సీట్ల కోసం కూటమిలో సిగపట్లు.. సేన ఎత్తులు.. ఎన్సీపీ, కాంగ్రెస్ అలకలు
x

సీట్ల కోసం కూటమిలో సిగపట్లు.. సేన ఎత్తులు.. ఎన్సీపీ, కాంగ్రెస్ అలకలు

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నప్పటికీ మహరాష్ట్ర కూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కి రాలేదు. కూటమితో భరించలేక ఇప్పటికే ప్రకాశ్ అంబేడ్కర్ తన దారి తను చూసుకున్నాడు.


భారత్ లో ఎన్నికల సందడి నెలకొంది. ఓ వైపు ప్రత్యర్థి పార్టీ వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తూ, ప్రచారాలను కొనసాగిస్తూ దూకుడుగా ఉంటే.. దేశంలోని విపక్ష పార్టీలతో జట్టుకట్టి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఇండి కూటమిలో మాత్రం ఇంకా సీట్ల పీఠముడి వీడడం లేదు. ఇప్పటికే కూటమి ప్రతిపాదన తీసుకొచ్చిన బిహార్ సీఎం నితీష్ కుమార్ ఇండి కూటమిని వీడి ఎన్డీఏలో చేరాడు. మరోవైపు టీఎంసీ కూడా హ్యండిచ్చింది. పరిస్థితి ఇలా ఉంటే మహరాష్ట్రలోనూ పాత మహ అఘాడీలో కూడా సీట్ల పంపిణీ విషయంలో లుకలుకలు మొదలయ్యాయి.

ఉద్ధవ్ థాకరే శివసేన (UBT), ప్రకాష్ అంబేద్కర్ పార్టీ వంచిత్ బహుజన్ ఆగధి (VBA)తో పొత్తు గురించి కాంగ్రెస్ పార్టీ బుధవారం (మార్చి) చర్చలు జరిపింది. ఇప్పటికే మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు సీటు షేరింగ్‌ను ఖరారు చేయడంలో జాప్యం జరగడం పట్ల అసంతృప్తిగా ఉన్న అంబేద్కర్ తను కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు.
ప్రకాష్ అంబేడ్కర్ ఇప్పటికే కూటమిలోని పార్టీలు ప్రకటించిన స్థానాలకు తన అభ్యర్థులను సైతం నిలబెడుతున్నట్లు వెల్లడించారు. మాకు మీకు మద్దతు కావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రకాశ్ అంబేడ్కర్ కు లేఖ రాసిన కొద్ది రోజులకే ఆయన తన దారి తను చూసుకున్నాడు. తమపై శివసేన, అజిత్ పవార్ వర్గాలు విశ్వాసం కొల్పోయాయని, కనీసం మాతో మాట్లాడటానికి కూడా వారు ఆసక్తి చూపించట్లేదని అంబేడ్కర్ వాదనగా ఉంది.
కూటమి స్థిరంగా ఉందా?
కూటమి నుంచి వైదొలిగిన తరువాత, అంబేద్కర్ ది ఫెడరల్‌తో మాట్లాడారు. " కాంగ్రెస్ పోటీ చేస్తున్న ఏడు స్థానాల్లో కొల్హాపూర్, నాగపూర్ స్థానాలుకు మా మద్ధతు ఉంటుంది" అని ఆయన ప్రకటించారు. మిగిలిన వాటికి కూడా మద్ధతు తెలిపే అంశం పరిశీలనలో ఉందని, కానీ ఇప్పుడు చెప్పలేమని ఆయన వెల్లడించారు.
