టీవీకే చీఫ్ విజయ్‌ ఎన్నికల ప్రచారానికి ఎన్ని కండీషన్లో..
x

టీవీకే చీఫ్ విజయ్‌ ఎన్నికల ప్రచారానికి ఎన్ని కండీషన్లో..

తన ప్రచారాన్ని అడ్డుకునేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందన్న విజయ్ ఆరోపణలకు మంత్రి కెఎన్ నెహ్రూ కౌంటర్ ఏమిటి?


Click the Play button to hear this message in audio format

తమిళగ వెట్రీ కజగం (TVK) చీఫ్ విజయ్(Vijay) ఎన్నికల ప్రచారానికి పోలీసులు 23 కండీషన్లు పెట్టారు. తిరుచిరాపల్లిలోని మరక్కడైలో సెప్టెంబర్ 13న బహిరంగసభకు అనుమతి ఇవ్వాలని విజయ్ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అందుకు వారు అనుమతి ఇస్తూనే ఆంక్షలు కూడా విధించారు.


‘ఇంతకూ కండీషన్లేంటి..’

‘బహిరంగ సభకు వెళ్లే మార్గంలో రోడ్‌షోలకు అనుమతి లేదు. ప్రచారం తిరుచిరాపల్లికి మాత్రమే పరిమితం. సభ 25 నిముషాల్లో ముగించాలి. ఉదయం 10.35 నుంచి 11 గంటల మధ్య మాత్రమే నిర్వహించాలి. ట్రాఫిక్ సమస్య దృష్ట్యా సభకు హాజరయ్యే వారు ఉదయం 9.35 గంటలకే వేదిక వద్దకు చేరుకోవాలి. కాన్వాయ్‌లో విజయ్ వాహనంతో పాటు మరో ఐదింటికి మాత్రమే అనుమతి. వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలి. వేదిక వద్ద తాగునీరు, ప్రథమ చికిత్స, అంబులెన్స్, అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి.’ అని పోలీసులు పెట్టిన షరతులకు టీవీకే అంగీకరించింది.


‘ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే..’

తన ప్రచారాన్ని అడ్డుకునేందుకు అధికార డీఎంకే ప్రయత్నిస్తోందని విజయ్ చేసిన ఆరోపణలకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మంత్రి కెఎన్ నెహ్రూ స్పందించారు. ‘‘ప్రచారానికి ఎంచుకున్న వేదిక ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. అడ్డంకులు సృష్టించాల్సిన అవసరం మాకు రాలే" అని ఆయన తిరుచిరాపల్లిలో విలేకరులతో అన్నారు.

Read More
Next Story