కన్యాకుమారి చేరుకున్న ప్రధాని
x

కన్యాకుమారి చేరుకున్న ప్రధాని

ప్రధాని మోదీ తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు. వివేకానంద స్మారక స్థూపం వద్ద 45 గంటల పాటు నిర్వహించే ధ్యాన కార్యక్రమాన్నిఆయన ప్రారంభించనున్నారు.


ప్రధాని మోదీ తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు. వివేకానంద స్మారక స్థూపం వద్ద 45 గంటల పాటు నిర్వహించే ధ్యాన కార్యక్రమాన్నిఆయన ప్రారంభించనున్నారు.

తొలుత తిరువనంతపురంలోని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేసిన తర్వాత రాక్ మెమోరియల్‌కి చేరుకుంటారని సమాచారం.

జూన్ 1న తిరిగి వెళ్లారు. బయలుదేరే ముందు స్మారక చిహ్నం పక్కనే ఉన్న తిరువల్లువర్ విగ్రహాన్ని మోదీ సందర్శించే అవకాశం ఉంది. స్మారక చిహ్నం, విగ్రహం రెండింటిని చిన్న చిన్న ద్వీపాలపై నిర్మించారు.

లోక్‌సభ ఏడో దఫా ఎన్నికల ప్రచారం ముగియడంతో స్వామి వివేకానందకు నివాళిగా రాక్ మెమోరియల్ వద్ద మోదీ ధ్యానం చేస్తారని బీజేపీ నేతలు తెలిపారు. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ప్రధానమంత్రి కేదార్‌నాథ్‌కు వెళ్లిన విషయాన్నివారు గుర్తు చేశారు.

గురువారం సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ధ్యాన మండపంలో మోదీ ధ్యానం చేయనున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో భద్రత పెంచారు. ఆయన బస చేయనున్న ప్రాంతంలో 2000 మంది పోలీసు సిబ్బంది కాపలాగా ఉంటారు.

Read More
Next Story