తాను చివరిసారిగా 1999లో గెలిచిన అకోలా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో అంబేద్కర్ పోటీ చేయనున్నారు. అయితే మహ వికాస్ అఘాడీలో ఇప్పటికీ సీట్ల షేరింగ్ లో ఎలాంటి స్పష్టత లేదన్నారు. తొలిదశ ఎన్నికలకు వారాల గడువు మాత్రమే ఉందని, ఎన్సీపీ, శివసేన సీట్ల విషయంలో సీరియస్ నెస్ ఏమాత్రం కనిపించడం లేదని విమర్శించారు. వాళ్ల కోసం మేము వేచి ఉండలేమని వెల్లడించారు. పరిస్థితి ఇలా ఉంటే శివసేన రాష్ట్రంలోని 16 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. దీనిపై మిగిలిన భాగస్వామ్య పక్షాలు అసంతృప్తి, నిరసన వ్యక్తం చేశాయి.
ఠాక్రే ఏకపక్ష ఎత్తుగడ..
ఉద్దవ్ ఏకపక్షంగా కూటమిని కాదని సొంతంగా 16 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో ఎన్సీపీ, కాంగ్రెస్ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముంబైలోని నార్త్ వెస్ట్ సీటు ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరూపమ్ అయితే కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ వైదొలగాలని పార్టీ హై కమాండ్ ను కోరారు. తను పోటీ చేయాలనుకున్న స్థానం నుంచి గజానన్ కీర్తికర్ కుమారుడు, అమోల్ కీర్తికర్ ను సేన ప్రకటించడంపై ఆయన భగ్గుమని ఈ మేరకు పార్టీకి లేఖరాసి ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికల్లో నిరూపమ్ ఈ స్థానం నుంచి గెలుపొందారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో ఒంటరిగా ఉన్న ప్రజలకు ఆహారం అందించడానికి ఉద్దేశించిన నిధులను స్వాహా చేయడంలో గజానన్ హస్తం ఉందని నిరూపమ్ ఆరోపణలు గుప్పించారు. ఇదే జరిగితే మహారాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇవే ఆఖరి ఎన్నికలు అవుతాయని నిరూపమ్ వాదిస్తున్నారు. ఇదే సమయంలో ఠాక్రే సేనలోని వర్గం అతనిని అభ్యర్థిగా ప్రకటించిన కొద్దిసేపటికే "ఖిచ్డీ స్కామ్"లో అతని పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతనికి నోటీసు అందించింది.
రాష్ట్రానికి చెందిన ఇతర కాంగ్రెస్, ఎన్‌సిపి నాయకులు కూడా థాకరే యొక్క చర్య "ఏకపక్షం" అని ఫెడరల్‌తో అన్నారు. "కూటమి స్ఫూర్తికి అనుగుణంగా లేదు". మిత్రపక్షాల మధ్య భివాండి, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ సెంట్రల్, సాంగ్లీ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే దానిపై చర్చలు “అసంపూర్తిగా” ఉన్నాయని, “భాగస్వామ్య పక్షాలు ఏ ఒక్కదానికీ ఏకభిప్రాయం లేకుండా తమ అభ్యర్థిని ప్రకటించకూడదని నిర్ణయించుకున్నారని వర్గాలు తెలిపాయి. ”
సాంగ్లీపై గొడవ ఎవరి పట్టు వారిదే..
“మేము ఇప్పటికీ సీటు షేరింగ్ ఫార్ములాను అనుసరిస్తున్నాం. చాలా వాటిపై ఓ క్లారిటీ వచ్చింది. మరో నాలుగు లేదా ఐదు స్థానాలపై మాత్రమే ఇంకా ఏకాభిప్రాయం సాధించవలసి ఉంది. ఈ సీట్ల పై కూటమిలోని అన్ని పార్టీలు క్లెయిమ్ చేస్తున్నాయి. అయితే ఠాక్రే ఇప్పటికే తన పార్టీ జాబితాను ప్రకటించడం అందులోనూ పొత్తు తేలకుండా ఉన్నా స్థానాలపై కూడా అభ్యర్థులను ప్రకటించడం మాకు ఆశ్చర్యం కలిగించింది.
