
భారత్‌లోకి ‘టెస్లా’ ఎలక్ట్రిక్ కార్లు..
షో రూం వివరాలు వెల్లడించిన కంపెనీ..
ఎలక్ట్రిక్ కార్ల విషయాలనికొస్తే..ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాట టెస్లా (Tesla). ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఎలోన్ మస్క్(Elon Musk) ఈ కార్ల కంపెనీకి ఓనర్. అమెరికాలోనే బాగా అమ్ముడవుతున్న టెస్లా కార్లు త్వరలో భారత్‌లోనూ కనిపించబోతున్నాయి. జూలై 15న ముంబైలో తొలి షోరూమ్‌ను కంపెనీ ప్రారంభించబోతుంది. ఈ మేరకు కంపెనీ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.
కొంతకాలం తర్వాత ఢిల్లీలో మరో షో రూం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలో ముంబైలోని లోధా లాజిస్టిక్స్ పార్క్‌లో 24,565 చదరపు అడుగుల స్థలాన్ని కంపెనీ లీజుకు తీసుకుంది.
టెస్లాలో స్పెషలేంటి?
అత్యుత్తమ పనితీరు, పర్యావరణ అనుకూలత, లెటెస్ట్ డిజైన్‌తో ఆకట్టుకుంటున్న ఈ కార్లు.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కారణంగా అధిక వేగంతో ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అందుకే ఎలక్ట్రిక్ కార్లు కొనడానికి ఇష్టపడే వారు ఇప్పుడు టెస్లా వైపు చూస్తున్నారు.
వాస్తవానికి టెస్లా CEO ఎలాన్ మస్క్ గతేడాది భారత్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ముఖ్యమయిన పనుల వల్ల రాలేకపోయానని ఆయన చెప్పారు. ఇక 40వేల డాలర్ల లోపు కార్లకు 70%, అంతకన్నా ఎక్కువ ధర ఉన్నవాటికి 100% కస్టమ్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని మస్క్ భారత ప్రభుత్వాన్ని కోరారు.