దర్యాప్తు సంస్థలకు బలం చేకూర్చే తీర్పు ఇది..
x

దర్యాప్తు సంస్థలకు బలం చేకూర్చే తీర్పు ఇది..

ఒక సంస్థ ఆర్థిక పరిస్థితిపై మీడియా, థర్డ్ పార్టీ లు చేసే ఆరోపణలపై ఇకముందు విచారణ చేయడం వీలు కాకపోవచ్చు


షార్ట్ సెల్లింగ్ విషయంలో అదానీ- హిండెన్ బర్గ్ వివాదం పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారతీయ దర్యాప్తు సంస్థలు లేదా నియంత్రణ సంస్థలకు నిజంగా బలం చేకూర్చేదనే చెప్పవచ్చు. కచ్చితమైన సాక్ష్యం లేకుండా థర్డ్ పార్టీ చేసే ఆరోపణలను కేవలం ప్రాథమిక సమాచారంగా మాత్రమే చూడాలనే సర్వోన్నత న్యాయస్థానం తాజాగా రూలింగ్ ఇచ్చింది.

అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఆరోపణలపై ఇప్పటికే సెబీ చాలా అంశాలలో విచారణను పూర్తి చేసింది. అయినప్పటికీ పిటిషన్ దారులు సెబీ అధికారాన్ని ప్రశ్నించడంపై సుప్రీంకోర్టు ఆక్షేపించింది. దర్యాప్తు సంస్థ అధికార పరిధిలోకి తాము ప్రవేశించలేమని ధర్మాసనం నొక్కి చెప్పడం ఆసంస్థకు నిజంగా బలాన్ని చేకూర్చేదే. దాని విశ్వాసాన్ని పెంచే తీర్పే ఇదీ. భవిష్యత్ లో నియంత్రణసంస్థలకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఈ తీర్పును చూడవలసి ఉంటుంది. అలాగే షార్ట్ సెల్లింగ్ విషయంలో కూడా హిండెన్ బర్గ్ మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిందా లేదా అని కూడా చూడాలని సెబీని సుప్రీం ఆదేశించింది. ఇది కూడా గమనించవలసిన విషయం.

హిండెన్ బర్గ్ నివేదిక ప్రకారం అదానీ గ్రూపు ఏదైన చట్ట ఉల్లంఘనలకు పాల్పడిందా లేదా పరిశీలించాలని సెబీ, ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. కార్పొరేట్ వ్యవహరాలలో దేశం ఇప్పటికీ పారదర్శకంగా వ్యవహరిస్తుందని దీనితో రుజువవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా తమ వ్యవహరాలలో పారదర్శకత పెంపొందించుటలో ఉపయోగపడే అవకాశం కూడా ఉందంది.

సెబీ ఇప్పటికే 24 అంశాలలో 22 అంశాలపై దర్యాప్తు పూర్తి చేసింది. మిగిలిన వాటిని కూడా మరో మూడునెలల్లో పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఆర్థిక సంస్థలను రక్షించడానికి సమర్థవంతమైన చర్య తీసుకోవాలని సెబీకి, ప్రభుత్వానికి సూచించింది. ఇలాంటి చర్యలు భవిష్యత్ లో వాటాదారుల ప్రయోజనాల రక్షించడంలో ఉపయోగపడతాయని అభిప్రాయపడింది.

కేవలం అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే దర్యాప్తు సంస్థను మార్చడం సంభవిస్తుందని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. పిటిషన్ దారులు లేవనెత్తిన అంశాలపై విచారించి దర్యాప్తును వేరే సంస్థకు బదిలీ చేయడం కుదరదు అని ఆయన చెప్పారు. ఇంక ఈ తీర్పుతో మీడియా లేదా మూడో పార్టీలు చేసే ఆరోపణలపై ఒక సంస్థ ఆర్థిక పరిస్థితి పై విచారణ చేయడం ఇకముందు ముందు కుదరకపోవచ్చు.

రయ్ అని దూసుకుపోయిన మార్కెట్

అదానీ - హిండెన్ బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు తరువాత స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా అదానీ గ్రూపు షేర్లు రయ్ అని దూసుకుపోయాయి. కంపెనీ షేర్లు దాదాపు 11 శాతం మేర పెరిగాయి. ఫ్లాగ్ షిప్, అదానీ పోర్ట్స్, సెజ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ వరుసగా 2 నుంచి 5 శాతం వరకు పెరిగాయి. అదానీ విల్మార్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్ 3 నుంచి 11 శాతం పెరిగాయి. అంబూజా సిమెంట్స్, ఏసీసీ, ఎన్డీటీవీ లు కూడా దాదాపు 11 శాతం వరకూ పెరిగాయి.

Read More
Next Story