ఓటు చోరీ పోర్టల్‌ను ప్రారంభించిన కాంగ్రెస్
x

'ఓటు చోరీ' పోర్టల్‌ను ప్రారంభించిన కాంగ్రెస్

తన పోరాటానికి మద్దతు ఇవ్వాలన్న రాహుల్..


Click the Play button to hear this message in audio format

ఎన్నికలలో అవకతవకలకు వ్యతిరేకంగా పోరాడుతోన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరో అడుగు ముందుకేశారు. votechori.in/ecdemand పేరుతో కాంగ్రెస్(Congress) పార్టీ ఓ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. పేరు, పుట్టిన తేదీ, వృత్తి, ఫోన్ నంబర్, ఈ మెయిల్‌ ఎంటర్ చేసి ఇందులోని లాగిన్ అయి ఎలక్షన్ కమిషన్(EC) జవాబుదారితనాన్ని ప్రశ్నించవచ్చు. పక్కనే ఉన్న ‘రిపోర్టు ఓట్ చోరీ’ బటన్ ప్రెస్ చేసి.. పేరు, సెల్ నంబర్‌తో లాగిన్ అయి ..ఓటరు అభిప్రాయాన్ని షేర్ చేయవచ్చు. దీంతో పాటు ప్రతిపక్ష పార్టీ్ డిమాండ్‌కు మద్దతుగా ఫోన్ నంబర్‌ (9650003420)కు మిస్డ్ కాల్ ఇవ్వాలని రాహుల్ కోరారు.

సర్టిఫికెట్ జారీ..

పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్న ప్రతిఒక్కరికి "నేను ఓటు చోరీ వ్యతిరేకం’’ అని రాసి ఉన్న సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ సర్టిఫికెట్‌‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కోశాధికారి అజయ్ మాకెన్ సంతకాలు ఉంటాయి.

2024 సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో జరిగిన అవకతవకలపై రాహుల్ గాంధీ ఇటీవల ఢిల్లీలోని AICC కార్యాలయంలో ప్రెసెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read More
Next Story