బెట్టు వీడని స్మితా.. పట్టువీడని రేవంత్..
x
స్మితా సబర్వాల్ ఫైల్ ఫోటో

బెట్టు వీడని స్మితా.. పట్టువీడని రేవంత్..

కేసీఆర్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఐఎఎస్‌ స్మితా సబర్వాల్‌ బెట్టు వీడలేదు. బీఆర్‌ఎస్‌ ఓడినా స్మితా కించిత్‌ కదలలేదు.. రేవంత్‌ని కలవలేదు...


స్మితా స‌బ‌ర్వాల్.. ఐఎఎస్‌.. గత బీఆర్‌ఎస్‌ స‌ర్కార్‌లో సీఎంవోలో కీలక అధికారి. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన‌లేని ప్రాదాన్యత ఇచ్చిన అధికారుల్లో ఒకరు.. తొమ్మిదిన్నరేళ్లపాటు ఆమె చెప్పింది వేదం, చేసింది పని. అంతలా సీఎంవోలో చ‌క్రం తిప్పారు. ఎంత‌లా అంటే... ఫీల్డ్ విజిట్‌ల‌ను ప్రత్యేక హెలీ కాప్టర్‌లో వెళ్లి చేసేంత‌ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు సీన్ క‌ట్ చేస్తే... రేవంత్ స‌ర్కార్ బ‌దిలీ వేటుతో.. స్మితాను లూప్ లైన్ పోస్టుకు పరిమితం చేసింది. దీంతో స్మితా సబర్వాల్‌ బదిలీ IAS స‌ర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆ 26మందిలో ఈమె ఒకరు..


సీఎం రేవంత్ రెడ్డి అధికార ప‌గ్గాలు చేప‌ట్టాక.. కేసీఆర్‌కు విశ్వాస పాత్రులుగా పనిచేసిన స‌ల‌హాదారుల‌ను రేవంత్ రెడ్డి తొలగించారు. తాజాగా 26 మంది IASల‌ను బ‌దిలీ చేశారు. ఇందులో స్మితా స‌బ‌ర్వాల్‌ను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ట్రాన్స్‌ఫర్‌ చేయడం చర్చనీయాంశం అయ్యింది.

స్మితా భావోద్వేగ ఫలితమే ఆ పోస్టు...

తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో మెద‌క్ క‌లెక్టర్‌గా ఆమె పెట్టిన క‌న్నీళ్లే... కేసీఆర్ స్మితాను CMOలోకి తీసుకోవ‌డానికి కారణమనే చ‌ర్చ ఉంది. ఇక సీఎం సెక్రటరీగా ఎంట్రీ ఇచ్చిన స్మితా స‌బ‌ర్వాల్... KCR కోట‌రీలో.. కీలకంగా మారిపోయారు. ప్రిన్సిపల్ సెక్రట‌రీ ఇరిగేషన్, పిఆర్ అండ్‌ RD, మిషన్ భగీరథల‌కు ప‌నిచేస్తూ... గులాబీ బాస్‌ డ్రీమ్ ప్రాజెక్టు అయిన‌ కాళేశ్వరానికి ప్రత్యేక పర్యవేక్షణ అధికారిగా ప‌నిచేశారు. తొమ్మిదిన్నరేళ్లు గత స‌ర్కార్‌లో వెలుగు వెలిగారు. దీంతో ఆమెకు ఎదురుచెప్పే అధికారి లేకుండాపోయారు. సీనియ‌ర్ IASల‌ను ఆమె లైట్ తీసుకునేవార‌న్న ఆరోపణ‌లు ఉన్నాయి.

ప్రత్యేక హెలికాఫ్టర్‌ వాడేంత స్వేచ్ఛ...

ఫీల్డ్‌ విజిట్‌లకు కూడా ప్రత్యేక హెలికాప్టర్‌ వాడేంత స్వేచ్ఛ స్మితా సబర్వాల్‌కు ఉండటం... ఆమెపై విమర్శలకు తావిచ్చింది. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం వార్తల్లో ఉండేవారు. హ్యాంగ్‌ ఔట్, ఫారెన్‌ టూర్‌, ఫేజ్‌ త్రీ పార్టీలతో ట్రెండ్‌ అయ్యేవారు. అప్పట్లో ఆమె ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి వచ్చారని.. CMO అధికారికే రక్షణ లేకుండా పోయిందని స్మితా చేసిన ట్వీట్‌ పొలిటికల్‌గాసంచలనం రేపింది. ఇలా అధికారిక పర్యటనలతో పాటు పర్సనల్‌ లైఫ్‌లో అందరి అటెన్షన్‌ను డైవర్ట్‌ చేసే ఆఫీసర్‌గా స్మితా సబర్వాల్‌ నిలిచారు. ఇలా హై లెవ‌ల్ ఆఫీసర్‌గా... కీర్తిప్రతిష్టలు తెచ్చుకొని.... కేసీఆర్‌తో ప్రశంసలు అందుకున్న ఆమె... ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరికీ బదిలీ కావటం హాట్‌ టాపిక్‌గా మారింది.

పట్టువీడని స్మితా.. నెలైనా సీఎంని కలవని స్మితా...

రాష్ట్రంలో BRS ఓడిపోయి... కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో... స్మితా స‌బ‌ర్వాల్ కేంద్ర స‌ర్వీసుల్లోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె వ్యవ‌హ‌రించిన తీరు బ‌లం చేకూర్చింది. సీఎం ఎవరైనా IASలు వారిని మ‌ర్యాద పూర్వాకంగా కలుస్తారు. కానీ, నెలరోజులు దాటినా స్మితా స‌బ‌ర్వాల్ ఇప్పటివరకు రేవంత్‌ను కలవకపోవడంతో... IAS స‌ర్కిల్లో చ‌ర్చనీయాంశ‌ంగా మారింది. అయినా ఆమె లైట్‌ తీసుకున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బ‌దిలీ వేటుతో.... స్మితాను లూప్ లైన్ పోస్ట్‌కు ట్రాన్సఫ‌ర్ చేశారు. గత ప్రభుత్వంలో అంతా తానై కేసీఆర్‌కు నీడలా ఉండి చ‌క్రం తిప్పిన స్మితా స‌బర్వాల్ ఇప్పుడు అప్రధాన్య పోస్ట్‌కు పరిమితం అయ్యారు. అయితే స్మితా ఈ పోస్టులో ఇక్కడే కొనసాగుతారో... లేదా కేంద్ర స‌ర్వీసుల్లోకి వెళ్తారో చూడాలి.

Read More
Next Story