2023లో పార్లమెంట్‌ను కుదిపేసిన ఘటనలు ఇవే..
x

2023లో పార్లమెంట్‌ను కుదిపేసిన ఘటనలు ఇవే..

పార్లమెంటులో అనూహ్య సంఘటనలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి అంతరం పెరుగుతూ ఉంది. 2013 దీనికి సాక్ష్యం. ఎలాగంటే..


పార్లమెంటు లోపల ప్రతిపక్షాల సస్పెన్సన్‌, వాకౌట్‌.. బయట నిరసన ప్రదర్శనల నడుమ ఎట్టకేలకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగిశాయి. రికార్డు స్థాయిలో 146 మంది ఎంపీల సస్పెన్షన్‌ పార్లమెంట్‌ చరిత్రలో ఎన్నటికి మరిచిపోలేనిది. కాగా మరికొన్ని ఘటనలు పార్లమెంట్‌ను కుదిపేశాయి.

ప్రతిపక్షం లేని పార్లమెంటు..

భారత పార్లమెంటు చరిత్రలో ప్రతిపక్షం లేని పార్లమెంటు ఇదే కావచ్చు. ఎంపీల సస్పెన్షన్‌తో ప్రతిపక్షాల బెంచీలు ఖాళీ అయ్యాయి. ‘‘ప్రజాస్వామ్య విలువలను నిరంకుశ మోడీ ప్రభుత్వం చెత్తబుట్టలో పడేసిందని’’ అని కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులు పాసైపోయాయి.

పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘన..

పార్లమెంట్‌లో ఎంపీల భద్రతపై ప్రతిపక్షాలు ఆందోళన బాటపడ్డాయి. డిసెంబర్‌ 13 నాటి ఘటన మొత్తం దేశాన్ని షాకింగ్‌కు గురిచేసింది. సాగర్‌ శర్మ, మనోరంజన్‌ అనే ఇద్దరు యువకులు విజిటర్స్‌ గ్యాలరీలోంచి లోక్‌సభ వెల్‌లోకి చొరబడ్డారు. అనంతరం పొగబాంబులు ప్రయోగించడంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. గతంలో 2001 లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇప్పుడు ఇది రెండోది. భద్రతా ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాల సభ్యులు పట్టుబట్టాయి. సభలను జరగకుండా అడ్డుకున్నారు. దీంతో సభాపతి వారిని సస్పెండ్‌ చేశారు. ఏది ఏమైనా, 2023 సంవత్సరం భారత పార్లమెంటరీ చరిత్రలో నిలిచిపోతుంది.

మహువా మొయిత్రా బహిష్కరణ..

క్యాష్‌ ఫర్‌ క్వెరీ కేసులో ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఆధారంగా లోక్‌సభ నుంచి టీఎంసీ ఫైర్‌బ్రాండ్‌ మహువా మొయిత్రాను బహిష్కరించారు. అయితే తన సస్పెన్షన్‌ను మోయిత్రా సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

గతంలో రాహుల్‌ గాంధీ..

‘మోదీ’ ఇంటిపేరు పరువు నష్టం కేసులో గుజరాత్‌ కోర్టు రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన్ను లోక్‌సభ నుంచి బహిష్కరించారు. అయితే సుప్రీంకోర్టు అతని నేరారోపణపై స్టే విధించడంతో ఆగస్టు 7న అతని సభ్యత్వం పునరుద్ధరించబడింది.

మొయిత్రా, రాహుల్‌ ఇద్దరూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో గళం విప్పారు.

లోక్‌సభలో ముస్లిం వ్యతిరేక దూషణలు

లోక్‌సభ వింటర్‌ సెషన్‌లో ఎంపీ కున్వర్‌ డానిష్‌ అలీపై బీజేపీ ఎంపీ రమేష్‌ బిధూరి వ్యాఖ్యలు దూమారాన్ని తేపాయి. బిధూరి ముస్లిం వ్యతిరేక దూషణలు దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు.

కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవ వేళ..

ప్రధాని మోదీ మే 28, 2023న కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ సమయంలో సెంగోల్‌ ( రాజదండం) ఏర్పాటుపై వివాదం తలెత్తింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరుకాలేదు. ముర్ముని ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడంతో కాంగ్రెస్‌ నేతృత్వంలోని 13 ప్రతిపక్ష పార్టీలు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే.

హిండెన్‌బర్గ్‌ నివేదిక..

మార్చిలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో హెండెన్‌బర్గ్‌ నివేదికపై రచ్చ జరిగింది. అదానీ గ్రూప్‌ సంస్థలపై విచారణ చేయించాలని ప్రతిపక్షాల డిమాండ్‌ చేశాయి. ఈ అంశం చాలా రోజుల పాటు మాటల యుద్ధానికి దారి తీసింది. మొత్తం మీద బడ్జెట్‌ వర్షాకాల, శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌ కేంద్రం మూడు డజన్లకు పైగా బిల్లులను ఆమోదించింది.

బిల్లులకు ఆమోదం..

రాజ్యసభ, లోక్‌సభలు షెడ్యూల్‌ కంటే ఒక రోజు ముందే వాయిదా పడ్డాయి. వాస్తవానికి సమావేశాలు డిసెంబర్‌ 22వరకు జరగాల్సి ఉంది. 14 రోజుల పాటు జరిగిన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో చాలా బిల్లులను కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఇతర ఎన్నికల కమిషనర్‌లతో సహా ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లు, టెలికమ్యూనికేషన్స్‌ బిల్లు, భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత బిల్లు భారతీయ సాక్ష్య బిల్లు, భారతీయ శిక్షాస్మృతి, 1860, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, ఇంకా చాలానే ఉన్నాయి.

Read More
Next Story