రాష్ట్రపతి భవన్ లోని ప్రముఖ హాల్ ల పేర్లు మార్పు..
x

రాష్ట్రపతి భవన్ లోని ప్రముఖ హాల్ ల పేర్లు మార్పు..

రాష్ట్రపతి భవన్ లోని బ్రిటిష్ పాలనా కాలంలో పెట్టిన పేర్లను ప్రస్తుత ప్రభుత్వం మార్చింది. రెండు హాల్ అయినా దర్భార్ హల్, అశోకా హాల్ ల పేర్లను..


రాష్ట్రపతి భవన్‌లోని రెండు ఐకానిక్ హాళ్ల యిన దర్భార్ హాల్, అశోకా హాల్ పేర్లను మార్చారు. ఇక నుంచి వీటి పేర్లు గణతంత్ర్య మండపం, అశోకా మండపంగా మార్చారు. "ప్రజలకు రాష్ట్రపతి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి భవన్ వాతావరణం భారతీయ సాంస్కృతిక విలువలు, నైతికతలను ప్రతిబింబించేలా చేయడానికి స్థిరమైన ప్రయత్నం జరిగింది" అని రాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక ప్రకటనలో తెలిపింది.

పేర్లు ఎందుకు మార్చాలి?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించే ముఖ్యమైన రెండు హాళ్లకు పేరు మార్చడం సంతోషంగా ఉందని పేర్కొంది. జాతీయ అవార్డుల ప్రదానం వంటి ముఖ్యమైన వేడుకలకు 'దర్బార్ హాల్' వేదిక గా ఉంటుంది.
'దర్బార్' అనే పదం భారతీయ పాలకులు, బ్రిటిష్ వారి న్యాయస్థానాలు, సమావేశాలను సూచిస్తుంది. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చాక ఈ భావం అడుగంటిపోయింది. ఇప్పుడు ఇండియా గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. అంటే 'గణతంత్ర' భావన ప్రాచీన కాలం నుంచి భారతీయ సమాజంలో లోతుగా పాతుకుపోయింది. , వేదికకు 'గణతంత్ర మండపంగా' పేరు మార్చడం సముచితంగా ఉంటుందని ప్రకటన పేర్కొంది
అశోక్ హాల్
'అశోక్ హాల్' మొదట బాల్రూమ్. 'అశోక్' అనే పదానికి అర్థం.. 'అన్ని బాధల నుంచి విముక్తి' లేదా 'ఏ దుఃఖం లేని' వ్యక్తిని సూచిస్తుంది" అని ప్రకటన పేర్కొంది. అలాగే, 'అశోక' అనేది అశోక చక్రవర్తిని సూచిస్తుంది, ఇది ఐక్యత, శాంతియుత సహజీవనానికి ప్రతీక అని పేర్కొంది.
"రిపబ్లిక్ ఆఫ్ ఇండియా జాతీయ చిహ్నం సారనాథ్ నుంచి తీసుకున్నారు. ఈ పదం భారతీయ మత సంప్రదాయాలు, కళలు, సంస్కృతిలో లోతైన ప్రాముఖ్యత కలిగిన అశోక్ చెట్టును కూడా సూచిస్తుంది. 'అశోక్ హాల్' పేరును 'అశోక్'గా మార్చడం మండపం' భాషలో ఏకరూపతను తెస్తుంది. 'అశోక్' అనే పదానికి సంబంధించిన కీలక విలువలను సమర్థిస్తూ ఆంగ్లీకరణ జాడలను తొలగిస్తుంది," అని ప్రకటన పేర్కొంది.
భారత ప్రభుత్వం ఇంతకుముందు రాజ్ పథ్ పేరును కూడా కర్తవ్య పథ్ గా మార్చింది. అలాగే ఇండియన్ నేవీ నుంచి బ్రిటిష్ కాలంలో ఉన్న శిలువ గుర్తును తీసేసింది. దీనిక బదులుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ నౌక దళ గుర్తును జత చేసింది. అలాగే గణతంత్ర దినోత్సం తరువాత జరిగే బీటింగ్ రిట్రీట్ నుంచి కూడా వేరే మతాలకు సంబంధించిన లైన్లను తొలగించింది. దేశాన్ని పూర్తిగా భారతీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read More
Next Story