‘పశ్చిమ బెంగాల్ తరహా బిల్లుకు మద్దతిస్తాం’
x

‘పశ్చిమ బెంగాల్ తరహా బిల్లుకు మద్దతిస్తాం’

మహా వికాస్ అఘాడి (MVA) తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది చెప్పాల్సిన అవసరం లేదని, ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని శరత్ పవర్ చెప్పారు.


అత్యాచార నిరోధన బిల్లును పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ తరహా బిల్లును మహారాష్ట్ర శాసనసభలో కూడా ప్రవేశపెట్టాలని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ డిమాండ్ చేస్తున్నారు. ఆ బిల్లుకు తమ సంపూర్ణ ఉంటుందని కూడా హామీ ఇచ్చారు.

అత్యాచార బాధితురాలు మరణించినా, మానసిక స్థితి కోల్పోయి నిస్సహాయ స్థితికి చేరుకున్నా.. దారుణానికి ఒడిగట్టిన వ్యక్తికి మరణశిక్ష, రేప్, గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన వారికి పెరోల్‌కు కూడా అవకాశం ఇవ్వకుండా జీవిత ఖైదు విధించాలని మమత సర్కారు బిల్లును రూపొందించింది.

కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్‌ అండ్ హాస్పిటల్‌ సెమినార్ హాల్‌లో 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలు విశ్రాంతి తీసుకుంటుం డగా..అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చింది.

ఫుల్ సపోర్ట్..

"పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును మహారాష్ట్రలోనూ పెట్టాలి. బిల్లుకు నా పార్టీ మద్దతు ఇస్తుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రస్తుతం శాసనసభ సమావేశాలు ఉండవు. కాబట్టి మేం ఎన్నికల ప్రచారంలో అత్యాచార నిరోధన బిల్లును హైలైట్ చేస్తాం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తాం’’ అని పవార్ చెప్పారు.

రాష్ట్రపతి వద్ద మహారాష్ట్ర శక్తి బిల్లు..

మహా వికాస్ అఘాడి (ఎంవిఎ పాలనలో ఆమోదం పొందిన శక్తి క్రిమినల్ లాస్ (మహారాష్ట్ర సవరణ) బిల్లు - 2020ని అమలు చేయాలని రాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్‌సిపి (ఎస్‌పి) నాయకుడు అనిల్ దేశ్‌ముఖ్ డిమాండ్ చేస్తున్నారు. మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠినమైన శిక్షలు విధించాలని కోరుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది.

‘ఆ హక్కు చరిత్రకారులకు ఉంది’

సూరత్‌ను ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడూ దోచుకోలేదని, తప్పుడు చరిత్రను ప్రజలకు అందించవద్దని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ చేసిన వ్యాఖ్యలపై పవార్‌ మండిపడ్డారు. ‘‘మరాఠా యోధుడు సూరత్‌ను దోచుకున్నాడా? లేదా? అనేది వివాదాస్పద అంశం. ఛత్రపతి శివాజీ మహారాజ్ (సూరత్) దోపిడీకి పాల్పడలేదని ఫడ్నవీస్ చెప్పాడు. శివాజీ మహారాజ్ గురించి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని కూడా ఆరోపించాడు. ఏళ్లపాటు పరిశోధనలు చేసి వాస్తవాలను తెలపడం చరిత్రకారుల హక్కు. నిన్న ప్రసిద్ధ చరిత్రకారుడు-రచయిత జైసింహరావ్ పవార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సూరత్‌కు రెండుసార్లు దాడిచేసి దోచుకున్నారని చెప్పారు. మరో చరిత్రకారుడు ఇంద్రజిత్ సావంత్ కూడా ఇదే విషయం చెప్పారు’’ అని అని NCP (SP) చీఫ్ పేర్కొన్నారు.

అనుభవం లేనివారికి నిర్మాణ పనులా?

ఇటీవల సింధుదుర్గ్ జిల్లాలో శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై పవార్ మాట్లాడుతూ.. నిర్మాణ బాధ్యతలు అప్పగించిన శిల్పికి సరైన అనుభవం ఉందన్నారు.

"అతను ఇంత పెద్ద పనిని ఇంతకు ముందెన్నడూ చేయలేదు. అయినా ఆయనకు పని అప్పగించారు. విగ్రహం కూలడానికి బలమైన గాలులు కారణమని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెబుతున్నారు. అయితే ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్ శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అరవై ఏళ్ల ఏర్పాటు చేసిన ఆ విగ్రహం ఇప్పటికీ బలంగా ఉంది. ఏదైనా చెబితే నమ్మేలా ఉండాలి” అని చురకలంటించారు.

ఆ విషయం ఇప్పుడు అవసరం లేదు.

మహా వికాస్ అఘాడి (MVA) తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది చెప్పాల్సిన అవసరం లేదని, ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని శరత్ పవర్ చెప్పారు. ‘‘త్వరలో సీట్ల పంపకాల ప్రక్రియ ర్తి చేసి ఎన్నికల ప్రచారాన్ని త్వరగా ప్రారంభించాలని అనుకుంటున్నా. సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు ఎంవీఏ నేతలతో సమావేశాలుంటాయి.నవంబర్ రెండో వారంలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఎంవిఎలో రైతులు, కార్మికుల పార్టీ (పిడబ్ల్యుపి), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సిపిఐ-ఎం) కూడా ఉండాలని కోరుకుంటున్నా’’నని చెప్పారు. "రాష్ట్రంలో ఆ పార్టీలు కొంత ప్రభావాన్ని చూపాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఎంవిఎకు ఈ పార్టీల నేతలు సాయం చేశారు." అని చెప్పారు.

నాగ్‌పూర్‌ను గోవాను కలిపే శక్తిపీఠ్ ఎక్స్‌ప్రెస్‌వే అవసరం లేదు. దానికి బదులు ప్రస్తుతం ఉన్న రోడ్లు, హైవేలను అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు పవార్.

Read More
Next Story