ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్న ‘ది ఫెడరల్’ జర్నలిస్టులు
x
ది ఫెడరల్ కర్ణాటక అధిపతి నవీన్ అమ్మెంబాల, సీనియర్ కరస్పాండెంట్ ప్రభు స్వామి నటేకర్

ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్న ‘ది ఫెడరల్’ జర్నలిస్టులు

ఉత్తమ కథనాలు అందించినందుకు కర్ణాటక ఎడిషన్ అధిపతి, సీనియర్ కరస్పాండెంట్ ను వరించిన పురస్కరాలు


డిజిటల్ వార్తా ప్రపంచంలో రోజురోజుకు విశ్వసనీయంగా ఎదుగుతూ, దూసుకుపోతున్న సంస్థ ‘ది ఫెడరల్’. అది కొంతకాలంగా చేస్తున్న నిష్ఫాక్షికత జర్నలిజానికి గుర్తింపు దక్కింది. ‘ది ఫెడరల్ కర్ణాటకకు’ చెందిన ఇద్దరు జర్నలిస్టులకు ప్రతిష్టాత్మక జర్నలిజం అవార్డులు వరించాయి.

ది ఫెడరల్ అసోసియేట్ ఎడిటర్, కన్నడ ఎడిషన్ ‘ది ఫెడరల్ కర్ణాటక’ ఎడిటర్ అయిన నవీన్ అమ్మెంబాలకు బెంగళూర్ ప్రెస్ క్లబ్ వార్షిక అవార్డు(2025) లభించింది. ఆయనకు జర్నలిజంలో దాదాపు 28 సంవత్సరాల అనుభవం ఉంది.
ప్రత్యేక నివేదికలు, సంపాదకీయంలో నైపుణ్యం కనపరిచినందుకు ఈ గౌరవానికి అర్హులుగా కమిటీ భావించింది. వివిధ విభాగాలలో ప్రముఖ మీడియా నిపుణులను సత్కరించే కార్యక్రమంలో కర్ణాటక శాసనమండలి చైర్మన్ బసవరాజ్ హెురట్టి ఆ అవార్డును నవీన్ అమ్మెంబాలకు అందజేశారు.
‘ది ఫెడరల్ కర్ణాటక’ సీనియర్ కరస్పాండెంట్ ప్రభు స్వామి నటేకర్ కు కర్ణాటక మీడియా అకాడమీ వార్షిక అవార్డు(2025) కు ఎంపిక అయ్యారు. ఆయనకు జర్నలిజంలో 18 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ అవార్డు కింద ఆయనకు రూ. 50 నగదు పురస్కారం లభిస్తుంది. ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వ అధికార కార్యక్రమంలో ప్రధానం చేస్తారు.
28 సంవత్సరాల కృషి..
నవీన్ అమ్మెంబాల ఐఐఎస్ ఉగ్రవాద దాడి(2005) ఐటీ ప్రొఫెషనల్ ప్రతిభా హత్య(2005), బెంగళూర్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి ఉగ్రవాద నిందితుడు పాకిస్తాన్ కు ఫోన్ చేసిన కేసు(2009) వంటి వాటిని ఉత్తమ కథనాలుగా మలచడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
ది ఫెడరల్ లో చేరిన తరువాత కోలార్ టమోటా రైతుల బాధలు, ముడా కుంభకోణం, రెండు భాషల ఫార్ములా వంటి సమాఖ్య సమస్యలపై ప్రత్యేక కథనాలు క్షేత్ర స్థాయి నుంచి అందించారు. కర్ణాటకలో తమ ప్రభావాన్ని కోల్పోయిన నక్సలిజంపై పరిశోధనాత్మక కథనాలు కూడా ఇందులో ఉన్నాయి.
వయనాడ్ లో గత ఏడాది జరిగిన కొండ చరియలు విరిగినపడిన ఘటనపై సమగ్రమైన కథనాలు అందించారు. ఇక్కడ భూమి సున్నితంగా ఉందని తెలియజేశారు. కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకం భావించి చేపట్టిన వెనకబడిన తరగతుల కమిషన్ స్ట్రాంగ్ రూమ్ నుంచి అసలు కుల జనాభా గణన పత్రం అదృశ్యంపై న చేసిన దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.
ప్రభు నటేకర్.. చురుకైన రిపోర్టింగ్..
లోకాయుక్త, నేరాలు, సమకాలీన రాజకీయాలపై చురుకైన రిపోర్టింగ్ చేయడంలో ప్రభు స్వామి నటేకర్ మంచి పేరు సంపాదించారు. ‘ది ఫెడరల్’ కోసం ఆయన ధర్మస్థల సామూహిక ఖననాల కేసుపై క్షేత్ర స్థాయి నుంచి సమర్థవంతమైన కథనాలు అందించారు. ఆలయ పట్టణంలో జరుగుతున్న పరిణామాలు ప్రజల కోణంలో విశ్లేషించారు.
ఇటీవల కాలంలో మధ్యాహ్న భోజన పథకం, బళ్లారి బ్యానర్ ఘర్షణ వంటి సామాజిక సమస్యలను కూడా అందించారు. ఇవే కాకుండా నేరాలు, పాలన, సామాజిక- రాజకీయ అంశాలపై అనేక ప్రత్యేక పరిశోధనాత్మక కథనాలు ఫెడరల్ కోసం తీసుకొచ్చారు.
పత్యేక ఎడిషన్లు..
ఫిబ్రవరి 2024 లో ది ఫెడరల్ కర్ణాటక ప్రారంభం అయింది. ఇది వార్తలు, ఫీచర్, కథనాలు, అభిప్రాయాలను వివిధ విభాగాల నుంచి అందిస్తోంది. ఈ వెబ్ సైట్ ప్రారంభించిన తరువాత అతి తక్కువ కాలంలోనే ది ఫెడరల్ కర్ణాటక యూట్యూబ్ ఛానెల్ 62 వేల కంటే ఎక్కువ మంది సబ్ స్రైబర్ లను సంపాదించుకుంది. 2.6 మిలియన్ పైగా వీక్షణలను సంపాదించింది.
ది ఫెడరల్ కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ఎడిషన్ లతో పాటు, ది ఫెడరల్ దేశ్ అనే హిందీ ఎడిషన్ లను సైతం నిర్వహిస్తోంది. డిజిటల్ వార్తా ప్రపంచంలో అత్యంత నమ్మకంగా, నిష్పాక్షికమైన జర్నలిజం చేస్తున్న సంస్థగా పేరు సంపాదించుకుంది.
Read More
Next Story