యూసుఫ్ పఠాన్ ఔట్.. అభిషేక్ ఇన్..
x

యూసుఫ్ పఠాన్ ఔట్.. అభిషేక్ ఇన్..

అఖిలపక్ష బృందంలో తమ పార్టీ సభ్యులను మార్చిన టీఎంసీ..


Click the Play button to hear this message in audio format

ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత ఉగ్రవాదంపై భారత్ తన సంకల్పాన్ని ప్రపంచ దేశాలకు బలంగా వినిపించాలనుకుంది. అందుకోసం 51 మందితో కూడిన ఏడు ప్రతినిధి బృందాలను వివిధ దేశాల రాజధానులకు పంపాలని నిర్ణయించింది. ఒక్కో బృందంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు, మాజీ మంత్రులు ఉంటారు. వీరందరిని కేంద్రమే ఎంపిక చేస్తుంది. ఈ ఏడు టీంలు 30 దేశాలను సందర్శిస్తాయి. ఈ కార్యక్రమానికి 'వన్ మిషన్, వన్ మెసేజ్, వన్ భారత్' అని పేరు పెట్టారు.

టీఎంసీ(TMC) నుంచి యూసుఫ్ పఠాన్..

టీఎంసీ నుంచి క్రికెటర్ నుంచి పొలిటీషియన్ ఎదిగిన ఆ పార్టీ ఎంపీ యూసుఫ్ పఠాన్‌(Yusuf Pathan)కు స్థానం కల్పించారు. అయితే తమను సంప్రదించకుండా యూసుఫ్ పఠాన్‌ను జట్టులో చేర్చుకోవడాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. అఖిల పక్ష బృందం నుంచి తప్పకుంటున్నట్లుగా ప్రకటించింది. కాగా తమకు ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే తామే ఐదుగురి పేర్లను సూచించే వాళ్లమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు.

తొలుత సుదీప్ బందోపాధ్యాయకు ఛాన్స్..

వాస్తవానికి కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు.. మొదట టీఎంసీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ సుదీప్ బందోపాధ్యాయను ప్రతినిధి బృందంలో ఉండాలని కోరారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ ఇతర టీఎంసీ నేతను సంప్రదించకుండానే యూసుఫ్ పఠాన్ పేరును ఖరారుచేసింది.

టీఎంసీ యూ టర్న్..

అఖిల పక్ష బృందం నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన టీఎంసీ .. ఆ తర్వాత యూ టర్న్ తీసుకుంది. యూసుఫ్ పఠాన్ స్థానంలో ఎంపీ అభిషేక్ బెనర్జీ పంపుతున్నట్లు పార్టీ ప్రకటించింది. పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee)కి కిరణ్ రిజిజు ఫోన్ చేసిన తర్వాత పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read More
Next Story