టీఎంసీ ఎంపీ కి కోపం వచ్చింది, సీసా పగలగొట్టాడు
x
Trinamool Congress MP Kalyan Banerjee. Photo source: PTI

టీఎంసీ ఎంపీ కి కోపం వచ్చింది, సీసా పగలగొట్టాడు

ఢిల్లీలో వక్ఫ్ బిల్లుపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు మంగళవారం జాయింట్ కమిటీ సమావేశమైంది.


ఢిల్లీలో వక్ఫ్ బిల్లుపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు మంగళవారం పార్లమెంటు జాయింట్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, AAP నాయకుడు సంజయ్ సింగ్ హాజరయ్యారు.

అసలేం జరిగింది?

బీజేపీకి చెందిన జగదాంబిక పాల్ అధ్యక్షతన ఏర్పాటయిన వక్ఫ్ బిల్లు జాయింట్ కమిటీ రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయవాదుల అభిప్రాయాలను వింటుండగా..బిల్లులో తమ వాటా ఏమిటని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. అదే సందర్భంలో బీజేపీకి చెందిన అభిజిత్ గంగోపాధ్యాయకు, బెనర్జీకి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. కోపోద్రిక్తుడైన బెనర్జీ టేబుల్‌ మీదున్న గ్లాస్ వాటర్ బాటిల్‌ను విసిరికొట్టారు. ఈ ఘటనతో కమిటీ సభ్యులు నివ్వెరపోయారు. గాజు ముక్కలు గుచ్చుకుని బెనర్జీ బొటనవేలు, చూపుడు వేలికి గాయాలు కావడంతో ప్రథమ చికిత్స చేశారు. ఈ ఘటనతో సమావేశాన్ని కొద్దిసేపు ఆపాల్సి వచ్చింది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బెనర్జీని పార్లమెంటరీ వక్ఫ్ బిల్లు కమిటీ ఒకరోజు సస్పెండ్ చేసింది.

Read More
Next Story