనంతపురం జిల్లా పంచాయతీలోని ఒక డివిజన్, నాలుగు పంచాయతీ వార్డులు, ఆరు మున్సిపాలిటీ వార్డులు, 38 గ్రామ పంచాయతీ వార్డులకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 24 స్థానాలు ఎల్‌డిఎఫ్‌కు, 19 యుడిఎఫ్‌కు, నాలుగు బిజెపి ఖాతాలో ఉన్నాయి. వీటితో పాట SDPI, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక్కో సీటు దక్కించుకున్నాయి.

ఉప ఎన్నికల ఫలితాలు తిరువనంతపురం జిల్లాలోని పెరింగమ్మల, పాతనంతిట్టలోని చిత్తర్, తొడియూర్, సూరనాడ్ సౌత్, కొల్లాంలోని పుయపల్లి, అలప్పుజాలోని మన్నార్, తొడుపుజా మునిసిపాలిటీ ఇడుక్కిలోని అరక్కుళం పంచాయతీతో సహా త్రిస్సూర్‌లోని పవరట్టి, పాలక్కాడ్ జిల్లాలోని తాచంపర, మంకర స్థానాలపై ప్రభావం చూపుతాయి.

దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టిన లెఫ్ట్..

గెలుపే లక్ష్యంగా సిపిఐ(ఎం) జనాకర్షక పథకాలను అమలు చేస్తుంది. అందులో భాగంగా పింఛన్ల పంపిణీ జూలై 24న ప్రారంభమైంది. ఒక విడత ఫించన్ కూడా లబ్ధిదారులకు అందజేశారు. ఇందుకోసం ఆర్థిక శాఖ రూ.900 కోట్లు కేటాయించింది. కేంద్రం నిర్లక్ష్యం చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీలో ప్రకటించారు.

బిల్డింగ్ పర్మిట్ ట్యాక్స్ తగ్గింపుపై నిర్ణయం..

దిద్దుబాటు చర్యలో భాగంగా పెరిగిన బిల్డింగ్ పర్మిట్ ట్యాక్స్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. పర్మిట్ ఫీజు పెంపుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇది ఎన్నికలపై ప్రభావం చూపుతుందని పార్టీ భావిస్తోంది. “ప్రస్తుతం రాష్ట్రంలో బిల్డింగ్ పర్మిట్ ఫీజు దేశంలోనే అత్యల్పంగా ఉన్నా, ప్రజల డిమాండ్ కారణంగా ప్రభుత్వం దానిని సగానికి పైగా తగ్గించాలని నిర్ణయించింది” అని ఎల్‌ఎస్‌జి మంత్రి ఎంబి రాజేష్ పేర్కొన్నారు.

Read More
Next Story