కేజ్రీవాల్‌పై ‘హైటెక్ టాయిలెట్ మిస్సింగ్’ ఆరోపణలు
ఢిల్లీ మాజీ సీఎం అధికారిక నివాసంలో ఇంట్లో విలువైన సామగ్రి కనిపించడం లేదని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ ఆరోపిస్తున్నారు.
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో విలువైన సామగ్రి మాయమైందని బీజేపీ ఆరోపిస్తుంది. ఆయన ఇల్లు ఖాళీ చేశాక రూ. కోటి విలువ చేసే శానిటరీ వేర్, టాయిలెట్ సీట్లు కనిపించలేదన్నది బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ ఆరోపణ.
అధికారిక నివాసాన్ని కేజ్రీవాల్ ఖాళీ చేసే ముందు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యుడీ) ఇంట్లో ఉన్న వస్తువులు, వాటి విలువను లెక్కకట్టి జాబితా తయారీ చేసింది. అయితే ఇంట్లో విలువైన టాయిలెట్ కవర్లు కనిపించకపోవడాన్ని బీజేపీ నాయకులు తప్పుబడుతున్నారు.
కేజ్రీవాల్ ఇంట్లో ఉన్న వస్తువుల జాబితా, వాటి ధరలకు పరిశీలిస్తే..
1. 16 వాయిస్ కంట్రోల్డ్ అల్ట్రా స్లిమ్ స్మార్ట్ 4K TV వాయిస్ కంట్రోల్డ్: రూ. 64 లక్షలు
2. OSADA ఫుల్ బాడీ మసాజ్ చైర్: రూ.4 లక్షలు
3. 8 మోటరైజ్డ్ రిక్లైనర్ సోఫాలు: రూ.10 లక్షలు
4. అంతర్నిర్మిత TV, AI విజన్ స్క్రీన్‌తో 2 స్మార్ట్ రిఫ్రిజిరేటర్‌లు: రూ.9 లక్షలు
5. 73 లీటర్ స్టీమ్ ఓవెన్: వాణిజ్య ఉపయోగం కోసం పెద్ద సైజ్ ఓవెన్, టచ్‌స్క్రీన్, 23 ఫంక్షన్‌లు, 160 ఆటో ప్రోగ్రామ్‌లు, అల్ట్రా-కూల్ డోర్, సీమ్‌లెస్ ఇంటిగ్రేటెడ్ సైడ్ ట్రిమ్‌లు రూ.9 లక్షలు
6. 50 లీటర్ 1000 వాట్ మైక్రోవేవ్ ఓవెన్: వాణిజ్య ఉపయోగం కోసం పెద్ద సైజు ఓవెన్, ఇన్వర్టర్ టెక్నాలజీ, 6.1 అంగుళాల TFT ఫుల్ కలర్ టచ్ డిస్‌ప్లే, 6 మైక్రోవేవ్ సెట్టింగ్‌లు, 5 డీఫ్రాస్ట్ ఫంక్షన్‌లు, 67 ఆటో ప్రోగ్రామ్‌లు, 120 వంట ప్రోగ్రామ్‌లు – రూ. 6 లక్షలు
7. 2 మౌంటెడ్ హుడ్స్ 140 సెం.మీ స్టెయిన్‌లెస్ స్టీల్ చిమ్నీ: ఎలక్ట్రానిక్ కంట్రోల్, ఆటోమేటిక్ మోషన్ & టెంపరేచర్ సెన్సార్ రూ.6 లక్షలు
8. BOSCH సిరీస్ 8 బిల్ట్-ఇన్ కాఫీ మెషిన్ (స్టెయిన్‌లెస్ స్టీల్ & బ్లాక్): ఒకే టచ్‌తో అన్ని ప్రముఖ కాఫీ పానీయాలను సిద్ధం చేస్తుంది రూ. ₹2.5 లక్షలు
9. 3 వేడి నీటి జనరేటర్లు (ఎయిర్ టు వాటర్ హీట్ పంప్): 450 Ltr. స్టోరేజ్ ట్యాంక్, LCD టెంపరేచర్ డిస్‌ప్లే, బిల్ట్-ఇన్ డయాగ్నస్టిక్స్ రూ. 22.5 లక్షలు
10. సుపీరియర్ వాటర్ సప్లై, శానిటరీ ఇన్‌స్టాలేషన్‌లు రూ.15 కోట్లు
11. LG 12 కేజీ ఫ్రంట్ లోడ్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ + డ్రైయర్: రూ.2.1 లక్షలు
12. SS రైలింగ్, మెట్ల కవరింగ్ (ఇత్తడి, షవర్ ఎన్‌క్లోజర్ ): రూ.1.2 కోట్లు
13. 20 గ్రాండ్ ఏజ్డ్ బ్రాస్ ఎంట్రన్స్ స్కోన్స్ అవుట్‌డోర్ లైట్లు: రూ.10 లక్షలు
14. ఆటోమేటిక్ స్లైడింగ్ సెన్సార్ చెక్క, గాజు తలుపులు: ₹70 లక్షలు
15. 24 అలంకార స్తంభాలు: ₹36 లక్షలు
ఎందుకంత ధర?
కేవలం శానిటరీ వేర్, టాయిలెట్లకే రూ. 1కోటి ఖర్చుచేశారని బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ ఆరోపిస్తున్నారు. పూర్తిగా ఆటోమేటిక్, సెన్సార్-అమర్చిన TOTO స్మార్ట్ టాయిలెట్ సీట్లు, ఆటోమేటిక్ ఓపెన్-క్లోజ్ సీట్, హీటెడ్ సీట్, వైర్‌లెస్ రిమోట్ డియోడరైజర్, ఆటోమేటిక్ ఫ్లషింగ్ వంటి ఫీచర్‌లు ఉండటమే ఈ టాయిలెట్ ప్రత్యేకత. ఈ టాయిలెట్ ధర రూ. రూ.10 లక్షలు నుంచి రూ. 12 లక్షల మధ్య ఉంటుంది.
కాషాయ పార్టీ ఆరోపణలపై ఢిల్లీ సీఎం అతిశీ స్పందించారు. "బీజేపీ కావాలంటే ఆ ఇంటిని తమ వద్ద ఉంచుకోవచ్చు. లేదంటే ఆ ఇంటిని ఇతర నాయకులకు కేటాయించవచ్చు. మేము ఢిల్లీ ప్రజల కోసం పని చేస్తాం. మాకు ఇల్లు, బంగ్లా, కారు గురించి పట్టింపు లేదు" అని విలేఖరులతో అన్నారు.