
విజయ్ కోసం రాహుల్ గాంధీ డీఎంకేను వదిలేస్తారా?
టీవీకే చీఫ్ విజయ్ గురించి ది ఫెడరల్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎస్ శ్రీనివాసన్ చెప్పిన విషయాలేంటి?
తమిళనాడు(Tamil Nadu) కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన నెల రోజుల తర్వాత.. తమిళగ వెట్రీ కజగం పార్టీ చీఫ్ విజయ్(Vijay) తమిళగ వెట్రీ కజగం (TVK,) తిరిగి తన రాజకీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. ది ఫెడరల్ యూట్యూబ్ ప్రోగ్రామ్ ‘టాకింగ్ సెన్స్ విత్’ శ్రీని తాజా ఎపిసోడ్‌లో ది ఫెడరల్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎస్ శ్రీనివాసన్ విజయ్ గురించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.
‘‘కరూర్(Karoor) ఘటన విజయ్ జీవితంలో ఒక మలుపు. ఆ దుర్ఘటన తర్వాత విజయ్ ఇక మితంగా వ్యవహరించే నాయకులా కాకుండా, పూర్తిస్థాయిలో ప్రత్యర్థుల రాజకీయ నాయకుల ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కరూర్ విషాదం విజయ్‌ను DMKకి వ్యతిరేకంగా నిలబడేలా చేసింది’’
కాంగ్రెస్-విజయ్ కలయిక?
విజయ్ కాంగ్రెస్‌తో జతకడతారన్న వార్తలు తమిళనాట చర్చనీయాంశంగా మారాయి. విజయ్, రాహుల్ గాంధీ మధ్య సత్సంబంధాలు ఉండటంతో కాంగ్రెస్‌తో పొత్తుపై ఆసక్తి నెలకొంది. అయితే అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే డీఎంకే కూటమి నుంచి విడిపోవాలి. ఇది రాజకీయంగా ప్రమాదకరం అడుగు.
“నిర్ణయం తీసుకోవాల్సింది రాహుల్ గాంధీ. కానీ అది ఆయనకు కష్టం. ఎందుకంటే డీఎంకే జాతీయ ప్రతిపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తోంది” అని చెప్పారు శ్రీనివాసన్.
విజయ్ రాజకీయ పరీక్ష ఇప్పుడు కేవలం పొత్తులకే పరిమితం కాదు. నమ్మకానికి సంబంధించినది కూడా అని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. “అతనికి(విజయ్) భారీ సంఖ్యలో అభిమానులున్నా.. రాజకీయంగా అతను ఇప్పటికీ గుర్తింపు పొందని నేతగా మిగిలిపోయారు. గతంలో ఇలాంటి పరిస్థితే నటుడు విజయకాంత్ ఎదుర్కొన్నారు. ఆయన దాదాపు 10 శాతం ఓట్లు సంపాదించి.. కొంతకాలం పాటు తమిళనాడు ప్రతిపక్ష నాయకుడిగా నిలిచారు.’’ అని చెప్పారు.
“విజయ్ పెద్ద స్టార్ అనడంలో సందేహం లేదు. కానీ అభిమానాన్ని ఓట్లుగా మలచగలడా? అనేదే స్పష్టత లేని ప్రశ్న. ఆయనకు నిజమైన రాజకీయ ముందడుగు కావాలంటే కనీసం 35 నుంచి 40 శాతం ఓట్లు సాధించాలి,” అని శ్రీనివాసన్ అన్నారు.
ఇదే సమయంలో ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) తనదైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. జయలలిత మరణం తర్వాత పార్టీపై తన ఆధిపత్యాన్ని చూయించినా.. ఆయన బీజేపీ కూటమి దాటి విస్తరించలేకపోయారు.” అని శ్రీనివాసన్ విశ్లేషించారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకేపై కాస్తంత ఆంటీ-ఇన్‌కంబెన్సీ కూడా కనిపిస్తుందన్నారు. అయితే “ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు,” అని పేర్కొన్నారు. డీఎంకే నాయకత్వం.. బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమితో పాటు విజయ్ నేతృత్వంలోని మూడో శక్తిని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.
అభిమానాన్ని ఓట్లుగా మార్చగలడా?
విజయ్ నిజంగా ‘కింగ్‌మేకర్’గా ఎదుగుతాడా? లేక కేవలం రాజకీయ వ్యవస్థలో ఒక అంతరాయంగా మిగిలిపోతాడా? అన్నది వేచిచూడాలి.




