‘కాల్పుల విరమణలో మూడో వ్యక్తి జోక్యం లేదు’
x

‘కాల్పుల విరమణలో మూడో వ్యక్తి జోక్యం లేదు’

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్


Click the Play button to hear this message in audio format

ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) సమయంలో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన, కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్‌పై రాజ్యసభలో ఈరోజు (జూలై 30) ప్రత్యేక చర్చ నిర్వహించారు. అసలు ఏప్రిల్ 22 నుంచి జూన్ 16 వరకు ప్రధాని మోదీ(PM Modi), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు కూడా జరగలేదని జైశంకర్ పేర్కొన్నారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మధ్యవర్తిత్వం వహించారన్న వాదనలపై ప్రతిపక్షాలు రాజ్యసభలో చర్చకు పెట్టాయి.

భారతదేశం ఎలాంటి సీమాంతర ఉగ్రవాదాన్ని సహించదని జైశంకర్ స్పష్టం చేశారు. పొరుగు దేశం పాకిస్తాన్‌ మళ్లీ దాడి చేసినప్పుడల్లా ఆపరేషన్ సిందూర్ మొదలవుతుందని చెప్పారు.

Read More
Next Story