వీవీఐపీ పాస్‌లు రద్దు, వాహనాల ప్రవేశం నిషేధం
x

వీవీఐపీ పాస్‌లు రద్దు, వాహనాల ప్రవేశం నిషేధం

మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాటలో 30 మంది చనిపోగా 60 మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనతో యూపీ సీఎం యోగి అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు.


Click the Play button to hear this message in audio format

మహా కుంభమేళా(Maha Kumbh)లో తొక్కిసలాట(Stampede) ఘటనతో యూపీ యోగీ అదిత్యనాథ్ సర్కార్ అప్రమత్తమైంది. ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతను ప్రత్యేక కార్యదర్శి హోదా కలిగిన ఐదుగురు అధికారులకు అప్పగించారు. వీరంతా ఫిబ్రవరి 12 వరకు ప్రయాగరాజ్‌లో ఉండి పరిస్థితులను చక్కబెడతారు. అధికారులకు మరికొన్ని సూచనలు కూడా చేశారు ముఖ్యమంత్రి యోగి. మేళా ప్రాంతాన్ని పూర్తిగా వాహన రహిత జోన్‌గా ఉంచాలని ఆదేశించారు. ప్రముఖుల వాహనాలకు సైతం ప్రత్యేక పాసులు జారీ చేయవద్దని సూచించారు. రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.


అధికారుల నియామకం..

2019 కుంభ మేళాలో ప్రయాగరాజ్(Prayagraj) డివిజనల్ కమిషనర్‌గా పనిచేసిన ఆశిష్ గోయల్, ఏడీఏ మాజీ వైస్ చైర్మన్ భాను గోస్వామి కూడా ఏర్పాట్ల పరిశీలనకు నియమించారు. భక్తుల భద్రతకు సంబంధించి ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించి బసంత్ పంచమికి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించారు. ఆదేశించారు. ప్రతి భక్తుడు పుణ్యస్నానాలు ఆచరించి క్షేమంగా తిరిగే వెళ్లేలా చూడాలని ప్రభుత్వ సిబ్బంది, వలంటీర్లకు సూచించారు.

తొక్కిసలాటలో 30 మంది మృతి 60 మందికి గాయాలు..

మౌని అమావాస్య(Mauni Amavasya) పర్వదినం సందర్భంగా బుధవారం ఉదయం పవిత్ర స్నానానికి భక్తుల లక్షలాదిగా తరలివచ్చారు. వారంతా ఒకే చోట గుమికూడటంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 30 మంది చనిపోగా.. 60 మంది గాయపడిన విషయం తెలిసిందే.

వీడియో కాన్ఫరెన్స్..

విషాదకర ఘటన నేపథ్యంలో..ముఖ్యమంత్రి యోగి పోలీసు ఉన్నతాధికారులు, పలు జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భక్తుల రద్దీ, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ప్రయాగరాజ్, కౌశాంబి, వారణాసి, అయోధ్య, మిర్జాపూర్, బస్తీ, జౌన్‌పూర్, చిత్రకూట్, బందా, అంబేద్కర్‌నగర్, ప్రతాప్‌గఢ్, సంత్ కబీర్ నగర్, భదోహి, రాయ్‌బరేలీ గోరఖ్‌పూర్ జిల్లాల అధికారులు సీఎంకు వివరించారు. ప్రయాగరాజ్ ఏడీజీ, కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం.. ఘాట్‌ల వద్ద సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. తొక్కిసలాట ఘటన కంటే కొన్ని రోజుల ముందు, గ్యాస్ సిలిండర్ పేలడంతో మేళాలో 18 టెంట్లు అగ్నికి ఆహుతి అయిన విషయం తెలిసిందే.

Read More
Next Story