జబర్దస్త్‌ కమెడియన్ ఇంట్లో విషాదం..  బాధతో అవినాష్‌ ఇన్ స్టాలో పోస్ట్
x
అవినాష్‌ దంపతులు

జబర్దస్త్‌ కమెడియన్ ఇంట్లో విషాదం.. బాధతో అవినాష్‌ ఇన్ స్టాలో పోస్ట్

ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది' 'అంత తొందరగ మర్చిపోలేనిది.


'జబర్దస్త్' షోతో పాపులర్‌ అయిన ముక్కు అవినాష్ ఇంట విచారం నెలకొంది. తండ్రి కావాలని ఎంతో ఉవ్విళ్లూరిన అవినాష్‌ కోరిక నెరవేరకుండా పోయింది. బిడ్డని కోల్పోయిన విషయాన్ని ఇన్‌స్టాలో పంచుకున్నాడు అవినాష్‌. 'నా లైఫ్‌లో సంతోషమైన, బాధ అయినా.. నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను' అని అవినాష్‌ పోస్ట్‌ పెట్టారు.


బిగ్‌బాస్‌షోలో కూడా పాల్గొన్న అవినాష్‌ ప్రసుత్తం పలు ఈవెంట్స్, సినిమాలతో బీజీగా ఉన్న అవినాష్‌ తండ్రి కావాలనుకున్నా ఆ కోర్కె నెరవేరలేదని ఆయన పోస్ట్‌తో అర్థమైంది.

2021 నవంబరులో అవినాష్.. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు స్వయంగా అవినాష్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు బిడ్డని కోల్పోయిన విషయాన్ని పంచుకున్నాడు.

అయితే కొన్నాళ్లుగా భార్యతో కలిసి ప్రెగ్నెన్సీ విషయమై పలు వీడియోస్ చేస్తూ వచ్చిన అవినాష్ దంపతులు.. ఇప్పుడు బిడ్డ చనిపోవడంతో బాధపడుతున్నారు. ఈ విషయం ఎప్పటికీ జీర్ణించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన అవినాష్.. దీని గురించి ఎలాంటి ప్రశ్నలు అడిగి మరింత బాధపెట్టొద్దని చెప్పుకొచ్చాడు. అయితే పురిట్లోనే బిడ్డ చనిపోయిందా? లేదా ప్రసవించిన తర్వాత చనిపోయిందా? అనే విషయం అవినాష్ చెప్పలేదు.

'నా లైఫ్‌లో సంతోషమైన, బాధ అయినా.. నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది'


'అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్' అని కమెడియన్ అవినాష్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.

Read More
Next Story