ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా ముందుంది : ప్రధాని మోదీ
x

ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా ముందుంది : ప్రధాని మోదీ

భారత వృద్ధిరేటు అంచనాలకు మించి రాణించడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని వ్యాఖ్యానించిన ఆయన.. భారత్ ప్రపంచంలోనే వేగంగా..


ఈ ఆర్ధిక సంవత్సర అంతానికి (2023-24) జీడీపీ అంచనాలకు మించి పెరగడం పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ పనితనానికి నిదర్శనంగా వ్యాఖ్యానించారు. ఇది మరింత వేగంగా ఎదుగుతుందని, ఇది ఆర్ధిక వ్యవస్థకు చోదక శక్తిగా పని చేస్తుందన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు.

"నేను చెప్పినట్లుగా, ఇది రాబోయే కాలానికి ట్రైలర్ మాత్రమే" అని ప్రధాని ఎక్స్ లో చెప్పాడు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ జనవరి-మార్చి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధిని సాధించింది, FY24 వార్షిక వృద్ధి రేటును 8.2 శాతానికి చేరింది, ప్రధానంగా తయారీ రంగంలోని మంచి ప్రదర్శన కారణంగా ఈ వృద్ధిరేటు సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
2023-24 క్యూ4 జిడిపి వృద్ధి డేటా మన ఆర్థిక వ్యవస్థలో బలమైన ఊపును చూపుతోంది, ఇది మరింత వేగవంతం కావడానికి సిద్ధంగా ఉంది, కష్టపడి పనిచేసే మన దేశంలోని ప్రజలకు ధన్యవాదాలు, 2023-24 సంవత్సరానికి 8.2% వృద్ధి భారతదేశం సాధించిదనడానికి ఇదోక ఉదాహరణగా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్ అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
తాజా వృద్ధితో భారత జీడీపీ 3.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఉద్భవించినట్లు అయింది. రూపాయల్లో చెప్పాలంటే 291 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. నరేంద్ర మోదీ 2.0 సర్కార్ భారత ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మారుస్తామని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వృద్ధిరేట్ ఇలాగే కొనసాగితే 2026 అంతానికి అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉందని ఆర్ధిక వేత్తలు చెబుతున్న మాట.


Read More
Next Story