కేజ్రీవాల్ బెయిల్‌పై ఉత్తర్వులను రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
x

కేజ్రీవాల్ బెయిల్‌పై ఉత్తర్వులను రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ బెయిల్ పిటీషన్‌పై సుప్రీం కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ బెయిల్ పిటీషన్‌పై సుప్రీం కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఆయనపై అవినీతి కేసు ఫైల్ చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారించింది. అవినీతి కేసులో తన అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.

‘అసలు నోటీసే ఇవ్వలేదు’

అరెస్టుకు ముందు కేజ్రీవాల్‌కు సీబీఐ ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, ట్రయల్ కోర్టు ఎక్స్-పార్టీ అరెస్ట్ ఆర్డర్ జారీ చేసిందని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. ‘ఎఫ్‌ఐఆర్‌లో కేజ్రీవాల్ పేరు లేదు. కేజ్రీవాల్ "ఫ్లైట్ రిస్క్" కూడా కాదు. ఆగస్టు 2023లో ప్రారంభమైన మనీలాండరింగ్ కేసులో ఈ సంవత్సరం మార్చిలో అరెస్టుకు దారితీసింది." అని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి మనీలాండరింగ్ చట్టం (PMLA) కింద రెండుసార్లు ఉపశమనం పొందిన విషయాన్ని సింఘ్వీ ప్రస్తావించారు.

అంతకుముందు ఆగస్టు 14న బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర బెయిల్‌ను తిరస్కరించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సీబీఐని అనుమతిస్తూ విచారణను సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది.

ఢిల్లీ ముఖ్యమంత్రిని తొలిసారిగా మార్చి 21, 2024న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసింది. జూన్ 26న అవినీతి కేసులో CBI అరెస్టు చేసింది. మద్యం పాలసీ స్కాంతో సంబంధం ఉన్న ED కేసులో ఉన్నత న్యాయస్థానం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది.

Read More
Next Story