
కేంద్ర నిర్ణయం వలస విద్యార్థులపై ప్రభావం చూపుతుందా?
రాష్ట్రంలో నివాసం ఉంటున్న 34 లక్షల మంది వలసదారులు, వారి పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలే దిక్కు
ప్రమీలా కృష్ణన్
తమిళనాడు జాతీయ విద్యావిధానంలో భాగంగా త్రిభాష విధానాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విదేశీ భాషలపై ఎక్కువ ఆధారపడటం ఎక్కువ ప్రమాదకరమని, వెంటనే హిందీని అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి స్టాలిన్ సర్కార్ ససేమిరా అనడంతో కేంద్రం నిధులను నిలిపివేసింది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వేలాది మంది వలస పిల్లలు అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు సమగ్ర శిక్ష పథకం కేంద్రం నిధులు అందిస్తోంది. కానీ తమిళనాడు వైఖరితో కేంద్రం నిధులు విడుదల చేసేది లేదని తెగేసి చెప్పింది.
వలస విద్యార్థులు ప్రభావితం..
బిహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, సహ ఇతర హిందీ మాట్లాడే రాష్ట్రాల నుంచి వలస వచ్చిన అనేక కుటుంబాలు తమిళనాడులో స్థిరపడ్డాయి. వారి పిల్లలను తమిళ మాధ్యమాల్లోనే చేర్పించాయి.
ఈ పాఠశాలలు ఉచిత తమిళ భాషా తరగతులు, భోజనం, యూనిఫాంలు ఇతర సాయాన్ని అందించడం ద్వారా వారు ఇంటిగ్రేట్ కావడానికి సాయపడుతున్నాయి.
బిహార్ నుంచి కృష్ణగిరి జిల్లాకు వలస వచ్చిన కుటుంబం లో ఓ విద్యార్థిని ఫాతిమా మాట్లాడుతూ.. ‘‘నేను ఒకటవ తరగతి నుంచి ఈ పాఠశాలలో చదువుతున్నాను. నన్ను ఉపాధ్యాయులు సొంత కుటుంబంలా చూసుకున్నారు.
నాకు చక్కగా పాఠాలు బోధిస్తున్నారు. ఇప్పుడు నేను ఆరో తరగతి వరకూ వచ్చాను. మాకు ఉచిత ఆహారం, భోజనం, బూట్లు, యూనిఫాంలు ఇస్తున్నారు’’ అని తమిళంలో మాట్లాడుతూ చెబుతున్నారు.
విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడింది..
కేంద్రం నిధులను విడుదల చేయకపోవడంతో వలస విద్యార్థులకు సాయపడే కీలక కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. తమిళ భాషా మద్దతు, ఉచిత పాఠశాల వనరుల వంటివి ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రతిష్టంభన కొనసాగితే ఈ పిల్లల విద్య నాణ్యతను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విద్యావేత్త నెడుంజెలియన్.. ఏమన్నారంటే..
తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో వేలాది మంది వలస పిల్లలు చదువుతున్నారు. స్థానిక భాష వలసదారులకు, స్థానిక విద్యార్థులకు కేంద్ర నిధులు ప్రయోజనం చేకూరుస్తాయి. నిధుల కోత వారికి అందుబాటులో ఉన్న విద్య నాణ్యతను తీవ్రంగా తగ్గిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అనేక వలస కుటుంబాలు తమిళనాడు పాఠశాలలు వారి స్వస్థలాలలో ఎన్నడూ లేని అవకాశాలను అందుకుంటున్నారు. ‘‘బీహార్ లో పాఠశాలకు వెళ్లే అవకాశం నాకు రాలేదు’’ అని ముమాజా కథూన్ అన్నారు. ‘‘ఇక్కడ నేను చదువుకోవచ్చు. బిహార్ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేవు.
బోధన లో నాణ్యత కనిపించదు. కానీ ఇక్కడ అంతా బాగుంది. నేను మరికొందరిని పాఠశాల్లో చేరమని బాగా చదువుకోవాలని, జీవితంలో పురోగతి సాధించమని ప్రొత్సహిస్తాను’’ అని అన్నారు.
వలస కార్మికులు.. పిల్లలకు సంక్షోభం
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 45.51 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. వీరిలో తమిళనాడులోనే 34 లక్షలు ఉన్నారు. తిరుపూర్ వంటి పారిశ్రామిక కేంద్రాలలో 20 లక్షలకు పైగా కార్మికులు మిల్లులలో పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది తమ పిల్లలను స్థానిక పాఠశాలలో చేర్పిస్తున్నారు.
భాషా సమ్మిళిత ప్రాముఖ్యతను గుర్తించి, తమిళనాడు పాఠశాల విద్యా మంత్రి మహేశ్ పొయ్యమోళి ఇటీవల ‘ తమిళ మోళీ కార్పొమ్’ (తమిళం నేర్చుకుందాం) కార్యక్రమాన్ని ప్రారంభించారు. వలస వచ్చిన పిల్లలు తమిళం నేర్చుకోవడానికి రూ. 71.10 లక్షలు కేటాయించారు. అయితే కేంద్రం నిధులు నిలిపివేయడంతో ఈ ప్రయత్నాలకు దెబ్బతీస్తుంది.
త్రిభాష విధానంపై కేంద్రం వైఖరి, ఎన్ఈపీ 2020కి తమిళనాడు ప్రతిఘటన విద్యను యుద్దభూమిగా మార్చాయి. కానీ రాజకీయ విభేదాల కారణంగా పిల్లలు బాధపడాలా? దీనిపై ఆలోచించాలి.
Next Story