రాజ్యాంగాన్ని మార్చే శక్తి ‘బీజేపీ’కి లేదు: రాహూల్ గాంధీ
రాజ్యాంగాన్ని మార్చే శక్తి బీజేపీకి లేదని, ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ రాహూల్ గాంధీ అన్నారు. న్యాయ్ యాత్ర ముగింపు సందర్భంగా ఆయన ముంబైలో..
రాజ్యాంగాన్ని మారుస్తున్నామని బీజేపీ ప్రకటనలు చేస్తోందని అయితే వారికి అంత శక్తి లేదని కాంగ్రెస్ ఎంపీ రాహూల్ గాంధీ అన్నారు. దేశ ప్రజలంతా కాంగ్రెస్ తోనే ఉన్నారని ఆయన ఉద్ఘాటించారు. కర్నాటక ఎంపీ అనంత్ కుమార్ హెగ్దే ఇటీవల చేసిన వ్యాఖ్యలను రాహూల్ దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేశారు. అనంత్ కుమార్ హెగ్దే మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చడానికి మాకు మూడింట రెండొతుల మెజారిటీ అవసరమని అన్నారు. అయితే బీజేపీ వాటిని ఖండించింది. ఇది అతని వ్యక్తిగతమని వెల్లడించింది.
మహాత్మాగాంధీ సొంత ఇల్లయిన మణిభవన్ నుంచి ఆగష్టు క్రాంతి మైదాన్ వరకు రాహూల్ గాంధీ చేపట్టిన ‘ న్యాయ్ సంకల్ప్ పాదయాత్ర’ అనంతరం ఓ హలులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ( ఈ ఇంటి నుంచే 1942 లో మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించారు.)
ఈ ఎన్నికల మధ్య పోరు కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉందని, ఇది పార్టీ సిద్దాంతాల పరంగానే కాకుండా భావ వ్యక్తీకరణ కోసం జరుగుతున్న పోరాటంగా రాహూల్ గాంధీ అభివర్ణించారు. దేశం కేంద్రంగా పాలన నడవాలని కాంగ్రెస్ కోరుకుంటోందని, కానీ బీజేపీ మాత్రం వ్యక్తి కేంద్రంగా పాలన నడుపుతోందని విమర్శించారు.
దీనికి విరుద్దంగా అధికార వికేంద్రీకరణ జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని, ప్రజల వాణిని ప్రభుత్వం వినాలని వయనాడ్ ఎంపీ అన్నారు. కాంగ్రెస్ ఎంపీ తన 63 రోజుల 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'ను ముంబైలో ముగించారు, సెంట్రల్ ముంబైలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక 'చైత్యభూమి' వద్ద ఆయనకు నివాళులు అర్పించి, రాజ్యాంగ ప్రవేశికను చదివారు. జనవరి 14న ఇది మణిపూర్ నుంచి ప్రారంభం అయింది.
Next Story