సాంగ్లీ సీటు మాకు చర్చనీయాంశం కాదు ఎందుకంటే మా సర్వేలన్నీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. అందుకే అక్కడి నుంచి విశాల్ పాటిల్ ను రంగంలోకి దింపాలని అనుకుంటున్నాం, సేన ఇక్కడి నుంచి చంద్రహార్ పాటిల్ ను పోటికి నిలిపింది. ఇది ఆమోదయోగ్యం కాదు. మేము ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడి, ఈరోజే దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము, ”అని థోరట్ ది ఫెడరల్‌తో అన్నారు.
కొన్ని స్థానాల్లో పార్టీ వెనక్కి తగ్గవచ్చు లేదా "కాంగ్రెస్, ఎన్‌సిపి అభ్యర్థితో స్నేహపూర్వక పోటీ" ఇవ్వవచ్చని సేన వర్గాలు అంటున్నాయి. అయితే "2019లో సేన గెలిచిన నియోజకవర్గాలపై మా పట్టు మాత్రం సడలదు" అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
ఉద్ధవ్ థాకరేను "ఏక్నాథ్ షిండే మోసం చేసిన" తీరు కారణంగా పార్టీ నిర్వహించిన సర్వేలు ఆయనకు "భారీ మద్దతు, సానుభూతి"ని సూచించాయని, ప్రభుత్వాన్ని "బిజెపి కూల్చివేసింది" అని సేన సీనియర్ నాయకుడు ఫెడరల్‌తో అన్నారు. దీని ప్రకారం" సేన మాత్రమే కాదు, మా మిత్రపక్షాలు కూడా క్షేత్రస్థాయిలో ఈ సెంటిమెంట్ నుంచి ప్రయోజనం పొందుతాయి, అయితే వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం ద్వారా మేము దానిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాము." అని ఆయన పేర్కొన్నారు.
పవార్ విధేయులు వీధుల్లోకి..
ముంబై నార్త్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ మాజీ నేత సంజయ్ దిన పాటిల్‌ను బరిలోకి దింపాలన్న సేన నిర్ణయం కూడా పవార్ పార్టీలోని ఒక వర్గానికి మింగుడు పడలేదు. 2019లో ముంబై నార్త్ ఈస్ట్ సీటును ఎన్‌సిపి అభ్యర్థిగా గెలుపొందిన పాటిల్, సేన బిజెపికి మిత్రపక్షంగా ఉన్నప్పుడు 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు శివసేనలోకి మారారు.
పవార్ NCP ప్రభావవంతమైన విభాగం పాటిల్ మారడాన్ని "శరద్ పవార్ నమ్మక ద్రోహం"గా చూస్తోంది, అయినప్పటికీ అతను ఇప్పుడు పవార్ మిత్రపక్షంగా ఉన్న సేన అభ్యర్థిగా తనను తాను ప్రకటించింది. సీటు షేరింగ్ ఫార్ములా ప్రకారం ముంబై నార్త్ ఈస్ట్ సీటును ఠాక్రే పార్టీకి ఇవ్వడానికి పవార్ "విముఖంగా లేడు" అయినప్పటికీ, పాటిల్ అభ్యర్థిత్వం చాలా మంది పవార్ విధేయులకు కోపం తెప్పించిందని, ఠాక్రే అభ్యర్థులను ప్రకటించిన వెంటనే, సేనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో నిరసనలు తెలిపారు.
భివాండి, సాంగ్లీ, ముంబై నార్త్‌వెస్ట్, ముంబై నార్త్‌లను అంగీకరించవద్దని కాంగ్రెస్ నాయకులు తమ పార్టీని కోరారు. వెంటనే ఈ విషయంపై సేనతో మాట్లాడాలని కొంతమంది నాయకులు ఫెడరల్ తో చెప్పారు. కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్‌ను కూడా సంప్రదించవచ్చు. "ఇండి కూటమి నుంచి నిష్క్రమించడంపై తన వైఖరిని పునరాలోచించడానికి ఆయన నిరాకరించినప్పటికీ, VBA ప్రభావం ఉన్న స్థానాల్లో మా అభ్యర్థులకు మద్దతు ఇస్తానని ఆయన చేసిన వాగ్దానాన్ని గౌరవించండి" అని కోరవచ్చు.
Read More
Next Story