మతాచారాలను మీరు నిరోధించలేరు: సుప్రీంకోర్టు ఆగ్రహం
x

మతాచారాలను మీరు నిరోధించలేరు: సుప్రీంకోర్టు ఆగ్రహం

దేశంలోని ప్రజల మతాచారాలను ఎవరు బలవంతంగా నిరోధించలేరని, అయోధ్య ప్రత్యక్షప్రసారాలను నిషేధించడానికి తమిళనాడు పోలీసులు చూపిన కారణాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది


దేశంలోని ఏ వ్యక్తులు కూడా ప్రజల మతాచారాలను బలవంతంగా నిరోధించలేరు అని తమిళనాడు పోలీసులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో కొన్ని ప్రాంతాలలో పూజలు నిరోధించారని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. దీనిపై జస్టిస్ ఖన్నా, జస్టిస్ దత్తాతో కూడిన ధర్మాసనం విచారించింది. పూజలు ఆపమనడానికి తమిళనాడు పోలీసులు చూపిన కారణాన్ని తిరస్కరించింది.

మన దేశంలోని వివిధ రకాల ప్రజలు ఒకే సమాజంలో నివసిస్తున్నారు. ఒక ప్రాంతంలో ‘ఏ’ అనే కమ్యూనిటీ ప్రజలు నివసిస్తున్నారు. ఇదే ప్రాంతంలోని ‘బీ’ అనే కమ్యూనిటీ ప్రజలు నివసిస్తున్నారనే మీరేలా మతాచారాలను నిరోధిస్తారని జస్టిస్ ఖన్నా ప్రశ్నించారు. శాంతి భద్రతల దృష్ట్యా ఏదైన కారణం చూపితే అదీ ఈ పద్దతిలో మాత్రం కాదు అని అన్నారు.

తమిళనాడు పోలీసులు రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలకు అనుమతించడం లేదని, అయోధ్య ప్రత్యక్ష కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని పిటిషనర్ వినోద్ ఆరోపించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదీ దామ శేషాద్రీ నాయుడు వాదించారు. కనీసం అన్నదానం, భజనలను కూడా చేయకుండా తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని ఆరోపించారు. దీనిపై సోమవారం ఉన్నత న్యాయస్థానం విచారించింది.

చట్ట ప్రకారం నడుచుకోవాలని తమిళనాడు అధికారులకు సుప్రీంకోర్టు చివాట్లు వేసింది. అయితే దీనిపై తమిళనాడు తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాదీ అమిత్ ఆనంద్ తివారీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదీ రాజకీయ ప్రేరేపితం అని, ఆలయాల్లో ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు. ఆయన వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్ చేసింది. అలాగే పూజ, అర్చన కోసం అనుమతించిన డేటాను భద్రపరచాలని, ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుమతించిన, అనుమతించని డేటాను సైతం నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సోలిటరీ జనరల్ "ఈ పరిస్థితి చూసి దిగ్ర్భంతికి గురయ్యాను. దేశంలో ఇప్పటికి పాలన రాజ్యాంగం ప్రకారమే నడుస్తోంది. తమిళనాడు కూడా దేశంలో ఓ భాగమే. దానికి రాజ్యాంగం వర్తిస్తుంది కదా. ఇలాంటి చర్యలకు మున్ముందు ఏ రాష్ట్రం పాల్పడకుండా దేశంలోని ఉన్నత న్యాయస్థానం నుంచి గట్టి సందేశం పంపండి" అని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

జస్టిస్ దత్తా మాట్లాడుతూ "ఇతర కమ్యూనిటీలు పక్కన ఉంటే, మీరు సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వారా? హిందువులు మైనారిటీ ఉన్న ప్రాంతమని చెబుతున్నారు. మరీ హిందువులు మెజారిటీ ప్రాంతాల్లో మైనారిటీ లకు కూడా మతాచారాలకు అనుమతి ఇవ్వారా? అని ప్రశ్నించారు. శాంతిభద్రతల సమస్య ఉందని తివారీ చెప్పే ప్రయత్నం చేసిన న్యాయస్థానం దానిని ఆమోదించలేదు.

Read More
Next Story