సమస్యలు పరిష్కరించుకుండా కర్ణాటక నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారుతుందా?
x

సమస్యలు పరిష్కరించుకుండా కర్ణాటక నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారుతుందా?

ప్రభుత్వం ముందు నిన్న లొంగిపోయిన ఆరుగురు నక్సల్స్


శశి సాంపల్లి

కర్ణాటకలో మిగిలి ఉన్న ఏకైక నక్సలైట్ గ్రూపు బుధవారం ‘ప్రభుత్వ నక్సల్ సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ కమిటీ’ ద్వారా లొంగిపోయింది. ఈ నక్సల్స్ బృందం ముండగారి లత నేతృత్వంలో పని చేస్తోంది. ఈ లొంగుబాటు ప్రక్రియ కర్ణాటక నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందని హోంమంత్రి స్వయంగా ప్రకటించారు. అయితే నాలుగు దశాబ్ధాల ఈ సామాజిక సమస్య కర్ణాటక నిజంగా వదిలించుకోగలదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.

రాష్ట్రంలో నక్సలిజం..
కర్ణాటకలో నక్సలిజం కార్యకలాపాలు మల్నాడు ప్రాంతంలో అధికారికంగా ప్రారంభం అయ్యాయి. అయితే అంతకుముందే అంటే 1980 ప్రాంతంలో చురుకుగా మొదలయ్యాయి. 1985-86 నాటికి ప్రోగ్రేసివ్ స్టూడెంట్ యూనియన్, కర్ణాటక రైతు, కార్మికుల సంఘం బ్యానర్ల కింద నక్సల్స్ భావజాలం ప్రారంభం అయింది.
పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ కు అనుకుని ఉన్న రాయచూర్, బీదర్, చిత్రదుర్గ్ తుమకూరు వంటి ప్రాంతాలలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్ లో నక్సల్స్ కార్యకలాపాలను గ్రేహౌండ్స్ దళాన్ని ఏర్పాటు చేసి అణచివేయడంతో కొన్ని గ్రూపులు నక్సల్స్ గ్రూపులు కర్నాటకలో ప్రవేశించాడు.
సాకేత్ రాజన్ వంటి నాయకుల ఆధ్వర్యంలో కొత్త సంస్థలు పుట్టుకొచ్చాయి. కుద్రేముఖ్ నేషనల్ పార్క్ ను వ్యతిరేకించడం, తుంగ నది పరిరక్షణ, దత్త పీఠం భూహక్కుల ఉద్యమం వంటి వాటితో మల్నాడు లో నక్సల్స్ ఆందోళన బలం ఫుంజుకుంది.
ఇలా దాదాపు మూడు దశాబ్ధాలుగా విప్లవోద్యమం తన ముద్రను వేసింది. కానీ తరువాత మెల్లగా తన బలాన్ని కోల్పోవడం ప్రారంభించింది. తాజాగా ఆరుగురు వ్యక్తులు లొంగిపోవడంతో ఈ ప్రశ్నకు బలం చేకూరుస్తుంది. ఇది నిజంగా ముప్పై సంవత్సరాల పోరాటానికి ముగింపు పలకనుందా?
మల్నాడు నక్సల్స్ చరిత్ర..
2002 లో చిక్కమగళూర్ జిల్లా శృంగేరి తాలుకా మెనసినహడ్యలో జరిగిన ఎదురుకాల్పుల్లో మొదటిసారిగా నక్సల్స్ కార్యకలాపాలు బహిర్గతం అయ్యాయి. 2003 లో ఈదులో జరిగిన ఎన్ కౌంటర్ లో పార్వతి, హజీమా అనే ఇద్దరు మహిళా నక్సల్స్ మరణించారు. అప్పటికి ప్రభుత్వం నక్సల్స్ బలాన్ని అర్థం చేసుకున్నారు. తరువాత వీరితో పోరాటడానికి యాంటీ నక్సల్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.
2005 లో కర్నాటక నక్సల్స్ కమాండర్ సాకేత్ రాజన్ మెనసినహద్య సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. ఈ ఎన్ కౌంటర్ కర్నాటక నక్సల్స్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. తరువాత అంతర్గత విభేదాలతో నక్సల్స్ నేత్రావతి, శరావతి, భద్ర స్వ్కాడ్ లు గా విడిపోయింది.నేత్రావతి స్క్వాడ్ కు విక్రమ్ గౌడ నాయకత్వం వహించాడు. ఆయన సాకేత్ రాజన్ శిష్యుడు.
