TIRUPATI STAMPEDE| తిరుపతి విష్ణు నివాసం వద్ద తొక్కిసలాట..
తమిళనాడు భక్తురాలి మృతి: మరో నలుగురికి అస్వస్థత
వైకుంఠద్వార సర్వదర్శనం (Vykunta dwara Darshanam) టోకెన్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది. తిరుపతిలోని విష్ణు నివాసం(Vishnu Nivaasam) వద్ద టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. తోపులాటలో తమిళనాడు(Tamilnadu)లోని సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందారు. మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనసై టీటీడీ(TTD) స్పందించింది. ఘటన బాధాకరమని పేర్కొంది.
ఇదివరకే కీలక సూచనలు చేసిన టీటీడీ..
కాగా ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకూ తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.అలాగే భక్తులకు కొన్ని కీలక సూచనలు చేసింది. రద్దీని నియంత్రణకు టోకెన్లు, టికెట్లపై సూచించిన సమయంలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపింది. వైకుంఠ ద్వార దర్శనానికి (Vykunta dwara Darshanam) ఆన్‌లైన్‌లో టికెట్లు పొందని భక్తులకు.. తిరుమల, తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టికెట్లు పొందేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. జనవరి 10, 11, 12వ తేదీలకు సంబంధించి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే స్థానికుల కోసం తిరుమలలో మరో 4 కౌంటర్లు ఏర్పాటు చేసింది.
తిరుపతిలో ఇందిరా మైదానం(15), రామచంద్ర పుష్కరిణి(10), శ్రీనివాసం కాంప్లెక్స్(12), విష్ణునివాసం కాంప్లెక్స్(14), భూదేవి కాంప్లెక్స్(11), భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల(10), ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(8), జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(10), ఇక తిరుమలలో స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్(4)లో ఏర్పాట్లు చేసింది. జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో మాత్రమే టోకెన్లు జారీ చేయనున్నారు.
Next Story