‘మీకు మాట్లాడటం రాాదు, వంట చేయడానికే పనికొస్తారు’ కాంగ్రెస్ ఎమ్మెల్యే
నీకు మాట్లాడటం చేతకాదు.. వంటిట్లో కూర్చుని వంట చేసుకో అంటూ కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు నోరు జారారు. ప్రత్యర్థి బీజేపీ కి చెందిన గాయత్రి అనే లోక్ సభ క్యాండిడేట్ పై ‘ నువ్వు రాజకీయాలకు పనికి రావు, వంటిల్లే నీకు బెటర్’ అంటూ వ్యాఖ్యలు చేయడంతో దావణగిరే సౌత్ ఎమ్మెల్యే, విద్యావేత్త షామనూర్ శివశంకరప్ప వివాదంలో చిక్కుకున్నారు. దీంతో మహిళాలోకం భగ్గుమంది.
92 ఏళ్ల ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాయత్రికి "సరిగ్గా మాట్లాడడం కూడా రాదు, ఓట్లు అడిగే ముందు తన నియోజకవర్గాన్ని అర్థం చేసుకోవాలి" అన్నారు. ఇటీవల బంట్స్ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి శివశంకరప్ప మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు., “ఆమెకు సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. ఆమె ఇంట్లో ఆహారాన్ని వండడానికి సరిపోతుంది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు కోరే ముందు దావణగెరె సమస్యలను ఆమెను అర్థం చేసుకోనివ్వండి." "లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇవ్వాలని ఆమె ఓటర్లను అడుగుతోంది, తద్వారా ఆమె మోదీకి కమలం సమర్పించవచ్చు" అని ద్వంద అర్థపు వ్యాఖ్యలు చేశారు.
వ్యాఖ్యలపై వేదన
శివశంకరప్ప వ్యాఖ్యలపై గాయత్రి వేదన వ్యక్తం చేస్తూ, నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారని కానీ 'అజ్జా' (వృద్ధుడు)కి మాత్రం తెలియడం లేదని అన్నారు. శామనూరు శివశంకరప్ప తన వ్యాఖ్యలతో మహిళలను అవమానించారని.. మనం కేవలం వంటింటికే పరిమితమయ్యామా? ఆమె ప్రశ్నించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తున్నారని.. కానీ ఈ వ్యక్తులు మహిళలను అవమానిస్తూనే ఉన్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచ చేశారు..
కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చిన సైనా నెహ్వల్
శివశంకరప్ప వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో, మాజీ ప్రపంచ నంబర్ 1 బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చేసిన పోస్ట్ లో.. "'మహిళను వంటింటికే పరిమితం చేయాలి'- ఇది కర్ణాటక అగ్ర నాయకుడు షామనూర్ శివశంకరప్ప జీ అన్నారు. ఇదే ఇండి కూటమి నేతలు మహిళలకు ఇచ్చే గౌరవం అనే అర్థం వచ్చే రీతిలో ప్రశ్నించారు.
" ఆడవాళ్ళందరూ తమకు నచ్చిన ఏ రంగంలోనైనా పెద్ద ఎత్తున విజయం సాధించాలని కలలు కంటున్నప్పుడు అలా ఎందుకు అనడం.. ఒకవైపు 'నారీ శక్తి కో వందన్' చేస్తున్నాం. మన ప్రధాని మోదీ సర్ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. మరోవైపు 'నారీ శక్తి కా ఆప్మాన్' & స్త్రీద్వేషపూరిత వ్యక్తులు.. నిజంగా కలత చెందారు" అని సైనా పోస్ట్ చేసింది.
'ఎస్ శివశంకరప్ప అయినా, కాంగ్రెస్ అయినా సరే.. వారంతా మహిళా వ్యతిరేకులు.. భారతీయ మహిళలు సైంటిస్ట్, పైలట్‌గా ఉండేందుకు అర్హులు. అయితే, వారు టైప్‌కాస్టింగ్ మహిళలే' అని బీజేపీ నాయకురాలు షైనా చూడాసమా మునోత్ ఆరోపించారు. 'లడ్కీ హూన్, లడ్ సక్తి హూ' వంటి ప్రచారాన్ని కాంగ్రెస్ నిర్వహిస్తున్నప్పుడు, ప్రియాంక గాంధీ వాద్రా, సోనియా గాంధీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని ఆమె ప్రశ్నించారు.
Next Story