దేశ రాజధానిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
x

దేశ రాజధానిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి అతిషి తెలిపారు.


ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మండోలాలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) సబ్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఫలితంగా దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి అతిషి మంగళవారం తెలిపారు.

"ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2:11 గంటల నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. యూపీలోని మండోలా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పిజిసిఐఎల్) సబ్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మండోలా నుండి ఢిల్లీకి 1200 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతుంది. అంతరాయం కారణంగా ఢిల్లీలోని తూర్పు, మధ్య ప్రాంతాలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు నేను కేంద్ర విద్యుత్ మంత్రి, PGCIL ఛైర్మన్‌తో కలవడానికి అపాయింట్‌మెంట్ కోరాను" అని అతిషి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Read More
Next Story