కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ రిలీజ్‌కు అనుమతించం..
x
‘థగ్ లైఫ్’ చిత్రంలో ఓ సన్నివేశం

కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ రిలీజ్‌కు అనుమతించం..

తేల్చిచెప్పిన కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ..


Click the Play button to hear this message in audio format

కర్ణాటక (Karnataka) ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) కీలక నిర్ణయం తీసుకుంది. ‘థగ్ లైఫ్’ మూవీ రిలీజ్‌కు అనుమతించమని తేల్చి చెప్పింది. కన్నడ భాష గురించి వివాదస్పద వ్యాఖ్య చేసిన తమిళ నటుడు కమల్ హాసన్(Kamal Haasan).. రెండు రోజుల్లోపు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే సినిమా రిలీజ్‌ కాదని KFCC రెండు రోజుల క్రితం ఆయనకు సమాచారం పంపింది. అయితే కమల్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. తప్పు చేస్తేనే చెబుతానని బదులిచ్చారు.

KFCC అధ్యక్షుడు ఎం. నరసింహులు శుక్రవారం (మే 30) ది ఫెడరల్ కర్ణాటకతో మాట్లాడారు. ‘‘కర్ణాటకలో పెరుగుతున్న ప్రజాగ్రహం గురించి కమల్‌కు ఈ మెయిల్ పంపాం. అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. కన్నడ భాషా సంఘాలు, భాషాప్రియులు ఆయన సినిమా విడుదలకు ఆపేయాలని పట్టుబడుతున్నారు. వారి నిర్ణయానికి ఫిల్మ్ ఛాంబర్ సంఘీభావం తెలిపింది.’’అని పేర్కొన్నారు.

కమల్ వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్యతో సహా పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఖండించిన విషయం తెలిసిందే.

ఇంతకు కమల్ ఏమన్నారు?

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన చిత్రం ‘థగ్ లైప్’ (Thug Life) మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’ అని అన్నారు. ఆ ఒక్క మాట రెండు రాష్ట్రాల మధ్య పెద్ద వివాదానికి దారితీసింది. కన్నడనాట భాషాభిమానుల హృదయాలను గాయపర్చింది. నిరసనలకు కారణమైంది. కొంతమంది నిరసనకారులు కమల్ పోస్టర్లను తగులపెట్టారు. కొంతమంది కమల్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read More
Next Story