నక్సలిజం ఎందుకు విఫలం అయింది?
నక్సల్స్ ఉద్యమం అది ప్రారంభమైన మల్నడులో పట్టు సాధించడంలో విఫలం అయింది. ఎందుకంటే ఈ ప్రాంతం యొక్క సామాజిక, ఆర్థిక పరిస్థితులు వారి భావజాలానికి అనుగుణంగా లేవు. కఠినమైన భౌతిక పరిస్థితులు, అడవులతో సవాళ్లను ఎదుర్కొంది. సాకేత్ రాజన్ ను కోల్పోవడం, అంతర్గత విభేదాలు సంస్థను దెబ్బతీశాయి. ఇదే సమయంలో ప్రభుత్వం యాంటీ నక్సల్స్ ఫోర్స్ (ఏఎన్ఎఫ్)తో వారి కార్యకలాపాలను అణిచివేయడం ప్రారంభించింది. వారి వనరులు, పౌర నెట్ వర్క్ , ఆహారం, ఆయుధాలను,ఆర్థిక వనరులను కట్ చేశాయి.
2012-13 నాటికి చాలా మంది నక్సల్స్ అడవులను విడిచిపెట్టి నగరాల్లో ప్రవేశించాల్సి వచ్చింది. విక్రమ్ గౌడ వర్గం కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు వలసపోయింది. కానీ అక్కడ సరైన ఆదరణ దొరకకగా తిరిగి మల్నాడు ప్రాంతాలకు వచ్చేలా చేశాయి.
రహస్యంగా ఉన్న నక్సలైట్లు..
ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో నేత్రవతి స్క్వాడ్ లో లీడర్ విక్రమ్ గౌడ్ మరణించారు. ఆయన దళంలో కేవలం ఏడుగురు మాత్రమే మిగిలారు. ఇప్పుడు కూడా ఇందులో నుంచి ఆరుగురు లొంగిపోయి ప్రజా జీవితంలో వచ్చారు. అయితే కోటేహోడ రవి అలియాస్ హిట్లమనేనీ రవీంద్ర ఇంకా అడవుల్లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు.
వీరి లొంగుబాటుతో నిజంగా నక్సల్సిజం కర్ణాటకలో అంతమయిందా? కేవలం రవీంద్ర ఒక్కడే అడవుల్లో దాక్కుకున్నాడా? ఇది నమ్మశక్యంగా కనిపించట్లేదు. అడవిలో అతనితో పాటు మరికొంతమంది కూడా ఉండవచ్చని భావిస్తున్నారు.
మల్నాడు సమస్యలు..
ఈ ప్రాంతంలో ఉద్యమంలో ఉన్నవారు తిరిగి వెనక్కి వచ్చినా, అక్కడ లేవనెత్తిన ప్రశ్నలకు ఇంకా సమాధానం రాలేదు. ప్రజల పోరాటాలకు దారి పరిస్థితులు ఇప్పటికి అపరిష్కృతంగా ఉన్నాయని మల్నాడు ప్రజలు చెబుతున్న మాట.
1990 లో నక్సలైట్లు ఉద్యమానికి దారితీసిన పరిస్థితుల కంటే నేడు మల్నాడును పట్టిపీడిస్తున్న సమస్యలు పది రెట్లు ఎక్కువ. అటవీ ఆక్రమణల తొలగింపు, రెవిన్యూ భూముల క్రమబద్దీకరణ, శరావతి ప్రాజెక్ట్ బాధితులు ఎదుర్కొంటున్న భూ హక్కుల సంక్షోభం, కస్తూరి రంగన్ నివేదిక అమలుపై భయాందోళనలు, వన్యప్రాణులు- మానవుల మధ్య నిరంతర ఘర్షణ, అటవీ అధికారులతో సమస్యలు ఇక్కడ ఉన్నాయి.
కొత్త ఉద్యమాలు..
ఇన్ని సమస్యలు ఇలా ఉండటం వల్ల మల్నాడు ప్రాంతంలో కొత్త ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను తీవ్రంగా పరిగణించడం వంటివి మాత్రమే చేస్తోంది. అంతేకానీ సంక్షోభాలు పరిష్కరించడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. నక్సల్ ఉద్యమం ప్రారంభ సమయంలో కంటే ఎక్కువ ఘర్షణాత్మక వైఖరి, అటవీ చట్టాలు, ప్రభుత్వ విధానాలు మల్నాడు ప్రాంతంలో ఉన్నాయి.
రాష్ట్రాన్ని నక్సలైట్లు రహితంగా ప్రకటించేందుకు ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. ఏది ఏమైనప్పటికీ ఇది ప్రధాన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించడం ముఖ్యం.
Read More
Next Story